Ag

1. Aga Aga is defined as తురక సేనాధిపతి.
2. Again Again is defined as మళ్ళీ, తిరిగి, పునః. I did not abuse him అతన్ని నేను బదులుకుతిట్టలేదు. It is half as big * అది వకటికి వకటిన్నరంత పెద్దదిగా వున్నది. thishouse is as large * as the other యీ యిల్లు ఆ యింటికి రెండింతలు పెద్దదిగా వున్నది.over * మళ్లీ ఒకసారి. * and * మాటి మాటికి, పదేపదే, మళ్లీ మళ్లీ.
3. Against Against is defined as మీద, పైన, యెదురుగా, విరుద్ధముగా, ప్రతికూలముగా. he swam *the stream ప్రవాహానికి యెదురు యీదినాడు. a charm * posion విషము దిగేమంత్రము. he set himself * us మాకు శత్రువుగా యేర్పడ్డాడు. Have this ready *tomorrow యిది రేపటికి సిద్ధముగా వుండవలెను. you must be ready * myarrival నేను వచ్చి చేరేటప్పటికి నీవు సిద్ధముగా వుండవలెను. they leaned theirlances * the wall వాండ్లు యీటేలను గోడకు ఆనించినారు. he harbours ill will *me వాడు ఆంతర్యములో నా మీద విరోధము పెట్టుకొన్నాడు. ants provide food *rainy season చీమలు వాన కాలమునకై మేతను జాగ్రతచేసి పెట్టుకొంటవి. he made acomplaint * me నామీద ఫిర్యాదు చేసినాడు. a sin * god దేవుని విషయమైన చేసినపాపము. he spoke * me నాకు ప్రతికూలముగా మాట్లాడినాడు, విరోధముగామాట్లాడినాడు. * the law న్యాయవిరోధముగా, చట్టవిరోధముగా. he laid this by *they returned వాండ్లు మళ్లీ వత్తురని దీన్ని దాచిపెట్టినాడు, లేక,పెట్టిపెట్టినాడు. this was quite * the hair or * the grain యిది అత్యంత విరుద్ధముగా వుండెను, అత్యసహ్యముగా వుండెను. the house over * mine మా యింటికియెదురుగా వుండే యిల్లు.
4. Agallochum Agallochum is defined as అగరుగంధపు చెక్క.
5. Agape Agape is defined as నోరుతెరుచుకొని.
6. Agaric Agaric is defined as the mushroom కుక్కగొడుగు. Ainslie, I. 5.
7. Agast Agast is defined as వకతరహా రాయి, దీన్ని శిఖా వుంగరాలు మొదలైన వాటికి వేస్తారు.
8. Agate Agate is defined as add, A+ says యిస్మ. The Kannadi says వైడూర్యము. so says Perceval.
9. Age Age is defined as వయస్సు, ప్రాయము, యీడు, ఆయుస్సు, యుగము. at an early *బాల్యమందు. he was cut off in the flower of his * మంచి వయస్సులో వాణ్నితుంచుకొని పోయినది. as you advance in * నీకు వయస్సు రాగారాగా. he is faradvanced in * వాడికి నిండా యేండ్లు చెల్లింది. In the present * యీ కాలములో. Inthe former * పూర్వకాలములో. old * వృద్దాప్యము. he is under * వాడికి వయస్సురాలేదు, వ్యవహార యోగ్యమైన కాలము రాలేదు. he is of * వాడికి వయస్సు వచ్చింది,వ్యవహారదశ వచ్చింది. It is an * since I saw you నిన్ను చూచి బహు దినాలుఅయినది. I consider a day as an * during your absence నాకు నీవు లేనిదినముఒక యుగముగా వున్నది. I have been waiting here this age బహు సేపటినుంచికాచుకొని వున్నాను or బహుదినములుగా కాచుకొని వున్నాను. they held that landfrom * to * వాండ్లు ఆ నేలను తరతరాలుగా అనుభవించిరి. the golden *కృతయుగము. the silver * త్రేతాయుగము. the brazen * ద్వాపరయుగము.the iron * కలియుగము.
10. Aged Aged is defined as వయసు చెల్లిన, ముసలి. * ten పదియేండ్లుగల. an * man ముసలివాడు.an aged woman ముసలిది. an * tree ముదురుచెట్టు. the * వృద్ధులు.
11. Agency Agency is defined as మంత్రాంగము, మంత్రిత్వము, కర్తృత్వము, గుమాస్తాగిరి. this waseffected thro, the * of his friends వాని స్నేహితుల వ్యాపకత్వముచేత యీపనితలకట్టినది. this is ascribed to his * యిది ఆతని ప్రాజాపత్యమువల్ల కలిగిన దనిఅంటారు. this is ascribed to preternatural * యిది ఒక ఉత్సాతమువల్ల కలిగినదని అంటారు. a mercantile * వర్తకులు, వ్యాపారము.
12. Agent Agent is defined as కర్త, కారకుడు, గుమాస్తా, వకీలు, వ్యవహారము చూచేవాడు, మంత్రి. hewas the chief * in this business యీ పనిలో వీడు ముఖ్యుడు, ప్రముఖుడు. afree * స్వతంత్రుడు. he was a willing * in their hands వాండ్లు వాణ్ని యెట్లాఆడిస్తే అట్లా ఆడుతూ వుండినాడు. I was an unwilling * in their hands నాకుఇష్టము లేదు గాని వాండ్లు యేట్లా ఆడిస్తే అట్లా ఆడవలసి వచ్చింది. a mercantile *అడతిదారుడు. a chemical * సాధకము, సాధనము. * in grammar (Nominative) కర్త.
