|
1. Be it so
|
Be it so
is defined as
(thus placed by Johnson) కాని;అట్లావున్నప్పటికిన్ని
|
|
2. Beach
|
Beach
is defined as
రేవు, వోడరేవు, సముద్రతీరము,
|
|
3. Beacon
|
Beacon
is defined as
ఓడలకు రాత్రిళ్ళు ఫలాని అపాయస్థలమని గురుతు తెలిసేటట్టునిర్ణయించబడ్డ వెలుతురు గల వున్నత స్థలము. or warning యెచ్చరిక.let him be a * to you అతడి గతిని చూచి నీవు యెచ్చరిక పడవలసినది.
|
|
4. Bead
|
Bead
is defined as
పూస, మణి, beads పూసలు, గుండ్లు. he was counting his beadsజపమాలికతో జపము చేసుకొంటూ వుండినాడు. a * of sweat చెమట బిందువు.
|
|
5. Beading
|
Beading
is defined as
పూసకట్టుగా చేసిన కొయ్యపని.
|
|
6. Beadle
|
Beadle
is defined as
ఒక తరహా బంట్రోతు, పేదా, తలారి. Beadman, Beadsman, n. s. సన్యాసి, పకీరు.
|
|
7. Beagle
|
Beagle
is defined as
ఒక తరహా వేటకుక్క.
|
|
8. Beak
|
Beak
is defined as
పక్షి ముక్కు.
|
|
9. Beaked
|
Beaked
is defined as
ముక్కుగల.
|
|
10. Beaker
|
Beaker
is defined as
గండిచెంబు.
|
|
11. Beam
|
Beam
is defined as
of wood దూలము. the * of a balance దండె, త్రాసుకోల.In trial this kicks the * పరిక్షలో యిది వెనక్కుబడుతుందు, weavers * పడమాను తరిమాను. * of a plough నొగమాను. of lightకిరణము.
|
|
12. Bean
|
Bean
is defined as
చిక్కుడుకాయ. there are many kinds of this బెండకాయ,పొట్లకాయ మొదలైన కాయగూరలు.
|
|
13. Bear
|
Bear
is defined as
ఎలుగ్గొడ్డు, భల్లూకము. the man is a perfect * మోటువాడు,మర్యాద తెలియని వాడు, అమర్యాదస్థుడు. Bearsply మోటుసరసము. the stars called the great * సప్తర్షి నక్షత్రములు. the lesser * ఉత్తర ధ్రువ నక్షత్రము.
|
|
14. Beard
|
Beard
is defined as
దాడి, గడ్డము. * of corn వరిముల్లు, ధాన్యశూకము.
|
|
15. Bearded
|
Bearded
is defined as
దాడిగల. Beardless, adj. గడ్డముమీసము రాని, మీసకట్టురాని.
|
|
16. Bearer
|
Bearer
is defined as
మోసేవాడు. a * of a palankeen బోయి. the * of this letterయీ జాబు తెచ్చేవాడు. a mace * వెండిబెత్తపువాడు. this tree is a good * యిది బాగా కాచేచెట్టు.
|
|
17. Beargarden
|
Beargarden
is defined as
కలహస్థానము, గందరగోళముగా వుండేస్థలము.
|
|
18. Bearing
|
Bearing
is defined as
కనే, కాచే, పూచే, ఈనే. past * కాన్పువుడిగిన, కాపుడిగినa letter * postage టప్పాలు కూలియివ్వవలసినజాబు.
|
|
19. Bearish
|
Bearish
is defined as
ఎడ్డె, మడ్డి, మూఢ, మొండి.
|
|
20. Bearward
|
Bearward
is defined as
ఎలుగ్గొడ్లను పెంచేవాడు.
|
|
21. Beast
|
Beast
is defined as
మృగము, పశువు. గొడ్డు, జంతువు, జీవము.
|
|
22. Beastliness
|
Beastliness
is defined as
పశుత్వము, రౌత, అసంహ్యము.
|
|
23. Beastly
|
Beastly
is defined as
రోతైన, అసంహ్యమైన, బండు. * language బండుబూతు.
|
|
24. Beat
|
Beat
is defined as
దెబ్బ. to publish by * of drum తంబరకొట్టి ప్రసిద్ధపరచుట. during 50beats of the pluse ధాతువు యాభై మాట్లు కొట్టడములో. or ward in a town ఠాణా లరహద్దు. the watchman was then on his * రోందు. round తిరుగుతూవుండినాడు, అనగా నగరశోధన చేస్తూవుండినాడు.
|
|
25. Beaten
|
Beaten
is defined as
కొట్టబడ్డ, దెబ్బలుపడ్డ. he went over the * ground of the Willఆ వుయిలు కాకితమును వివివినిపడివుండేదాన్ని మళ్ళి మళ్ళి చెప్పుతాడు. a * pathనడిచి అరిగినదోవ * gold అపరంజి. See to Beat.
|
|
26. Beater
|
Beater
is defined as
కొట్టేవాడు. a cotton * or cotton cleaner దూదేకుల వాడు.an earth * or rammer ఘట్టనపలక, దిమ్మసు a gold * కుందనపు రేకులుచేసేవాడు. a rice * or pestle రోకలి.
|
|
27. Beatific
|
Beatific
is defined as
పరమానందమైన, దివ్యమైన. the * vision దైవ ప్రత్యక్షము, సాలోక్యము.
