Ba

1. Baa Baa is defined as బా అని మేక కూత.
2. Baal Baal is defined as ఆకాశ భైరవుడు, భేతాళుడు. See Adam Clarke, on Judges 2.11.
3. Bab Bab is defined as ఛీపో అనే ధిఃకారశబ్ధము.
4. Babble Babble is defined as వదురు, పిచ్చి కూత, పిచ్చి మాటలు.
5. Babbling Babbling is defined as వదురు, పిచ్చికూత, పిచ్చిమాటలు.
6. Babe Babe is defined as బిడ్డ, శిశువు, కూన.
7. Babel Babel is defined as కలవరము.They attempted to build the tower of Babel up to the skies వాండ్ల ప్రయత్నమును చూస్తే రాయగోపురమునకు అడుగు వేసినట్టు వుండెను. అనగా, బ్రహ్మాండమైన ప్రయత్నము, కొనసాగదని భావము. The tower of Babel బేబెల్ బురుజు అనగా జలప్రళయమునకు తర్వాత మనుష్యులు అత్యున్నతమైన గోపురమును కట్టడమునకు యత్నపడినంతలో దేవుడికి కోపము వచ్చివొకడిమాట వొకనికి అథ ్ము కాకుండా పొయ్యేటట్టు చేసినందు మీదట ఆ ప్రయత్నము భంగమైపోయినదని బైబిలు మొదటి కాండలో ఒక కధ వున్నది.
8. Baboon Baboon is defined as గండుకోతి, తిమ్మడు.
9. Baby Baby is defined as బిడ్డ, శిశువు. * linen పొత్తిగుడ్డలు.
10. Babyish Babyish is defined as బాలిక, పిల్ల, బాల్య, లేత, పిచ్చి.
11. Bacchanal Bacchanal is defined as తాగుబోతు.
12. Bacchanalia Bacchanalia is defined as plu. Bacchus యొక్క వుత్సవము.
13. Bacchanalian Bacchanalian is defined as Bacchus అనే దేవుని యొక్క వుత్సవములో తాండవమాడేవాడు.
14. Bacchus Bacchus is defined as బలరామనామము,తాగుబోతులదేవుడు
15. Bachelor Bachelor is defined as పెండ్లి లేనివాడు, బ్రహ్మచారి, ఒంటిగాడు. at the Universityపాఠశాలలో విద్యార్ధులకు యిచ్చే మొదటిపట్టము.
16. Bachelor's button Bachelor's button is defined as Name of a flower వాసన లేని ఒక తరహా పుష్పము.
17. Back Back is defined as వెనకటి. the * way వెనకటిదారి, పెరటిదోవ.
18. Backbiter Backbiter is defined as చాడీలు చెప్పేవాడు, కొండాలమారి.
19. Backbiting Backbiting is defined as చాడీ, కొండెము, యిల్లామల్లితనము.
20. Backbone Backbone is defined as వెన్ను యెముక. he was a rogue to the *వాడినిలు వెల్లావిషము.
21. Backdoor Backdoor is defined as దిడ్డి వాకిలి.
22. Backgammon Backgammon is defined as చొకటాలవంటి ఒక తరహా ఆట. a * board యీ ఆట ఆడేపలక.
23. Background Background is defined as in a picture పరస్థలము. they kept this account in the * యీ సంగతిని మర్మముగా వుంచినారు. he remains in the *అప్రసిద్దుడై వున్నాడు.
24. Backhanded Backhanded is defined as పెడచెయ్యి వాటమైన.
25. Backpiece Backpiece is defined as వీపుజీరా.
26. Backside Backside is defined as the rear వెనకపార్శ్వము. the buttocks పిరుదులు, ముడ్డిor yard of a house పెరడు.
27. Backslider Backslider is defined as భక్తిలో వెనక్కు తీసినవాడు, భక్తి తగ్గినవాడు.or apostate ఆరూఢపతితుడు.
28. Backsliding Backsliding is defined as భక్తి తగ్గడము.
29. Backstairs Backstairs is defined as వెనకటితట్టువుండేమెట్లు, మరుగుదారి.
30. Backward Backward is defined as జబ్బైన, మందమైన, జడమైన.this child is * in reading యీపిల్లకాయ చదువులో జబ్బుగా వున్నాడు. a * confession అర్దాంగీకారము. I was * to believe this దాన్ని నేను నమ్మడానికి అనుమానిస్తిని.
31. Backward, Backwards Backward, Backwards is defined as వెనక్కు, తల్లకిందులుగా, విలోమముగా, జబ్బుగా.he fell backwards వెల్ల వెలకల పడ్డాడు. he has gone backwards in his reading చదువులో వెనకపడ్డాడు. It was written backwards ముద్రాక్షరమురీతిగా వ్రాయబడ్డది, యిట్లావ్రాసిన దాన్ని అద్దములో చూస్తే సరిగ్గా తెలుసును. Reading a spell * ఒక మంత్రమును తల్లకిందులుగా చదవడము.To go * మరుగు పెరటికి పోవుట, అనిన్ని కొన్నిచోట్ల అర్ధమౌతున్నది. యీ అర్ధము యిప్పట్లో వాడికలేదు.