13. Aggrandizement Aggrandizement is defined as గొప్పతనము, అభివృద్ధి.
14. Aggravated Aggravated is defined as అధికమైన, అతిశయించిన. this is * injustice యిది మరీఅన్యాయము, అతి అన్యాయము.
15. Aggravation Aggravation is defined as అధికము చేయడము, బలము చేయడము. this excuse is an *of your crime యీ సాకు నీ తప్పును మరీ అధికము చేస్తుంది.
16. Aggregate Aggregate is defined as మొత్తమైన.
17. Aggression Aggression is defined as విరోధ మారంభము చేయడము, ముందుగా దుర్మాగ ్ ము చేయడము,ముందుగా చేయిమించడము.
18. Aggressor Aggressor is defined as మొదట చెయిమించినవాడు, మొదట నోరుమించినవాడు,కలహమారంభము చేసినవాడు.
19. Aggrieved Aggrieved is defined as దుఃఖపడ్డ, అన్యాయము పొందిన.
20. Aghast Aghast is defined as ఆశ్చర్యపడి, వెరగుపడి. at these words he stood * యీ మాటలువిని మానై నిలిచిపోయినాడు.
21. Agile Agile is defined as లాఘవముగల, చులకనైన, చురుకుగల. stags are very * లేండ్లు బహులాఘవము గలవి.
22. Agility Agility is defined as లాఘవము. with * లాఘవముగా, చివుక్కున, చంగున.
23. Agio Agio is defined as వట్టము.
24. Agitated Agitated is defined as కదిలించిన, కలియబెట్టిన, కలవరపడ్డ.
25. Agitatedly Agitatedly is defined as కలవరముగా, తొందరగా.
26. Agitation Agitation is defined as కదలడము, అల్లాటము, తొందర, కలవరము, అల్లోలకల్లోలము. Inconsequence of the * of this subject యీ సంగతిని కలియబెట్టినందువల్ల.
27. Agitator Agitator is defined as కదిలించేవాడు, కలియబెట్టేవాడు, ఎచ్చరించేవాడు.
28. Ago Ago is defined as కిందట, మునుపు, ముందర. Two or three days * రెండు మూడుదినాలకిందట, రెండు మూడు దినాలకు ముందర. long * బహు దినాల కిందట, శానాసేపుకుముందర.
29. Agog Agog is defined as ఆతురముగా, అభిలాషగా. these words set him * to go there యీమాటల చేత వాడికి అక్కడికి పోవలెనని ఆతురము పుట్టినది. what makes you so *to abuse people మనుష్యులను తిట్టడానకు నీకింత పదటమేమి.
30. Agoing Agoing is defined as పోతూ, చేస్తూ. he set the watch * ఆ గడియారమును తిరిగేలాగుచేసినాడు.
31. Agony Agony is defined as వేదన, యాతన, సంకటనము, బాధ. the moral * మరణవేదన.
32. Agrarian Agrarian is defined as పొలమును గురించిన, క్షేత్రవిషయమైన.
33. Agreeable Agreeable is defined as అనుగుణ్యమైన, తగిన, మనోజ్ఞమైన, యింపైన. this conduct was* to orders యిట్లా చేసినది, ఆజ్ఞకు అనుగుణ్యముగా వుండినది. If you are * wewill go ( this is base English for " if you are willing " ) నీవు మెచ్చితేమేము పోతాము. They were not * మెచ్చలేదు.
34. Agreeableness Agreeableness is defined as ఇంపు, మనోజ్ఞత, పొంకము. from the * of this situationయీ స్థలము యొక్క రమ్యతవల్ల.
35. Agreeably Agreeably is defined as అనుగుణ్యముగా, రమ్యముగా. * to your orders తమ ఆజ్ఞప్రకారము. we were surprized at his return అతడు తిరిగి వచ్చినాడు యిందుకుఆశ్చర్యపడి సంతోషించినాము.
36. Agreed Agreed is defined as ఇమిడిన, సరిపడిన, పొసగిన, గిట్టిన.
37. Agreement Agreement is defined as ఒడంబడిక, సమాధానము, పొందిక, ఇమిడిక. they came to an *సమాధాన పడ్డారు.
38. Agricultural Agricultural is defined as వ్యవసాయ సంబంధమైన, సేద్య సంబంధమైన.
39. Agriculture Agriculture is defined as కృషి, వ్యవసాయము, సేద్యము.
40. Agriculturist Agriculturist is defined as కృషిచేసేవాడు, వ్యవసాయము చేసేవాడు, సేద్యము చేసేవాడు.
41. Aground Aground is defined as దరితట్టి, యెటూ తోచక. the ship ran * ఆవాడ గట్టు తట్టినది. I amquite * regarding this యిందున గురించి యెటూ తోచక వున్నాను.
42. Ague Ague is defined as చలిజ్వరము.
43. Aguish Aguish is defined as చలిజ్వరముగల. I feel * today నాకు నేడు చలిజ్వరము తగిలినది.this is an * place యిది చలిజ్వర భూమి.
44. Agument Agument is defined as ( the temporal * ) వృద్ధి.

Counter Image
( ? + A B C D E F G H I J K L M N O P Q R S T U V
W X Y Z