|
|
28. Beatification
|
Beatification
is defined as
చచ్చిన ఒక మహాత్ముణ్ని దేవతులలో కలపడము . Ten yearsafter his * వాణ్ని దేవుణ్నిగా నియమించుకొన్న పదియేండ్లకు తరువాత.
|
|
29. Beatified
|
Beatified
is defined as
ముక్తుడైన.
|
|
30. Beating
|
Beating
is defined as
కొట్టడము, తాడనము, ప్రహరము. of cotton ఏకడము. after this *యీ దెబ్బలు పడ్డతరువాత.
|
|
31. Beatitude
|
Beatitude
is defined as
మోక్షము. or Benediction, blessing, దీవన, ఆశీర్వాదము.
|
|
32. Beau
|
Beau
is defined as
నీటుగాడు, సొగసుగాడు, ఒయ్యారగాడు. The beau-ideal (more correctly,ideal, a French phrase) తిలకము, రత్నము. This is the beau-ideal of a gardenఉద్యానవనతిలకము. It is the very beau-ideal of a commentary వ్యాఖ్యానమంటే యిదే వ్యాఖ్యానము. Tipu Sultan was the beau-ideal of a Musulman.టీపు సుల్తాను తురకల చూడామణిగా వుండెను.
|
|
33. Beauish
|
Beauish
is defined as
నీటైన, వయ్యారమైన.
|
|
34. Beauteous
|
Beauteous
is defined as
అందమైన, సౌందర్యమైన, యిది కావ్యశబ్దము.
|
|
35. Beautified
|
Beautified
is defined as
restored, repaired, adorned చక్కచేయబడ్డ,బాగుచేయబడ్డ, సింగారించబడ్డ.
|
|
36. Beautiful
|
Beautiful
is defined as
అందమైన, సుందరమైన. * weather మంచికాలము, హాయిగావుండేకాలము,అనగా మబ్బుమందారము చినుకుచిత్తడి లేక హాయిగా వుండేకాలము. this is a *demonstration దివ్యమైన ఉదాహరణ.This was a * trait of affection విశాసమునకుయిదే దివ్యమైనగురుతు.
|
|
37. Beautifully
|
Beautifully
is defined as
అందముగా, సౌందర్యముగా.
|
|
38. Beauty
|
Beauty
is defined as
అందము, సౌందర్యము, చక్కదనము. or handsome woman అందకత్తె,రూపవతి. the beauties of a book, (as of Shakespeare) యెత్తి వ్రాసిన స్వారస్యమైన పద్యమంజరి.
|
|
39. Beauty-spot
|
Beauty-spot
is defined as
on the forehead తిలకము. dimple సిబ్బెము.
|
|
40. Beaver
|
Beaver
is defined as
an animal ఒకజంతువు, దీని బొచ్చుతో టోపీలు చేస్తారు. or hatటోపి. front of hemlet ముఖమును కప్పుకొనియుండే తలజీరా యొక్క భాగము.
|
|
41. Beazle, or Bezel
|
Beazle, or Bezel
is defined as
మిద్దెటుంగరము యొక్క వొమ్మచ్చు.
|
|
42. Becafico
|
Becafico
is defined as
ఒక తరహా నేలనెమలి.
|
|
43. Became
|
Became
is defined as
(the past of become)అయినది
|
|
44. Because
|
Because
is defined as
గనక, కాబట్టి, యేలనంటే. * he went పోయినాడు గనక. * of the heat యెండ అయినందున. I did this * of you నిన్ను గురించి దీన్ని చేస్తిని.* of his youth పసివాడైనందున.
|
|
45. Beck
|
Beck
is defined as
శిరఃకంపము, చెయిసౌజ్ఙ. they are wholly at his * వాండ్లంతా అతనిస్వాధీనములో వున్నారు, వాడు యెట్లా ఆడిస్తే అట్లా ఆడుతున్నారు.
|
|
46. Becoming
|
Becoming
is defined as
తగిన, యుక్తమైన, యోగ్యమైన, ఉచితమైన. this is not a * dressయిది తగినవేషము కాదు.
|
|
47. Becomingly
|
Becomingly
is defined as
యుక్తముగా, యోగ్యముగా, ఉతముగా.
|
|
48. Bed
|
Bed
is defined as
పడక, శయనము, శయ్య. he went to * పండుకొన్నాడు. when the birdswent to * పక్షులు పండుకొనేటప్పుడు. she was brought to * of a son మొగబిడ్డనుకనింది. or * stead మంచము. or mattrass పీచుకమెత్త. or feather *పక్షి రెక్కలమెత్త. in a garden * మడి, పాదు. the * of a river యేటి గర్భము, నట్టేరు, మడుగు. they dig a canal out of the * of the river నట్లేటినుంచిఒక కాలవ తీసినారు. a * of rocks చాపరాయి.
|
|
49. Bedchamber
|
Bedchamber
is defined as
పడకటిల్లు.
|
|
50. Bedclothes
|
Bedclothes
is defined as
మంచముమీద పరచే దుప్పట్లు, బూర్నీసులు, పడకవుడుపు.they brought her in her * దాన్ని పడకవుడుపుతోనే తీసుకొని వచ్చినారు.