32. Backwardness Backwardness is defined as Unwillingness అసమ్మతి, అనంగీకారము. dullness మాంద్యము, జబ్బు. Backwater, n. s. కయ్యి
33. Backyard Backyard is defined as పెరడు.
34. Bacon Bacon is defined as పంది మాంసము, అనగా వుప్పు వేసి పొగనుకట్టిన పంది మాంసము.he saved his * తప్పించుకొన్నాడు.
35. Bad Bad is defined as చెడ్డ, కాని, దుష్ట, పనికిమాలిన. * qualities దుర్గుణములు he is very * to-day, or he is very ill to-day యీ వేళవాడికి వొళ్ళు నిండా కుదురులేదు. he wants it very * వాడికి అది నిండా ఆగత్యముగా కావలెను. I know nothing about it good or * అది పుణ్యమో పాపమో నే నెరగను you are quite as * as he వాడెంతోనీవంతే.this objection is * యీ మాంసము మురిగిపోయినది, చెడిపోయినది. * advice or council దుర్బోధన. * coin తప్పునాణెము. he was in * circumstances దరిద్రుడై వుండినాడు. a * debt చచ్చుబాకి.* English తప్పుయింగ్లిషు. * fortune దౌర్భాగ్యము, గ్రహచారము. owing to my bad fortune నా దౌర్భాగ్యమువల్ల. he did it with a * grace దాన్ని అసమాధానముగా చేసినాడు. A * man దుష్టుడు.* character అపకీర్తి. * conduct దుర్నడత, దుర్మార్గము. he set his son a * example తాను దుర్మార్గముగా నడిచి తనదుర్గుణములు కొడుకుకు పట్టుపడేట్టుచేసినాడు. * faith ద్రోహము. * health అస్వస్థము. he has a * hand వాడికి చెయ్యి వుపద్రవముగా వున్నది. he is a * hand at reading వాడికిచదువను చేత కాదు. * humour కోపము, చిరచిర. I saw he was in a * humour వాడు మంటగా వుండినట్టు వుండెను. * humours in the bo dy పులినీళ్ళురసిక. he did me a * office నాకు ఒక అపకారము చేసినాడు.* sign దుర్నిమిత్తము, దుశ్శకునము. * symptom దుర్లక్షణము.the style of this poem is in * taste యీకవి చెప్పినది విరసముగావున్నది. * temper అలిగేభావము, దుర్గుభము, మూర్ఖము. they are on * terms వాండ్లు ఒకరికొకరు విరోధముగావున్నారు. Being on * terms with meనా మీద గిట్టక. * times దుష్కాలము, చెడ్డకాలము. a * tooth పుచ్చినపల్లు. * weather మబ్బు మందారము, వానఘాలి.
36. Badaubed Badaubed is defined as పూయబడ్డ.
37. Bade Bade is defined as ఆజ్ఙాపించినది, he * me go నన్ను పొమ్మన్నాడు.I * him go there or I bid him go there వాణ్ని అక్కడికి పొమ్మన్నాను.he bade them to dinner వాండ్లను భోజనానికి పిలిచినాడు.
38. Badge Badge is defined as గురుతు, చిహ్నము, బిరుదు. the * worn by a Policemanబిళ్ళ.
39. Badger Badger is defined as కొంచెము కుక్కరీతిగా కొంచెము పందిరీతిగావుండేఒక మృగము, యిదినీళ్ళలో నున్ను గట్టుమీదనున్ను సంచరించేటిది, చెడ్డకంపుకొట్టేది; కొంచమున చావని మొండిజంతువు. In the Tamil Bible and in the Bengali version the Hebrew word Taghas is used.
40. Badinage Badinage is defined as హాస్యము,యోగతాళి
41. Badly Badly is defined as చెరుపుగా, జబ్బుగా.
42. Badness Badness is defined as చెరుపు, చెడ్డతనము, దుష్టతనము. from the *of the writing ఆ వ్రాలు బాగావుండనందున. from the *of the wether మబ్బు మందారము చినుకుచిత్తడిగా వున్నందున.
43. Bag Bag is defined as సంచి, తిత్తి, గోతాము. a. * of rice గోనెడు బియ్యము. a gunny * గోనెసంచి. a pair of bullock bags కంట్లము,పెరికె. a nose * for feeding horses తోపరా. a * of muskకస్తూరివీణె. an ornament for the hair పూర్వకాలమందు గొప్పదొరలు అలంకారానికి జడతీరుగా కట్టుకొన్న సంచి.
44. Bagatelle Bagatelle is defined as a trifle అల్పము, స్వల్పము, కొంచెము. a name of agame ఒక ఆట పేరు. this a mere * యిదివొట్టి అప్రయోజకము.
45. Baggage Baggage is defined as సామాను, సరంజాము. his * filled ten cartsఅతని సామాను పదిబండ్లు నిండింది. she is a drunken *అది తాగుబోతుముండ. a sly * నంగనాచి ముండ. in plu.Baggages లంజలు, గుడిసెవేట్లు.
46. Bagman Bagman is defined as or hawker ఆకరు. or man that carries a bagమూటమోసేవాడు.
47. Bagnio Bagnio is defined as Bath స్నానము చేసే యిల్లు. or bowdy houseభోగము దాని యిల్లు.
48. Bagpipe Bagpipe is defined as తోలుసుతి, తిత్తిసుతి, స్కాట్లాండు దేశపు ఒక తరహా సన్నాయి.
49. Bagpiper Bagpiper is defined as తోలుసుతి వూదేవాడు.
50. Bailable Bailable is defined as జామీనుమీద విడవతగ్గ. a * offience జామీను తీసుకొనివిడిచిపెట్టతగ్గనేరము.
51. Bailiff Bailiff is defined as కోర్టుబంట్రోతు, సార్జంతు. the high * or Chief Magistrateపెద్దమేజిస్ట్రేటు అధికారి. the * or Superintendent of an estateపయిరుపచ్చ విచారించుకొనే మణియగాడు.
52. Bailiwick Bailiwick is defined as సరహద్దు, తుకుడి, పేట.
53. Bait Bait is defined as ఎర, తీపి, మజిలిలో పెట్టేదాణా. they stopped togive * to their beast గొడ్లకు దాణా పెట్టడానకై నిలిచిరి.
