|
1. Auburn
|
Auburn
is defined as
పల్లవర్ణమైన. * hair పల్ల వెంట్రుకలు.
|
|
2. Auction
|
Auction
is defined as
ఏలము.
|
|
3. Auctioneer
|
Auctioneer
is defined as
ఏలము వేసేవాడు.
|
|
4. Audacious
|
Audacious
is defined as
సిగ్గుమాలిన, గండా గుండియైన, సాహసము గల, నిర్భయమైన.
|
|
5. Audacity
|
Audacity
is defined as
సిగ్గుమాలిన తనము, గండాగుండితనము, సాహసము, నిర్భయము.
|
|
6. Audible
|
Audible
is defined as
వినదగ్గ, వినే. their steps were not * వాండ్ల అడుగుల చప్పుడువినబడలేదు.
|
|
7. Audibly
|
Audibly
is defined as
వినేటట్టుగా.
|
|
8. Audience
|
Audience
is defined as
వినడము, ఆలకించడము. or visit దర్శనము. the governor gavehim an * గవనరు అతనికి దర్శన మిచ్చినాడు. or hearers వినేవాండ్లు. he spoke fora long time and his * were pleased వాడు బహు సేపు మాటాడినాడువిన్నవాండ్లు నిండా సంతోషించిరి. To day the * at church was thin యీ వేళగుడిలో జనము మట్టు. the hall of audience or audience chamber కొలువుకూటము.
|
|
9. Audit
|
Audit
is defined as
లెక్క విమర్శ, లెక్కను తనఖి చేయడము.
|
|
10. Auditor
|
Auditor
is defined as
or hearer వినేవాడు. or examiner of accounts లెక్కలనువిమర్శన చేసే అధికారి.
|
|
11. Auditory
|
Auditory
is defined as
శ్రవణేంద్రియ సంబంధమైన. the * nerves శ్రవణేంద్రియ సంబంధమైననరములు.
|
|
12. Auditress
|
Auditress
is defined as
వినే స్త్రీ.
|
|
13. Augar
|
Augar
is defined as
శకున ఫలము చెప్పేవాడు.
|
|
14. Auger, or Augre
|
Auger, or Augre
is defined as
బరమా, తొరపణము, పిడిసాన. * hole బెజ్జము, రంధ్రము.
|
|
15. Aught
|
Aught
is defined as
or pron, any thing యేదైనా, యేమైనా. Did he say * వాడు యేమైనాచెప్పినాడా. For * I know he is dead * ఒకవేళ చచ్చినాడేమో. For * I knowthose men are brothers వాండ్లు ఒక వేళ అన్నదమ్ములేమో. he may burn hishouse donw for * I care వాడు యింటిని కాల్చివేస్తే కాల్చివేయనీ నాకేమి.
|
|
16. Augmentasion
|
Augmentasion
is defined as
వృద్ధి, అభివృద్ధి, అధికరించడము.
|
|
17. Augmented
|
Augmented
is defined as
వృద్ధియైన, అభివృద్ధియైన, హెచ్చిన.
|
|
18. Augury
|
Augury
is defined as
శకునము, శకునశాస్త్రము.
|
|
19. August
|
August
is defined as
noble మహనియ్యమైన, అతిఘనమైన. the queen andher * motherరాణిగారున్ను మాతృశ్రీగారైన ఆమె తల్లిగారున్ను.
|
|
20. Augustus
|
Augustus
is defined as
కవులను నిండా సన్నానించిన ఒక రాజు పేరు. Augustan age ఆరాజు యొక్క కాలము అతని హయాము.
|
|
21. Aulic
|
Aulic
is defined as
సభా సంభంధమైన.
|
|
22. Aunt
|
Aunt
is defined as
తలిదండ్రుల తోడబుట్టిన ఆడవాండ్లు అనగా మేనత్త, పినతల్లి.
|
|
23. Aurella
|
Aurella
is defined as
పురుగు గూడు.