|
|
51. Bedded
|
Bedded
is defined as
మంచము వేసిన. a double * room రెండుమంచములు వేసివుండేగది.
|
|
52. Bedding
|
Bedding
is defined as
పడక, పరుపు, మెత్త.
|
|
53. Bedfellow
|
Bedfellow
is defined as
ఒకపడకలో కూడా పండు కొనేవాడు. those children are bedfellowsఆ బిడ్డలు ఒకపడకలో పండుకొనేవాండ్లు.
|
|
54. Bedight
|
Bedight
is defined as
అలంకృతమైన.
|
|
55. Bedlam
|
Bedlam
is defined as
వెర్రివాండ్ల ఆస్పత్రి.
|
|
56. Bedlamite
|
Bedlamite
is defined as
వెర్రివాడు.
|
|
57. Bedrenched
|
Bedrenched
is defined as
తడిసిన. I was * in the rain వానలో దొప్పదోగ తడిసినాను.
|
|
58. Bedrid
|
Bedrid
is defined as
మంచములో పడివుండే, పడ్డపడకగా పడివుండే.
|
|
59. Bedroom
|
Bedroom
is defined as
పడకటి యిల్లు.
|
|
60. Bedropped
|
Bedropped
is defined as
చుక్కలుగల.Velvet * with gold చుక్కలు చుక్కలుగా సరిగె బుట్టాలు వేసిన మొహమలు.
|
|
61. Bedstead
|
Bedstead
is defined as
మంచము.
|
|
62. Bedtime
|
Bedtime
is defined as
పండుకొనేవేళ.
|
|
63. Bedunged
|
Bedunged
is defined as
యేరిగి రోతగా వుండే.
|
|
64. Bee
|
Bee
is defined as
తేనీగ. Wild black bees that make no honey తుమ్మెదలు, తేంట్లు, భృంగములు. Bees wax మడ్డిమైనము. he was as busy as a * వాడు పనిలేక క్షణమైనా వూరికె వుండలేడు.
|
|
65. Beech
|
Beech
is defined as
ఒక తరహా పెద్ద వృక్షము.
|
|
66. Beechen
|
Beechen
is defined as
యీ చెట్టు యొక్క కొయ్యతో చేసిన.
|
|
67. Beechive
|
Beechive
is defined as
తేనెగూడు.
|
|
68. Beef
|
Beef
is defined as
గోమాంసము. hung * యెండిన గోమాంసము.
|
|
69. Beefeater
|
Beefeater
is defined as
(derived from beaufet a side board) రాజసముఖములో వుండేఒక తరహా బంట్రోతు.
|
|
70. Beefsteak
|
Beefsteak
is defined as
కాల్చిన మాంసము.
|
|
71. Beeizebub
|
Beeizebub
is defined as
the name of a devil ఒక తరహా శైతానుపేరు. This is rendered భూతరాజు in SNT and BNT, while R.F.P. and the Canarese versions retain thename untranslated భేతాళుడు. Betala would perhaps be the best rendering.
|
|
72. Been
|
Been
is defined as
వుండిన, have you * there అక్కడికి పోయివుంటివా, పోయి వస్తివా. I have * to his house వాడింటికి పోయివుంటిని, పోయివస్తిని.
|
|
73. Beer
|
Beer
is defined as
బీరుసారాయి, దీన్ని బార్లి బియ్యపు గంజితో నేస్తారు గనక యవనురా అనవచ్చును.
|
|
74. Beestings, or Beestings
|
Beestings, or Beestings
is defined as
ముర్రుపాలు, జున్నుపాలు.
|
|
75. Beet
|
Beet
is defined as
ఒక తరహా కందమూలము, తినడానకు యోగ్యమైన ఒక తరహా గడ్డ.
|
|
76. Beeting
|
Beeting
is defined as
ఉబుకుగా వుండే. * brows మిట్ట కనుబొమలు.
|
|
77. Beetle
|
Beetle
is defined as
an insect వీపున పెంకున్ను రెక్కలున్నుగల పురుగు, పేడపురుగు,బొద్దెంక. or rammer దిమ్మెస. * leaf See Betel.
|
|
78. Beeves
|
Beeves
is defined as
plu. పశువులు.
|
|
79. Befitting
|
Befitting
is defined as
తగిన, యోగ్యమైన.