54. Baize Baize is defined as ముతకనగళాతు, గొంగళి.
55. Baked Baked is defined as కాల్చిన, వేపుడు. * rice వేపుడు బియ్యము.
56. Bake-house Bake-house is defined as రొట్టెలు కాల్చేయిల్లు, రొట్టెల గిడ్డంగి.
57. Baken Baken is defined as కాల్చబడ్డ.
58. Baker Baker is defined as రొట్టెలు కాల్చేవాడు. sugar * బెల్లముకాచేవాడు.
59. Baking Baking is defined as ఒక తడవ కాల్చినది.
60. Balance Balance is defined as a pair of scales త్రాసు, తక్కెడ.when you walk on a pole you must keep your * ఒక బొంగుమీదనడిచేటప్పుడు యిటూ అటూ వొరగరాదు. keep your * or you willfall వొరిగితే పడుతావుసుమీ. an even weight సరితూనిక. *in a watch ఘడియారములో ఒక భాగము. or remainder నిలువ,మిగత, బాకి, అవశిష్టము. net * నికరమైన బాకి. he struckthe * బాకి. he struck the * బాకితేల్చినాడు. a * sheetజమాఖర్చులెక్క. Libra of the Zodiac తులారాశి. * of powerసమాధికారము. * of trade సమవ్యాపారము, సమవర్తకము.
61. Balanced Balanced is defined as సరితూగే. a * account బాకి దేలినలెక్క. this evil is * by that good యీ చెరుపుకు ఆ మంచికి సరిపోయినది.
62. Balcony Balcony is defined as వసార, బ్రాందా, అంముగా వుండడానకై మిద్దె జనలకుముందర బయిటికి వొత్తించి, యినుము, కొయ్య, లేకరాతిలో కట్టిన బ్రాందా.
63. Bald Bald is defined as బోడి, బట్ట, వెంట్రుకలు రాలిబట్ట కట్టిన. of style జబ్బైన, నీరసమైన, పేలవమైన. a * head బోడితల, బట్టతల.a * style జబ్బు పాకము. this is a very * accountయిది తలాతోకలేని సంగతి.
64. Balderdash Balderdash is defined as సంకరము, కొంటెకూతులు.
65. Baldness Baldness is defined as బోడి. of style జబ్బుతనము, పేలవము.
66. Baldric Baldric is defined as కటిబంధము. Dz. దట్టి, నడికట్టు.
67. Bale Bale is defined as కట్ట, మూట, బస్తా, నగ.
68. Baleful Baleful is defined as వ్యసనకరమైన, విషమైన చేటుదెచ్చే, నాశకారియైన.their * example ruined him వాండ్లకు వచ్చినచేటు వీడికిన్నివచ్చినది. * influence నాశకారియైనశక్తి.
69. Balk Balk is defined as disappointment నిరాశ. a beam దూలము. betweenfields దున్నకతుండుగా నిలిచి పోయిననేల.
70. Ball Ball is defined as పూట, జామీను, పూటబడ్డవాడు . I stood * for him నేను వాడికి పూటబడితిని. personal * నఫరుజామీను. he found *వాడు జామీను యిచ్చినాడు. at circket పుల్ల, పుడక.
71. Ballad Ballad is defined as సామాన్యమైన పదము, నారుపాట. A * singerబొబ్బిలి కధలవంటివి, నారు పాటలవంటివే పాడేవాడు.
72. Ballast Ballast is defined as అడుగుబరువు, తాపి, అనగా వాడపొర్లకుండా వుండడానకై అడుగున వేసే రాయిరప్ప మొదలైనబరువు.
73. Ballasted Ballasted is defined as అడుగుబరువుగల, అనగా వాడ పొర్లకుండా అడుగునరాయిరప్ప వేసి బరువుగావుండే.
74. Ballet Ballet is defined as a kind of dance perfomed by public actors వేషగాండ్లుఆడే ఒక తరహా లజ్జలేని ఆట.
75. Ballon Ballon is defined as పొగగుమ్మటము.
76. Ballot Ballot is defined as ఉండలువేయడము, అనగా ఒకణ్ని ఒకసభలో ప్రవేశ పెట్టడానకుసభలో వుండేదొరలలు ప్రతిమనిషిన్ని ఒక పెట్టలో తెల్లవుండనైనా నల్లవుండనైనా వేస్తారు, తెల్లవుండలు నిండ్డావుంటే అతణ్ని ప్రవేశ పెట్టుతారు,నల్లవుండలు అధికముగా వుంటే అతణ్ని ప్రవేశపెట్టరు, దీనికిBallot అనిపేరు.
77. Ball-room Ball-room is defined as నాటకశాల
78. Balm Balm is defined as consolation ఓదార్పు, ఉపశంతి, ఉపశమనము. Medicine ఉపశమనమైన ఒకతరహా గాయతైలము. a certain fragrant herb పరిమళమైన ఒక తరహా చెట్టు.
79. Balmy Balmy is defined as పరిమళముగల, మనోహరమైన, ఉపశాంతికరమైన. * breeze మలయమారుతము.
80. Balsam Balsam is defined as ఒక తరహాతైలము, ఒక తరహా చెట్టు. the flower గులిముడి, చిలకముక్కు పువ్వు. oil of * సాంబ్రాణితైలము.
81. Balsamic Balsamic is defined as పరిమళించే, సుగంధమైన.
82. Baluster, Balustrade Baluster, Balustrade is defined as మిద్దెమీద, గారతోనైనా కుండ పెంకుతోనైనా కట్టినగ్రాది, చెయిపిడిగోడ.
83. Bamboo Bamboo is defined as (a word taken from the Malay language) వెదురు. a large * బొంగు . a long * గడ. the male * పోతువెదురు, ఘట్టి వెదురు. the female *పెంటివెదురు, బొంగు. * colour (an absurd word) చామనిచాయ, పండు వెదురు వర్ణము.