|
|
24. Auricle
|
Auricle
is defined as
of the heart చెవి, అనగా హృదయములో రక్తము పోవడమునకురావడమునకుగాను వుండే ద్వారము.
|
|
25. Auricula
|
Auricula
is defined as
దివ్వమైన ఒక పుష్ప విశేషము.
|
|
26. Auricular
|
Auricular
is defined as
చెవిలో చెప్పిన, రహస్యమైన.
|
|
27. Auriferous
|
Auriferous
is defined as
స్వర్నోత్పాదకమైన.
|
|
28. Aurora
|
Aurora
is defined as
ప్రాతఃకాల దేవత.
|
|
29. AuroraBorealis
|
AuroraBorealis
is defined as
ఆకాశములో వుత్తర పార్శ్వమున రాత్రిలోఅగుబడే ఒక జ్యోతి.
|
|
30. Auspices
|
Auspices
is defined as
శకునము. or patronage ప్రోద్బలము, కరుణ, కటాక్షము.favourable * in a fever జ్వరములో సుగుణ చిహ్నములు.
|
|
31. Auspicious
|
Auspicious
is defined as
శుభమైన, మంగళమైన, శ్రేయస్కరమైన, అనుకూలమైన. In an *hour సుముహూర్తమందు. on the * day ఆశుభదినమందు.
|
|
32. Auspiciously
|
Auspiciously
is defined as
శుభముగా, మంగళముగా, శ్రేయస్కరముగా, అనుకూలముగా.
|
|
33. Austere
|
Austere
is defined as
కఠినమైన, క్రూరమైన, మొండియైన, గడుసైన. * behaviour క్రూర నడక.* man క్రూరుడు, కఠినుడు. * rebuff క్రూరమైన చీవాట్లు.
|
|
34. Austerely
|
Austerely
is defined as
కఠినముగా, క్రూరముగా.
|
|
35. Austereness
|
Austereness
is defined as
కఠినత్వము, క్రౌర్యము.
|
|
36. Austerity
|
Austerity
is defined as
కాఠిన్యము, క్రౌర్యము, ఖండితము. religious * తపస్సు.
|
|
37. Austral
|
Austral
is defined as
దక్షిణ దిక్కు సంబంధమైన.
|
|
38. Australia
|
Australia
is defined as
దక్షిణ సముద్రమందు వుండే ఒక దేశము.
|
|
39. Authentic
|
Authentic
is defined as
నిజమైన, యధార్థమైన, ప్రమాణసిద్దమైన.
|
|
40. Authentically
|
Authentically
is defined as
నిశ్చయముగా, యధార్థముగా, ప్రమాణసిద్ధముగా.
|
|
41. Authenticated
|
Authenticated
is defined as
ప్రమాణసిద్ధమైన, ప్రామాణికమైన, నిశ్చయమైన, రూఢమైన.
|
|
42. Authentication
|
Authentication
is defined as
నిజముకావడము. after the * of this bond యీ పత్రముప్రమాణికమైనదని సిద్దమైన తరువాత.
|
|
43. Authenticity
|
Authenticity
is defined as
ప్రమాణికత, యధార్థ్యము, నిజము.
|
|
44. Author
|
Author
is defined as
కారకుడు, కర్త. who is the * of this book యీ గ్రంధకర్త యెవడు,యీ గ్రంధము చెప్పినవాడెవడు. he is the * of this mischief యీ దుర్మార్గమునకువాడే కారకుడు. he was the * of this quarrel యీ జగడానకు కారణమువాడు,మూలము వాడు.
|
|
45. Authoress
|
Authoress
is defined as
కారకురాలు, కర్తయైన స్త్రీ. See Author.
|
|
46. Authoritative
|
Authoritative
is defined as
ప్రామాణికమైన, అధికారముగల.
|
|
47. Authoritatively
|
Authoritatively
is defined as
ప్రామాణికముగా, అధికారముగా.