|
|
80. Before
|
Before
is defined as
and adv. (In time) ముందర, మునుపు, పూర్వము. The twowords ముందు Before, and వెనక After, sometimes bear a sense opposed to that used in English. Thus ముందు చేస్తాను. I will do it before, denotesI will do it presently; ముందు వ్రాలు literally the "letters preceding." must be translated The next syllables. And వెనక or కిందట (after and under )denote preceding. Thus in the word నాగలి a plough, the letter గ being themiddle syllable, the syllable నా is called కిందటి అక్షరము the followingsyllable, and లి is called ముందరి అక్షరము the preceding (lit: front) syllable. The words పిమ్మటివాండ్లు (See పిమ్మట) literally "those after him" denote his progenitors (compare Beschi, Shen Tamil Grammar, lvii).Thus also, the word పిరిది or పరింది behind frequently means before, ఆ పైని పఙ్తిలో in the next line: lit: in the line above. ఆ పైగా thereafter. PHRASES: Ten days * his arrival వాడు చేరడానకు పది దినములకు మునుపు. * now యింతకుమునుపు, ఏతత్పూర్వము. he died the day * ఆ తొలినాడు చచ్చినాడు. * I come నేను వచ్చేటందుకు మునుపు, నేను రాకమునుపు. the day * he died వాడు చచ్చేందుకు ముందునాడు. the day * yesterday మొన్న. the day * that అటు మొన్న. the month * last పోయిన నెలకు అవతలి నెల. Friday * last పోయిన శుక్రవారానికి అవతలి శుక్రవారము. In the year Vicrama * last (i.e. more than sixty years ago) పోయిన విక్రమ సంవత్సరముగాక అవతలి విక్రమ సంవత్సరములో. * Christ ఖ్రీస్తు పుట్టక మునుపు. you tell me what I knew * నాకు ముందర తెలిసినదాన్నే నీవు చెప్పుతున్నావు. In presence సమక్షమమందు, యెదట. they stood * him వాడి యెదట నిలిచిరి. In front of యెదట. there is a garden * my house నా యింటి యెదట ఒక తోట వున్నది. they were going * వాండ్లు ముందరపోతూ వుండిరి. * and behind ముందు వెనక. he did this not setting God * his eyes దేవుడు వున్నాడని యెంచక దీన్ని చేసినాడు. go * ముందరపో. this boy is much * you in learning వాడు చదువులో నీకు నిండా మించివున్నాడు. * day తెల్లవారక మునుపు. * the eyes of all men అందరికండ్ల యెదట. * mentioned ముందర వ్రాసిన, ముందర చెప్పిన, he is * the world భాగ్యవంతుడుగా వున్నాడు.
|
|
81. Beforehand
|
Beforehand
is defined as
ముందుగానే, ముందుమించి. I was * with them వాండ్లకంటేనేను ముందు మించుకొన్నాను.
|
|
82. Beforetime
|
Beforetime
is defined as
పూర్వాకాలమందు.
|
|
83. Began
|
Began
is defined as
ఆరంభించినది
|
|
84. Begat
|
Begat
is defined as
కన్నది, Abraham * Isaac అబ్రహాం యిజాకును కన్నాడు.
|
|
85. Begetter
|
Begetter
is defined as
కన్నవాడు, పుట్టించినవాడు, తండ్రి.
|
|
86. Beggar
|
Beggar
is defined as
భిక్షకుడు, యాచకుడు, తిరిపెమెత్తేవాడు, or pauper దరిద్రుడు, అతి దరిద్రుడు. he became a * అతిదరిద్రుడయినాడు, సన్యసించినాడు. A bull beggarబండవాడు, బండపక్కిరి. (i.e. fakir).
|
|
87. Beggarliness
|
Beggarliness
is defined as
meanness క్షుద్ర, నీచ, తుచ్ఛత, నీచత్వము.
|
|
88. Beggary
|
Beggary
is defined as
పేదరికము, దారిద్ర్యము.
|
|
89. Begging
|
Begging
is defined as
తిరిపెమెత్తడము, యాచకము.
|
|
90. Beginner
|
Beginner
is defined as
ఆరంభించేవాడు, ఉపక్రమించేవాడు.
|
|
91. Beginning
|
Beginning
is defined as
ఆరంభించే, మొదలుబెట్టే. matters are * to mend పని చక్కబడే వైఖరిగా వున్నది. the fruit is * to ripen ఆ కాయపండబారుతుంది. the prophets * from Moses మోససు మొదలైనరుషులు. Beginning at Jerusalem యరూశలేమ పూర్వకముగా, యరూశలేమమారభ్య. SNT.1841.
|
|
92. Begone
|
Begone
is defined as
లేచిపో, ఛీపో. come * పోపో, లేచిపో. well * మంచిది లేచిపో.
|
|
93. Begot
|
Begot
is defined as
కన్నది
|
|
94. Begotten
|
Begotten
is defined as
కన్న, జనిత.
|
|
95. Begrimed
|
Begrimed
is defined as
మురికి అయిన, మలినమైన, మాసిన,
|
|
96. Begun
|
Begun
is defined as
ఆరంభించిన.
|
|
97. Behalf
|
Behalf
is defined as
పక్షము.they spoke on his * వాడి పక్షముగా మాట్లాడినారు. a witness on my * నాపక్షముగా వుండే సాక్షి. he went there onmy * నాకై అక్కడికి పోయినాడు. signed by me on * of my brotherనా యన్నకై నాచేత చేవ్రాలు చేయబడ్డది.
|
|
98. Behaviour
|
Behaviour
is defined as
నడక, నడితి, నడవడిక, ప్రవర్తన. rough * దౌర్జన్యము. manly *పెద్ద మనిషి తనము. good * మంచినడత. he is upon his good *యీతేప తప్పితే యిందుతో వాడి పని సరి.
|
|
99. Beheld
|
Beheld
is defined as
చూడబడ్డ. this was * by thousands దీన్ని అందరు చూచినారు.
|
|
100. Behemoth
|
Behemoth
is defined as
ఒక తరహా మనుబోతు, నీరేనుగ.
|
|
101. Behest
|
Behest
is defined as
ఆజ్ఙ, ఉత్తరువు.
|
|
102. Behind
|
Behind
is defined as
వెనకతట్టుగా.
|
|
103. Behindhand
|
Behindhand
is defined as
వెనకపడి, వెనక చిక్కి. In reading he is * చదువులో వాడుపడ్డాడు.