84. Ban Ban is defined as or curse శాపము. or forbidding నిషేధించడము. Marriage bannsపెండ్లినిగురించిన ప్రకటన, అనగా ఫలానివాడు ఫలానిదాన్ని పెంఢ్లాడబోతాడు దీనికి యెవరైనా ఆక్షేపించే వారు కద్దా అని పాదిరిచేసే ప్రకటన.
85. Banana Banana is defined as or plantain అరటిపండు.
86. Band Band is defined as or bandage, కట్టు, గాయకట్టు. there was a bras * round the top of the pillar స్థంభము యొక్కకొనకు విత్తళిపొన్ను వేసివుండినది.a staff with iron bands యినుపకట్లు వేసినకర్ర. a hat * టోపిచుట్టూ కట్టిన నాడా. mourning bands worn at funeral బద్దె, కర్మము చేసేటప్పుడు వేసుకొనే బద్దె.a straw * or rope వెంటి. a * of gold lace సరిగెట్ట, సరిగెనాడా.a snake with black bands నల్లకట్లపాము.connection or union సంబంధము. this marriage formed a * between the twofamilies యీ వివాహముచేత రెండు కుటుంబములకు సంబంధము కలిగినది. or company గుంపు, తెగ, కూటము. a * of thieves దొంగలగుంపు, దొంగలతెగ.a * of soldiers శపాయీలదళము. of musicians మేళము, మేళ గాండ్ల జత.or cravat పాదుర్లు, లాయర్లు మెడకు కట్టుకొనే ఒక తరహాగుడ్డ.
87. Bandage Bandage is defined as కట్టు, గాయకట్టు, పుంటికట్టు.
88. Bandbox Bandbox is defined as తేలికైనపెట్టె, కాకితముతో, లేక, తేలికైన కొయ్యతోచేసిన చులకనైనపెట్టె.
89. Banded Banded is defined as గుంపుగావుండే, చారలుగల.
90. Bandicoot Bandicoot is defined as a great rat, పందికొక్కు.
91. Bandicoy Bandicoy is defined as (a certain herb) బెండకాయ.
92. Bandit Bandit is defined as బందిపోటు దొంగ.
93. Banditti Banditti is defined as plu. బందిపోటుదొంగలు.
94. Bandog Bandog is defined as కావలికుక్క, రేచుకుక్క.
95. Bandy Bandy is defined as a carriage or cart బండి.
96. Bandy-legged Bandy-legged is defined as దొడ్డికాళ్ళుగల.
97. Bane Bane is defined as poison విషము. evil చేటు, చెరపు. rats * యెలుకపాషాణముhares * మొసలిచేటు మొక్క, మొసలిచేదు.
98. Baneful Baneful is defined as విషకారియైన, చెరుపైన, చేటైన, హానికరమైన. his *advice వాడుచెప్పిన దుర్బుద్ధి. a * custom దుర్వాడిక.
99. Bang Bang is defined as దెబ్బ, మోటుదెబ్బ. the drug cannabis sativa గంజాయి, బంగి.
100. Bangles Bangles is defined as the Indian word for bracelets కంకణకులు, కడియాలు. or anclets అందెలు.
101. Banians Banians is defined as (An old word for Hindus) హిందువులు. banian treeమర్రిచెట్టు. An old word for Shopkeepers వర్తకులు, శెట్లు, కోమట్లు. a banian dress సాదావుడుపు. a banian day వొళ్ళు కుదురు లేకుండా వుండేదినము, యీకాలమందు యీ మాట నిండా వాడికలేదు.
102. Banished Banished is defined as వెళ్ళగొట్టబడ్డ, దేశభ్రష్టుడైన. long * thoughts బహుదినాలుగాలేడుండా వుండిన జ్ఙాపకము.
103. Banishment Banishment is defined as వెళ్ళగొట్టడము, దేశాంతరమునకు పంపివేయడము. he is now in * దేశత్యాగియైవున్నాడు.
104. Bank Bank is defined as కట్ట, గడ్డ, ఒడ్డు, తీరము. he raised a * కట్ట వేసినాడు. my houseis built on the banks of the river మాయిల్లు యేటి అంచున వున్నది. a littlehill తిప్ప, దిబ్బ, మిట్ట. a * for money కొఠీ.
105. Banker Banker is defined as కొఠీదారుడు, సాహుకారు, సరాబు.
106. Banking Banking is defined as కొఠీవ్యాపారము, సాహుకారివ్యాపారము.
107. Bankinghous Bankinghous is defined as కొఠీ.
108. Bank-note Bank-note is defined as నోటు.
109. Bankrupt Bankrupt is defined as దివాలెత్తినవాడు.
110. Bankruptcy Bankruptcy is defined as దివాలుయెత్తడము.
111. Banksall Banksall is defined as (Calcutta word for an exchange, for traders)వాణిజ్యశాల.
112. Bankshall Bankshall is defined as రేవులో సరుకులు దించేగిడ్డంగి.
113. Banner Banner is defined as ధ్వజము, కొడి, టెక్కెము, పతాకము. after the * hoisted upకొడియెక్కించిన తరువాత. a silken * పట్టుకొడి.
114. Bannian Bannian is defined as See Banians.
115. Bannister Bannister is defined as మిద్దెమెట్లగ్రాది, చెయిపిడి.
116. Bannock Bannock is defined as a kind of Scotch bread ఒక తరహారొట్టె
117. Banquet Banquet is defined as విందు.
118. Banqueting-house Banqueting-house is defined as విందుచేసే యిల్లు.
119. Banter Banter is defined as యెగతాళి, పరిహాసము.
120. Banterer Banterer is defined as యెగతాళి చేసేవాడు.
121. Bantling Bantling is defined as పిల్ల, యిది తిరస్కార శబ్దము.
122. Banus Banus is defined as See Ban.
123. Banyan Banyan is defined as See Banians.
124. Baptism Baptism is defined as బాప్తిస్మము. ( BNT, Or with the French pronunciation)బాతేము, మజ్జనము. SNT.
125. Baptismal Baptismal is defined as బాతేమ సంబంధమైన.
126. Baptist Baptist is defined as (మజ్జాయితా SNT.బాప్తాయీజక BNT.స్నాన ్ . Rh.స్నాతకుడుF.) The sect called Baptists, ఖ్రీస్తు మతములో ఒక మత భేదము. John the *పూర్వకాలమందు వుండిన ఒక మహాత్ముడు.