|
|
48. Authority
|
Authority
is defined as
power, అధికారము. that country is now under their * ఆదేశమిప్పుడు వాండ్ల అధికారములో వున్నది. A Ruler, one who is in power అధికారి.the local authorities or the village authorities అక్కడి అధికారులు. he is in* as a Magistrate వాడు మేజిస్ట్రేటు అధికారములో వున్నాడు. one vested with *అధికారి. or testimony ఉదాహరణ, సాధకము, ఆకరము. this letter is my * forselling the house ఆ యింటిని అమ్మడానకు యీ జాబు నాకు దస్తావేజు. I had thisstory from good * యీ సంగతిని నమ్మతగిన వారివల్ల విన్నాను. he cited a verseas an * for this interpretation యిట్లా అర్థము చెప్పడమును గురించి ఒక శ్లోకమువుదాహరణగా చెప్పినాడు.
|
|
49. Authorized
|
Authorized
is defined as
అధికారముగల, ఉత్తరవుగల. the * quantity వుత్తరవైపు వుండేమొత్తము. * measure కరారుగా వుండే కొలముట్టు. he paid the * sum యెంతకుఉత్తరవైనదో అంత మొత్తము చెల్లించినాడు. an * phrase ఉదాహరణ బలము గలవాక్యము. I don't feel myself * to do this దీన్ని చేయడమునకు నాకు వుత్తరవులేదు.
|
|
50. Authorship.
|
Authorship.
is defined as
కారకత్వము, కర్తృత్వము, he proved his * వాడు ఆ గ్రంథకర్తఅయినట్టు అగుబడుతాడు. the * of this id disputed యీ గ్రంధకర్త ఫలాని వాడనియేర్పడక వినాదముగా వున్నది.
|
|
51. Auto da Fe
|
Auto da Fe
is defined as
మతక్రియ, అనగా తమ మతము కాని వాండ్లను ప్రాణముతోతగలపెట్టేక్రియ, యిది Portuguese భాష.
|
|
52. Autobiography
|
Autobiography
is defined as
స్వచరిత్ర. he wrote an * స్వచరిత్రను తానే వ్రాసినాడు.
|
|
53. Autocracy
|
Autocracy
is defined as
ఏకఛత్రాధిపత్యము, స్వేచ్ఛాధికారము.
|
|
54. Autocrat
|
Autocrat
is defined as
ఏకఛత్రాధిపతి, నిరంకుశ ప్రభువు. Russia యొక్క రాజుకు యీ కితాబుచెల్లుతుంది.
|
|
55. Autograph
|
Autograph
is defined as
స్వహస్తాక్షరము. this letter is the governor's * యీ జాబుగవనరు యొక్క స్వహస్తాక్షరము.
|
|
56. Automaton
|
Automaton
is defined as
కీలుబొమ్మ, తనకు తానే ఆడే కీలుబొమ్మ. an * horse కీలుగుర్రము.an * eagle కీలుగరుత్మండు.
|
|
57. Autumn
|
Autumn
is defined as
ఆకులు రాలే కాలము, పండ్ల కాలము, మూడో బుతువు, అనగా యెండకాలమున కున్ను చలికాలమునకున్ను మధ్య వుండే కాలము, యిది సాధారణముగాAugust, September, and October మాసములనబడుతవి. In the * of lifeషష్ఠిపూర్తిలో.
|
|
58. Autumnal
|
Autumnal
is defined as
మూడోబుతు సంబంధమైన, ఆకులు రాలే బుతు సంబంధమైన.
|
|
59. Auxillary
|
Auxillary
is defined as
సహాయమైన. * troops సహాయ సేన, ఉపబలముగా వుండే సేన wineis an * to bark బార్కు మందుకు వైను అనుపానము. * verb సహాయ క్రియ, ఉపక్రి.Be, Do, Have, Can, Shall, will యివి మొదలైనవి. an * post office రెండోతపాలాఫీసు, చిన్న తపాలాఫీసు. an * Magistrate రెండో పోలీసు, చిన్న పోలీసు.
|