|
|
104. Behold
|
Behold
is defined as
ఇదోచూడు, అదోచూడు. and * when they came మరిన్నివాండ్లు వచ్చినప్పుడు, యిదుగో వాండ్లు వచ్చినప్పుడు.
|
|
105. Beholden
|
Beholden
is defined as
చూడబడ్డ. or obliged ఉపకారబద్దులైన. I am much * to himfor this అతడు చేసిన యీ వుపకారమునకు నేను నిండా బద్ధుడైనాను.
|
|
106. Beholdern
|
Beholdern
is defined as
చూచేవాడు.
|
|
107. Being
|
Being
is defined as
existence వునికి, వుండడము. or a human * మనిషి, వరుడు. living* ప్రాణి, జీవి, జంతువు. there was not a * in the house ఆ యింట్లో ఒక ప్రాణిలేదు. In him we live and move and have our * ఆయనలోనే బ్రతుకుతూ మెలగుతూవుంటున్నాము. In a future state of * పరమందు. the supreme * దేవుడు.a social * సరసుడు. wretched beings దిక్కుమాలిన పక్షులు. a despicable* దుష్టహరంజాదా or state స్థితి, విద్యమానము. well * కుశలము, క్షేమము.this does not affect his well * యిందువల్ల వాడి క్షేమమునకు ఒక వ్యత్యాసములేదు.
|
|
108. Bel
|
Bel
is defined as
an heathen god శివుడు, భేతాళుడు.
|
|
109. Belated
|
Belated
is defined as
చీకటిపడ్డ. he was * వాడు రావడానికి చీకటి పడ్డది.
|
|
110. Belch
|
Belch
is defined as
తేపు, తేంపు, తేణుపు.
|
|
111. beldam
|
beldam
is defined as
ముసిలమ్మ, యిదితిట్టుమాట.
|
|
112. Belfry
|
Belfry
is defined as
ఘంటగూడు.
|
|
113. Belial
|
Belial
is defined as
శివుడు, భేతాళుడు.
|
|
114. Belied
|
Belied
is defined as
అబద్ధమైపోయిన, అపదూరుపడ్డ. he is much * or he is a thiefవాడు దొంగ అని ప్రతీతిగా వున్నది. She is much * or she killed herchild అది తన బిడ్డను తానే చంపినట్టు వదంతిగా వున్నది. he was much *వాడిమీద నిండా అబద్ధాలు పుట్టినవి. his prediction was * by the eventయీ సంభవించిన పనిచేత వాడు చెప్పినది అబద్ధమైనది.
|
|
115. Belief
|
Belief
is defined as
నమ్మిక, ఎన్నిక, మతము. In my * he is dead వాడు చచ్చినాడనినాకు తోస్తున్నది. I came in the * that they were here వాండ్లు యిక్కడ వున్నారనినమ్మివస్తిని. In the Mahomedan * తురక మతములో. this is beyond * యిది నమ్మరానిది. worthy of * నమ్మతగిన. unworthy of * నమ్మరాని. my *was that it was already sent అది మునుపే పంపబడ్డదని ఎంచియుంటిని.
|
|
116. Believer
|
Believer
is defined as
నమ్మేవాడు, భక్తుడు, మతస్థుడు.
|
|
117. Belike
|
Belike
is defined as
or perhaps ఒకవేళ, యేమో, కాబోలు.
|
|
118. Bell
|
Bell
is defined as
ఘంట, గంట. Morris bells ఆడే వాండ్లు కట్టుకొనే గజ్జలు. dumb-bellsసాముచేసే వాండ్లు తిప్పేలోడ్లు. In poetry it signifies a flower or a bud పుష్పము, మొగ్గ. Bhattumurtti bears the * among the Telugu poets ఆంధ్రకవులలోకి భట్టుమూర్తి తిలకము. the * man ఘంటవాడు, అనగా తండోరా వేసేవాడు, చాటించేవాడు.
|
|
119. Belladonna
|
Belladonna
is defined as
See Nightshade; వసనాభివంటి ఒక విషమూలిక.
|
|
120. Belle
|
Belle
is defined as
సువేష రసికయువతి, అందముగల రసికురాలైన పడుచు.
|
|
121. Belles Lettres
|
Belles Lettres
is defined as
సాహిత్య విద్య, అలంకార శాస్త్రము.
|
|
122. Belligerent
|
Belligerent
is defined as
యుద్ధముచేసే. the * powers యుద్ధముచేసే రాజులు.
|
|
123. Bellmetal
|
Bellmetal
is defined as
కంచు.
|
|
124. Bellow
|
Bellow
is defined as
or roar రంకె, గర్జన, బొబ్బలు.
|
|
125. Bellows
|
Bellows
is defined as
or a pair of bellows కొలిమి తిత్తి. two pair of * ఒక జోడుకొలిమి తిత్తులు.
|
|
126. Belly
|
Belly
is defined as
కడుపు. the * of a lute కిన్నెర కాయ. a * god తిండిపోతు:this name is absurdly given to Ganesa, the god Janus or పిళ్ళారి,pot bellied గుండోదరుడైన, పెద్ద పొట్టగల. a big bellied woman గర్భిణి. he ate his * full కడుపునిండా మెక్కినాడు. he had his * fullof fun వాడికి వేడుకతో కడుపునిండింది, వానికి కావలశినంత వేడుక అయినది. The prisoner pleaded her * తాను గర్భిణి అని మనివి చేసింది, అనగా వురితీసేటట్టు తీర్పు అయివుండినప్పటికిన్ని తాను గర్భిణి గనక వురితీయకూడదనిమనివి చేసింది.