127. Baptistery Baptistery is defined as జ్ఙాన స్నానము చేయించే స్థానము.
128. Bar Bar is defined as కమ్మి, కంబి, పాళము. a window with iron bars యినపకమ్ములువేసిన కిటికి of door గడియ, అర్గళము. of a gate అడ్డకర్ర. or hinderance అడ్డి, అభ్యంతరము, ఆటండము, consanguinity formed a * to the marriage వీడికి దాన్ని వివాహము చేయడానకు జ్ఞాతిత్వము ప్రతిబంధకముగా వున్నది. of a harbour ముఖద్వారమునుమూసుకొనివుండే యిసుక దిబ్బ. In a song చరణము. place for prisoners in a court ఖైదిని నిలిపేస్థలము. he practises at the* అతను లాయరు పనిచూస్తాడు. In a tavern సారాయి అంగడిలో అమ్మేవాడు కూర్చుండే స్థలము. or stripe of colour చార. the tiger's skin has black bars పెద్దపులి తోలులో నల్లచారలు వున్నవి. To Bar, v. a. అడ్డగడియ వేసుట. he barred the door ఆ తలుపుకు అడ్డుకర్రవేసినాడు, అడ్డగడియవేసినాడు. or to hinder ఆటంకము చేసుట,అభ్యంతరము చేసుట. the length of time barred his claim కాలవిళంబము వాడి స్వాతంత్య్రమునకు అడ్డి అయినది.
129. Barb Barb is defined as చిల్ల, జిట్ట, తగులు. a pointed iron with one * చిల్లాకౌల,or steed తురుకీ గుర్రము, యిది కావ్యమందు వచ్చేమాట.
130. Barbacan Barbacan is defined as బురుజు, కోటగోడలో ఫిరంగులు పెట్టే స్థలము.
131. Barbarian Barbarian is defined as a rude person అసభ్యుడు, అమర్యాదస్థుడు. a savage అడివి మనిషి, చెంచువాడు.the * kings చెంచురాజులు. a cruel manక్రూరుడు, కిరాతకుడు, నిష్కంటకుడు. Dr. Johnson says ( Boswell, 27 March 1772) " The mass of the Greeks and Romans were Barbariansthe mass of every people must be barbarous, where there is no printing, and consequently knowledge is not generally diffused:knowledge is diffused among the people by our newspapers. I amtalking of the mass of the people. We see even what the boastedAthenians were. The little effect which Demosthenes's orationshad upon them shews that they were barbarians." In I Cor. XIV. IIమ్లేచ్ఛ. SNT. and BNT. అన్యులు. R. మూఢుడు. F.
132. Barbaric Barbaric is defined as చెంచువాడ్ల సంబంధమైన.
133. Barbarism Barbarism is defined as in language యాచమాట, మిశ్రమభాష
134. Barbarity Barbarity is defined as cruelty క్రూరత్వము, నిష్కంటకత.
135. Barbarous Barbarous is defined as rude, uncivilized మోటు. cruel క్రూర, నిష్కంటక. * languageయాచమాటలు. * people క్రూరలు, అడివి మనుష్యులు. In Acts XXVIII.2. అసభ్యలోకా SNT. అన్యజాతి. F. అన్యులు. R.
136. Barbarously Barbarously is defined as అతి క్రూరముగా, నిష్కంటకముగా.
137. Barbarousness Barbarousness is defined as క్రూరత్వము, నిష్కంటకత్వము.
138. Barbecue Barbecue is defined as కోయకుండా వున్నది వున్నట్టే కాల్చినపంది.
139. Barbed Barbed is defined as చిల్లలుగల. a * hook చిల్లలుగల గాలము. a * horse or horse in armour జీరావేసిన గుర్రము.
140. Barbel Barbel is defined as ఒక తరహా చేప.
141. Barber Barber is defined as క్షవరకుడు, మంగలవాడు.
142. Barberry Barberry is defined as ఒక తరహా పండు.
143. Bard Bard is defined as కవీశ్వరుడు.
144. Bare Bare is defined as నిభాయించినాడు,మోసినాడు,కన్నది, he * the blameనింద మోసినాదు. she * a son కొడుకును కన్నది. this is old English See To Bear, v. a.
145. Bare-faced Bare-faced is defined as సిగ్గుమాలిన, సిగ్గుచెడ్డ. * lie పచ్చి అబద్ధము.
146. Bare-facedly Bare-facedly is defined as సిగ్గుమాలి, సిగ్గుచెడి.
147. Bare-foot Bare-foot is defined as ఒట్టికాళ్ళతో, చెప్పులు లేక.
148. Bare-headed Bare-headed is defined as ఒట్టితలగల, పాగా లేని, టోపిలేని, బోడి.
149. Barely Barely is defined as or scarcely అరుదుగా, చాలీ చాలక. this is * enough యిదిచాలీ చాలక వున్నది. he is * alive వాడికి ప్రాణము వున్నదో పోయినదోఅనివున్నది. I had * arrived when he died నేను చేరీచేరక మునుపేచచ్చినాడు.