|
|
127. Belly ache
|
Belly ache
is defined as
కడుపునొప్పి
|
|
128. Belly-band
|
Belly-band
is defined as
టంగువారు.
|
|
129. Belly-bound
|
Belly-bound
is defined as
మలబద్ధకముగా వుండే.
|
|
130. Belly-worm
|
Belly-worm
is defined as
యేటికపాము
|
|
131. Belonging
|
Belonging
is defined as
సంబంధమైన. property * to him అతనిసొత్తు. some sheets* to that book ఆ పుస్తకసంబంధమైన కొన్ని కాకితాలు.
|
|
132. beloved
|
beloved
is defined as
ప్రియమైన, యిష్టమైన. * friends, ప్రియులు. My * Lord నా ప్రాణనాధ. My * ప్రియులారా. a * girl పరియురాలు. * of God దైవకటాక్షమునకుపాత్రుడైన.
|
|
133. Below
|
Below
is defined as
కింద. * the tree చెట్టుకింద.
|
|
134. Belt
|
Belt
is defined as
నడికట్టు, దట్టి, దవాలి. a silver * round the waist worn by menవెండిబిళ్ళల మొలతాడు. worn by women వొడ్డానము. of a Saddle టంగువారు.
|
|
135. Belvedere
|
Belvedere
is defined as
శృంగార మంటపము.
|
|
136. Belwether
|
Belwether
is defined as
పెద్దపొటేలు, మేకపోతు.
|
|
137. Bench
|
Bench
is defined as
బల్ల, బలంపీట, పదిపన్నండు అడుగులు నిడివి ఒక అడుగు వెడల్పుగా యెత్తుగా కాళ్ళు పెట్టివుండే పలక. a stone * వొరుగుదిన్నెa carpenter's bench వడ్లవాడు పనిచేసేబల్ల, a seat of justice న్యాయాసనము. he was raised to the * అతనికి న్యాయాధిపతి ఉద్యోగమైనది.the magisterial * పోలీసు అధికార్లు. the *, the kings *, the queens* యిది సీమలో ఒక న్యాయసభ.
|
|
138. Bencher
|
Bencher
is defined as
ధర్మశాస్త్ర పాఠశాలలో ముఖ్యమైన విద్యార్థి, ఒక తరహా వకీలు.
|
|
139. Bend
|
Bend
is defined as
వంపు, వంకర. here the street makes a * ఆ వీధి యిక్కడ తిరుగుతుంది.
|
|
140. Bending
|
Bending
is defined as
వంపు, వంకర, తిరుగుడు.
|
|
141. Beneath
|
Beneath
is defined as
కింద, అడుగున.
|
|
142. Benedicite
|
Benedicite
is defined as
దీవించండి, దీవన, ఆశీర్వాదము.
|
|
143. Benedict
|
Benedict
is defined as
నాటకములౌ వుదాహరించబడ్డ ఒకని పేరు, పెండ్లి చేసుకో పొయ్యేవాడు. when I knew him he was a * నేను అతణ్ని యెరిగినప్పుడుపెండ్లి చేసుకోవలెనని వుండినాడు.
|
|
144. Benedictine
|
Benedictine
is defined as
ఒక తరహా పాదిరి.
|
|
145. Benediction
|
Benediction
is defined as
దీవన, ఆశీర్వాదము.
|
|
146. Benefaction
|
Benefaction
is defined as
ఉపకారము, దానము.
|
|
147. benefactor
|
benefactor
is defined as
ఉపకారి. * of a temple కైంకర్యపరుడు.
|
|
148. Benefactress
|
Benefactress
is defined as
ఉపకారి, ధర్మముచేసేటిది.
|
|
149. Benefic
|
Benefic
is defined as
గుడి మాన్యము, శ్రోత్రియము, గుడికి వచ్చే వరుమానము.
|
|
150. Beneficence
|
Beneficence
is defined as
ఉపకారము, అనుగ్రహము, కృప, దాతృత్వము. a man of *దాత.
|
|
151. Beneficent
|
Beneficent
is defined as
ఉపకారియైన, దాతయైన. the * ఉపకారులు, ధర్మాత్ములు.
|
|
152. Beneficently
|
Beneficently
is defined as
ఉపకారిగా, ధర్మాత్ముడుగా, దాతగా.
|
|
153. Beneficial
|
Beneficial
is defined as
సఫలమైన, సార్ధకమైన, ప్రయోజకమైన. Bathing is * to thehealth స్నానము చేయడము వొంటికి అనుకూలము.
|
|
154. Beneficially
|
Beneficially
is defined as
సఫలముగా, సార్ధకముగా.
|
|
155. Beneficiary
|
Beneficiary
is defined as
గుడిమాన్యమును అనుభవించే పాదిరి.
|
|
156. Benefit
|
Benefit
is defined as
ప్రయోజనము, ఫలము, లాభము, మేలు, ఉపకారము, హితము.what * will this do you యిందువల్ల నీకేమి ప్రయోజనము. God confers many benefits upon men దేవుడు మనుష్యులకు చేసేదన్ని వుపకారములే. he pleaded the * of Clergy తాను పాదిరియైనందున శిక్షించ కూడదనివాదించినాడు. Mr. Kemble took his benefit yesterday నిన్నటి కేళికలోవచ్చినదంతా Kemble అనేవాడికి పోయినది, అనగా ఆటలో వారువారు వేసినదంతా,కడమవాండ్లకు పాలు లేకుండా, వాడికే చేరినది. Literally అసనికి లాభముదొరికినది.
|
|
157. Benefited
|
Benefited
is defined as
ప్రయోజనపడ్డ, ఫలమును పొందిన.
|
|
158. Benevolence
|
Benevolence
is defined as
ధర్మ గుణము, ఉపకారము, దయ, కనికరము, ధర్మము.between man and wife దాంపత్య ధర్మము.
|
|
159. Benevolent
|
Benevolent
is defined as
ధర్మగుణముగల, దయాళువైన, ఉపకారియైన. * mind చల్లని హృదయము.
|
|
160. Bengal
|
Bengal
is defined as
బంగాళాదేశము. a * newspaper బంగాళాదేశములో అచ్చువేశినప్రసిద్ద పత్రిక. * letters అక్కడనుంచి వచ్చిన జాబులు. * rice బంగాళాబియ్యము. ( never Bengali rice) .
|
|
161. Bengalee
|
Bengalee
is defined as
బంగాళాదేశ సంబంధమైన. a * బంగాళా దేశస్థుడు. a newspaper గౌళప్రసిద్ధ పత్రిక. * letters గౌడ అక్షరాలు. the * language గౌడ భాష. the * character గౌడ లిపి.
|
|
162. Benighted
|
Benighted
is defined as
అస్తమించిన, వివేక శూన్యులేన, మూఢులైన, జడులైన. the * traveller నడిదోవలో చీకటిబడ్డ బాటసారి, the * population పామర జనము. the * presidency అంధకార పట్టణము.
|
|
163. Benign
|
Benign
is defined as
దయాళువైన, అనుకూలమైన, హితమైన. or wholesome ఆరోగ్యకరమైన.
|
|
164. Benignity
|
Benignity
is defined as
దయారసము, కృప, దయాళుత్వము.
|
|
165. Beningly
|
Beningly
is defined as
దయగా, కృపగా.
|
|
166. Benison
|
Benison
is defined as
దీవెన, ఆశీర్వాదము.
|
|
167. Benjamin
|
Benjamin
is defined as
(benzoin) సాంబ్రాణి. or cloak గొగ్గె, భైరవాసము.
|
|
168. Bent
|
Bent
is defined as
వంగిన, వంపైన, వంకరైన. the spear was * ఆ యీటె వంకరగా వున్నది.he was * with age వాడికి వృద్ధాప్యము చేత గూనివంగినది. the silver plateis * or indented ఆ వెండితట్ట నొక్కుపోయినది. or inclined తత్పురుడైన, ఆసక్తుడైన. he is * upon quarrelling జగడానికి సంకల్పము చేసుకొన్నాడు.Being * upon injustice అన్యాయానకు ఆలయమై he is * on doing justiceన్యాయ తత్పరుడై వున్నాడు. Are you * on ruining yourself? నీకు నీవే చెడిపోవలెనని నీకు సంకల్పమా?
|
|
169. Benumbed
|
Benumbed
is defined as
తిమురుపట్టిన, కొరడుపారిన. his hand was * by the blow దెబ్బచేత వాడిచెయ్యి మానై పోయినది.
|
|
170. Benzoin
|
Benzoin
is defined as
సాంబ్రాణి.
|
|
171. Bequeathed
|
Bequeathed
is defined as
మరణశాసన పూర్వకముగా పెట్టిన.
|
|
172. Bereavement
|
Bereavement
is defined as
వహీనత, కోలుపోవడము.
|
|
173. Bereft
|
Bereft
is defined as
వహీనమైన, కోలుపడ్డ.
|
|
174. Bergamot
|
Bergamot
is defined as
ఒక తరహాపండు. a fragrant water పన్నీరు వంటి వకనీళ్ళు.
|
|
175. Bergeois
|
Bergeois
is defined as
a particular size of printing letter ఒక తరహాఅచ్చు అక్షరములు.
|
|
176. Beri-beri
|
Beri-beri
is defined as
(paralytic rheumatism) వుబ్బువాయువు, తిమురువాయువు:See proof in Telugu, apud Malcolmson On Beri beri page 4-5.
|
|
177. Berry
|
Berry
is defined as
కాయ, పండు, అనగా కలిసె గొంజి మొదలైనటువంటి చిన్న చిన్న పండ్లు. brows as a * చామని చాయగల. Berry-berry See beri-beri.
|
|
178. Berth
|
Berth
is defined as
or lodgement స్థానము, పట్టు. or bed పడక.
|
|
179. Beryl
|
Beryl
is defined as
or fine emerald గరుడపచ్చ. దీన్ని పీరౌజా అని అంటారు.See Madras Journal (1840) XII. 171.
|
|
180. Beseechings
|
Beseechings
is defined as
వేడుకోళ్ళు.
|
|
181. Beseeming
|
Beseeming
is defined as
తగిన, ఒప్పిన, యోగ్యమైన. this is not * యిది యోగ్యము కాదు.