150. Bareness Bareness is defined as లేమి, లేకవుండడము. from the * of the trees ఆకులు లేకచెట్లు బోడిగా వున్నందున.
151. Bargain Bargain is defined as an agreement, ఒడంబడిక, ఒప్పందము, కరారు, బేరము. if you do not pay me the money to-day it is no * యీ వేళ రూకలు చెల్లించకపోతివా ఆ సరుకుకు నీకు సంబంధములేదు. he struck a * with us మాతోబేరము చేసినాడు. the thing purchased or sold కొన్న, లేక అమ్మినసరుకుwhen he brought his * home కొన్న సరుకును యింటికి తీసుకవచ్చేటప్పటికిhe bought the house at a good * యింటిని నయముగా కొన్నాడు. he boughtit at a bad * దానికి అధిక వెల పెట్టినాడు, గిరాకిలో కొన్నాడు. you have abad * నీవు చేసిన యుక్తి పిచ్చి పోయినది. he made the best of a bad *యీ కాలానికి యిట్లా వుండవలసిన దనుకొన్నాడు. into the * సహితము కూడాపైగా, సమేతు. he bought the house and the garden into the * ఆ యింటిని తోటతో కూడా కొనుక్కొన్నాడు. he is a liar and a drunkard intothe * వాడు అబద్ధీకుడే కాకుండా తాగుబోతున్ను.
152. Bargaining Bargaining is defined as బేరము, కొనడము, అమ్మడము.
153. Barge Barge is defined as ఒక తరహా పెద్దపడవ, విహారమునకు, లేక, వ్యాపారమునకు ఉపయుక్తమైనది. * man పడవవాడు.
154. Barilla Barilla is defined as ఒక తరహా క్షారము, వుప్పు.
155. Bark Bark is defined as పట్ట, మానిపట్ట, వల్కము. the inner * లోనిపట్ట. the outer *or day బొబ్బర, బరదు. a medicine జ్వరానికియిచ్చే బార్కు పట్ట చూర్ణము.or vessel చిన్నవాడ, పడవ. voice of a dog కుక్క మొరుగు.
156. Barley Barley is defined as బార్లిబియ్యము. * water బార్లి గంజి. * sugar ఒక తరహా మిఠాయియిది చక్కెర గోధుమపిండి కలిపి చేసినది.
157. Barley-corn Barley-corn is defined as బార్లిగింజ, అంగుళములో మూడో భాగము.
158. Barm Barm is defined as కాడి, దీన్ని రొట్టెలు మొదలైనవి వుబ్బడానకు పులుసుగాపెట్టుతారు, బీరుసారాయి చేయడములో దీన్నిన్ని పోస్తారు.
159. Barn Barn is defined as కణజము, కళంజము, ధాన్యకొఠారు.
160. Barnacle Barnacle is defined as ఒక తరహా నత్తగుల్ల. a bird ఒక తరహా బాతు.
161. Barometer Barometer is defined as ఘాలి యొక్క ఎచ్చు తగ్గులను తెలియ జేసే ఒక యంత్రము,దీన్ని బ్రామీటరంటారు.
162. Barometrical Barometrical is defined as ఘాలియొక్క హెచ్చు తగ్గులను తెలియజేసే యంత్రసంబంధమైన.
163. Baron Baron is defined as రాజు, దొర, జమీందారు, ఒక తరహా కితాబు గలవాడు.The proper sense is యజమానుడు .Baronand Feme భార్యాభర్తలు.Baronet, Viscount అనే దర్జాలకు నడిమిదైన బారన్ అనే కితాబు గలవాడు.
164. Baroness Baroness is defined as బారనుయొక్క భార్య.
165. Baronet Baronet is defined as ఒక తరహా కితాబుకలవాడు, అనగా Baron, Knight అనే కితాబులకు నడిమి కితాబు గలవాడు.
166. Barony Barony is defined as Baron అనే రాజుయొక్క దేశము. Baron అనే కితాబు.
167. Barrack Barrack is defined as సోజర్లు సిపాయిలు వుండేశాల, దీన్ని బార్కసు అంటారు.
168. Barrel Barrel is defined as ఒక తరహా పీపాయి. or tube గొట్టము. the * of a gunతుపాకి గొట్టము. the belly of a horse గుర్రము యొక్క కడుపు.
169. Barrelled Barrelled is defined as గొట్టముగల, నాళముగల. a double * gun రెండు గొట్టాలతుపాకి.
170. Barren Barren is defined as గొడ్డైన, ఫలించని. or feeble నీరసమైన, జబ్బైన. a * woman గొడ్రాలు. * land పండని భూమి, చవిటినేల, ఊషరభూమి.a * tree కాయనిచెట్టు. a * poet జబ్బుకవి.
171. Barrenness Barrenness is defined as గొడ్డుతనము, ఫలించక పోవడము, నీరసము, జబ్బు. from the * of the soil ఆ నేల పండదు గనక.
172. Barricade Barricade is defined as అడ్డు, అడ్డము, ఆటంకము, పరులను రానివ్వకుండా కట్టిన అడ్డకట్టు. the * built with bamboos round the camp keptthe enemy in awe మా శిబిరానకు చుట్టూ వెదురుతో కట్టిన అలవచేతశత్రువులు ఆచివుండిరి.
173. Barricado Barricado is defined as See Barricade.
174. Barricadoed Barricadoed is defined as అడ్డకట్టిన, ఆటంకము చేయబడ్డ.
175. Barrier Barrier is defined as తడ, అడ్డు, ఆటంకము, హద్దు, సరహద్దు.
176. Barrister Barrister is defined as వకీలు.
177. Barrow Barrow is defined as for carrying earth & c. ఒంటి చక్రపు చెయిబండి. a hillockతిప్ప, దిబ్బ.
178. Bartavelle Bartavelle is defined as చకోరపక్షి.
179. Basalt Basalt is defined as ఒక తరహారాయి.
180. Base Base is defined as అడుగు, పీఠము, అస్థిభారము. in music మంద్రస్వరము. on the * of friendship స్నేహమునుపట్టి.
181. Base-born Base-born is defined as పలుబీజమైన, పలువిత్తైన.
182. Based Based is defined as ఆధారముగల.
183. Baseless Baseless is defined as నిరాధారమైన.
184. Basely Basely is defined as నీచముగా, తుచ్ఛముగా, హీనముగా.
185. Basement Basement is defined as అడుగు మట్టము, అడుగు పీఠము, మూలము. * floor తళవరిళ, అడుగు దళము.
186. Baseness Baseness is defined as నీచత్వము, తుచ్ఛత్వము, హీనత్వము, పోకిరితనము, పలవతనము.from the * of the silver వెండిమట్టమైనందున.
187. Bashaw Bashaw is defined as పాదుషా, పాచ్ఛా. a pround man గర్విష్టుడు.
188. Bashel Bashel is defined as తూము, ముప్పైరెండు శేర్లు పట్టే తూము. he hideshis lamp under a * నిగురుగప్పిన నిప్పువలె వున్నాడు.
189. Bashful Bashful is defined as సంకోచముగల, కొంకుగల, సిగ్గుగల, బిడియముగల.
190. Bashfully Bashfully is defined as సంకోచముగా, కొంకుగల, సిగ్గుగల, బిడియముగల.
191. Bashfulness Bashfulness is defined as సంకోచము, కొంకు, సిగ్గు, బిడియము.
192. Basil Basil is defined as తుళసిచెట్టు.
193. Basilicon Basilicon is defined as ఒక తరహా ప్లాస్తిరి.
194. Basilisk Basilisk is defined as కాలకూటసర్పము, యీ సర్పము యొక్క దృష్టి దేనిమీద తగిలితే అదిభస్మమే పోతుందని ప్రతీతి.
195. Basin Basin is defined as a vessel to hold water for washing నీళ్ళ పల్లెము.a cup గిన్నె. a * or water భోగుణినీళ్ళు . or small pond చిన్నగుంట. of harbour వాడలు నిలిచే దొరువు. a * round the treeపాదు ఆలవాలము a* of tea గిన్నెడు తేనీళ్ళు thistown is built in a * of hills యీ వూరు కొండల నడిమి పల్లములో కట్టివున్నది. the basins of a balance త్రాసు తట్టలు.
196. Basis Basis is defined as ఆధారము, ఆస్పదము, మూలము, ఆస్తిభారము, బునాది. or pedestal పీఠము. of a column స్థంభము యొక్క అడుగు పీఠము.
197. Basketful Basketful is defined as గంపెడు, బుట్టెడు.
198. Basket-hilt Basket-hilt is defined as మూతకత్తిపిడి, అనగా చేతికి దెబ్బ తగలకుండా పై మూతగల కత్తిపిడి.
199. Bason Bason is defined as See Basin.
200. Bas-relief Bas-relief is defined as ఉబుకుపని. the face that appears upon a rupee isin * రూపాయమీద అగుపడే ముఖము వుబుకుపనిగా వున్నది.
201. Bass Bass is defined as మంద్రస్వనము. Bassia latifolia, n. s. the name of a tree యిప్పచెట్లు, మధూకము.
202. Bassoon Bassoon is defined as వూదేవాద్య విశేషము, ఒక తరహా వూదుకోవి.
203. Bass-viol Bass-viol is defined as ఒక తరహా వీణె.
204. Bastard Bastard is defined as వుంపుడుదాని కొడుకు, పెట్టుకొన్నదానికి పుట్టినవాడు, వేశ్యకు పుట్టినవాడు.
205. Bastardy Bastardy is defined as జారజత్వము.
206. Bastile Bastile is defined as చెరసాల, బందేఖానా, యిందులో అతి క్రూరదండన జరిగేదనిప్రతీతి.
207. Bastinado Bastinado is defined as కర్రతో కొట్టడము, దెబ్బలు, కర్రతో అరికాలిమీద కొట్టేదనేతురకలు చేసే ఒక తరహా శిక్ష.
208. Bastion Bastion is defined as బురుజు, కొత్తళము.
209. Bat Bat is defined as గబ్బిలము. a large * called the flying fox బుషిపిట్టచీకురాయి. or stick used in games ఆటలో గుండును తట్టే కర్ర.or brick * యిటికరాయిపొడి. Bat-fowling ఘంట వేట, రాత్రిళ్ళుఆడే వేట.
210. Batch Batch is defined as ఒకసారిలో కాల్చినది, ఒకతడవలో చేసినది. a * of bread ఒక సారిలో కాల్చి యెత్తిన రొట్టెలు. these bricks are all of the same* యిది అంతా ఒక సూళయిటికె లు. this is the best of the * వున్నంతల్లోయిది వాసి.
211. Batchelor Batchelor is defined as పెండ్లి లేనివాడు. * of arts శాస్త్రి.
212. Bath Bath is defined as స్నానము, స్నానతొట్టి, స్నానము చేసే స్థలము, స్నానవాటిక స్నానజలము. he took a * స్నానము చేసినాడు. she gave the child a * బిడ్డకు నీళ్ళుపోసినది. a warm * వేణ్నీళ్ళు. a cold * చన్నీళ్ళు .
213. Bathe Bathe is defined as స్నానము. he took a * స్నానము చేసినాడు.
214. Bathed Bathed is defined as స్నానము చేసిన తడిపిన, తడిసిన, ముంచిన. checks * in tearsకన్నీళ్ళ తడిసిన దవడలు. hands * in blood నెత్తురుతో తడిసిన చేతులు. *in dew మంచున తడిసిన.
215. Bathing Bathing is defined as స్నానము.
216. Bathos Bathos is defined as a ludicrous descent from the elevated to the mean in wirting or speech రాసాభాసము, అనగా వ్రాయడములో గాని మాట్లాడడములోగాని వౌకటిని గురించి అతి ఘనముగా చెప్పతూ వచ్చి దాన్ని గురించే లటక్కున వొక అల్పమాట చెప్పడమువల్ల కలిగే రసాభాసము. Pathos అనగా సరసము, దానికి ప్రతిగా Bathos అనగా రసాభాసమని యేర్పరచిరి.
217. Bating Bating is defined as వినహా, వినాయించి. * this యిది వినహా, యిదితప్ప.
218. Baton Baton is defined as సేనాధిపతి చేతివేత్రము, శెంగోలు.
219. Batoon, Battoon Batoon, Battoon is defined as సేనాధిపతి చేతి వేత్రము, శెంగోలు.
220. Batta Batta is defined as (an Indian word) బత్తెము, రోజు.
221. Battalia Battalia is defined as వ్యూహము, సేనావిన్యాసము, దండును నిలిపే క్రమము.
222. Battalion Battalion is defined as పటాళము.
223. Batten Batten is defined as బద్ద, చట్టము. a * of bamboo వెదురుబద్ద.
224. Batter Batter is defined as తోపా, అనగా గుడ్లు, పాలు పిండి కలిపి చేసినది. they beat it to the consistency of * కాటుకవలె మెదిపినారు.
225. Battery Battery is defined as place for guns మోర్జా, బురుజు. or beating కొట్టడము. he broughtan action of * against them వాండ్లు తన్ను కొట్టినట్టు వాండ్లమీద ఫిరంగులతీరుగా యేర్పరచిన సీసాలు.
226. Battle Battle is defined as యుధ్ధము, జగడము, పోట్లాట. he lost the * అపజయమునుపొందినాడు. he gained the * జయించినాడు. The battle won కోరిక ఫలమైనది,తంటా తీరింది, కోరికె నెరవేరినది. the boxers fought a * మల్లులు యుధ్ధముచేసినారు. the cocks fought a * పుంజులు జగడము చేసినవి. he set the troopsin * array దండును యుద్ధసన్నద్ధముగా నిలిపినాడు. there was a * royal among thewomen ఆ యాడవాండ్ల కొకరికొకరికి అఘోరమైన జగడమైనది. a * axe గండ్రగొడ్డలి.he knows Sanscrit before hand and this is half the * in learning Teluguవాడికి మునుపే సంస్కృతము వచ్చియుండుటవల్ల తెలుగు నేర్చుకోవడములో సగము తొందరతీరినది. a line of * ship గొప్ప యుద్ధవాడ.
227. Battledore Battledore is defined as చెండుతట్టేకర్ర, అనగా అతిరస పలకవలె కొనను బటువుగా తోలుకట్టివుండేకర్ర.
228. Battlement Battlement is defined as మేలుగోడ, బురుజుపైగోడ, కోటకొమ్ము, దీనిమరుగున సిపాయీలువుండి ఫిరంగులు కాలుస్తారు.
229. Baulk Baulk is defined as (between fields) పొలములో దున్నక విడిచిన తుండునేల.
230. Baulked Baulked is defined as భంగమైన, భగ్నమైన, నిరర్ధకమైన. Being * in these attempts యీ యత్నములు భంగమైపోయినందున.
231. Baumble, or Bawble Baumble, or Bawble is defined as గుల్లాగుట్ర, పనికిమాలినవస్తు, గుల్ల కాసు చేయనిది.Bawbles bought at the fair బెండు చిలకలు గిలకలు మొదలైన కాసు చెయ్యనివస్తువులు.
232. Bavin Bavin is defined as (a bit of wood) కట్టె, పుడక, పుల్ల
233. Bawd Bawd is defined as కుంటెనకత్తె
234. Bawdry Bawdry is defined as కొంటెకూతలు, బండుబూతు.
235. Bawdy Bawdy is defined as సిగ్గుమాలిన, కొంటె, బండ. * language బండకూతలు. * house గుడిశవేటువాండ్లు వుండే యిల్లు.
236. Bay Bay is defined as of the sea మూడుతట్లు భూమిగల సముద్రము. (in building )a * window వింటిబద్ద ఆకారమైన గవాక్షి. the tiger was at * పులి నాలుగుతట్ల చిక్కుబడి వుండినది. the stag stood at * among the dogs ఆ జింక కుక్కలనడమ చిక్కుకొని ప్రాణానకు తెగించ వుండినది. the cow kept thetiger at * ఆ యావు పులిని దగ్గర చేరనియ్యలేదు. we kept the enemy at* శత్రువులు మామీద వచ్చి పడకుండా బందోబస్తుగా వుంటిమి, జాగ్రత్తగావుంటిమి. I am keeping fever at * నేను జ్వరాన్ని రాకుండా పట్టుతున్నాను. the name of the laurel tree ఒక చెట్టు పేరు.
237. Baya Baya is defined as (SeeTail or bird)
238. Bayadere Bayadere is defined as (from the Persian word) బోగముది.
239. Bayonet Bayonet is defined as సనియను, తుపాకి కొనను తగిలించే బాకు.
240. Bay-tree Bay-tree is defined as ఒక వృక్ష విశేషము. he flourished like a green * తామర దంపముగా వుండెను. the Sanscrit metrical version of the Psalms says శ్యామవృక్షము. the Tamil version omits it.
241. Bazaar, Bazar Bazaar, Bazar is defined as అంగడివీధి, సీమలో సొమ్ములు, పుస్తకములు, శాలువలు మొదలైనవిఅమ్మే సంత అంగళ్ళు పెట్టే బ్రహ్మాండమైన ఒక యింటిని బజారంటారు. that is a *report వదంతి ఘాలి సమాచారము.

Counter Image
( ? + A B C D E F G H I J K L M N O P Q R S T U V
W X Y Z