|
|
182. Beset
|
Beset
is defined as
చుట్టుకోబడ్డ, పరివేష్టితమైన. he was hard * వాడు చాలా యిబ్బందిపడ్డాడు.
|
|
183. Besetting
|
Besetting
is defined as
చుట్టుకొన్న, అనుసరించే, సహజమైన. drunkenness is their * sin తాగుబోతు తనము వాండ్లకు వుండే సహజమైన రోగము. Inventingnew phrases is the * sin of dictionary writers కొత్తవాక్యములను కల్పించడమనేదినిఘంటుకర్తలకు వుండే సహజమైన దుర్గుణము.
|
|
184. Beshrew it!
|
Beshrew it!
is defined as
దాని తలపుండు పగల, దాన్ని తగలపెట్ట.
|
|
185. Beside, besides
|
Beside, besides
is defined as
గాక, యింతేగాక, వినా. three besides this యిదిగాక మూడు. three besides him అతనుగా ముగ్గురు. besides this యిదివినా.
|
|
186. Besieger
|
Besieger
is defined as
ముట్టడి వేసేవాడు.
|
|
187. Besmeared
|
Besmeared
is defined as
చరిమిన, పట్టించిన, అలికిన, పూసిన,
|
|
188. Besmirched
|
Besmirched
is defined as
మాసిపోయిన, మురికయైన, పొగచూరిన.
|
|
189. Besmutted
|
Besmutted
is defined as
మూసిన, మురికయైన, పొగచూరిన,
|
|
190. Besom
|
Besom
is defined as
చీపరకట్ట, పొరక.
|
|
191. Besotted
|
Besotted
is defined as
తెలివితప్పిన, స్మారకములేని. how * he was to do thisదీన్ని చేయడానికి వాడకేమి జడత్వము పట్టింది. * ignorance ఒట్టి అవివేకము.
|
|
192. Besought
|
Besought
is defined as
వేడుకొన్నది,వేడుకోబడ్డ,బలిమాలుకోబడ్డ, he was * by us నాచేత వేడుకోబడ్డాడు.
|
|
193. Bespangied
|
Bespangied
is defined as
మెరిసేవాటిచేత అలంకరించబడ్డ. the awning was * with goldఆకురాళానికి బంగారు చుక్కలుపెట్టి కుట్టివున్నది. the sky is * with stars ఆకాశము చుక్కలచేత మెరుస్తున్నది.
|
|
194. Bespread
|
Bespread
is defined as
పరచిన. the table was * with dainties ఆ మేజా ఆహారములచేత పరచబడి వుండెను.
|
|
195. Best
|
Best
is defined as
ఉత్తమముగా. he wrote it * అందరి కంటే వీడు బాగా వ్రాసినాడు. hecame off * జయించినాడు. I like this * యిది నాకిష్టము. For some reason * known, to himself,he carried my horse away నాగుర్రాన్ని తీసుకొని పోయినాడు,ఆ హేతువ వాడికే తెలియవలెను. he came off second * వోడిపోయినాడు.
|
|
196. Bestained
|
Bestained
is defined as
కరయైన, మరకైన, మురికైన.
|
|
197. Bestial
|
Bestial
is defined as
పశుప్రాయమైన, రసాభాసమైన. * drunkenness చెడ్డ తాగుబోతు తనము.
|
|
198. Bestiality
|
Bestiality
is defined as
filthiness పశుప్రాయత, రోత, రసాభాసము.
|
|
199. Bestowal
|
Bestowal
is defined as
యివ్వడము, ఈవి.
|
|
200. Bestowern
|
Bestowern
is defined as
యిచ్చేవాడు, త్యాగి.
|
|
201. Bet
|
Bet
is defined as
కొట్టినది, he * or did beat కొట్టినాడు యిది ప్రాచీనమే.
|
|
202. Betel
|
Betel
is defined as
(or Areca, Paun) తమలపాకు, తాంబూలము. * nut పక్క. a *garden ఆకుతోట. the * vine తమలపాకుతీగె. * nut scissors or nippers tocut the nut ఆడ కొత్తు, పోకొత్తు. * nut box అడపము, సంబెళ. Four sortsare called వొప్పులు, పానారము, ఆరంగాలు and వలగ్రము.
|
|
203. Betimes
|
Betimes
is defined as
పెందలకాడ, సమయానికి, వేళకు.
|
|
204. Betle
|
Betle
is defined as
See Betel.
|
|
205. Betook
|
Betook
is defined as
|
|
206. Betorsed
|
Betorsed
is defined as
అల్లాడే, డోలాయమానమైన.
|
|
207. Betrayal
|
Betrayal
is defined as
శత్రువులకు చూపించి యివ్వడము, బయట వేయడము, రట్టుచేయడము.
|
|
208. Betrayed
|
Betrayed
is defined as
శత్రువులకు చూపించి యిచ్చిన, బయట పెట్టిన, రట్టుచేసిన. he was * into these expressions యీ మాటలు వాణ్ని యెరగకుండా బయట వచ్చినవి, వాడినోరు జారి వచ్చినవి.
|
|
209. Betrayer
|
Betrayer
is defined as
శత్రువులకు చూపించి యిచ్చేవాడు, ద్రోహి.
|
|
210. Betrothed
|
Betrothed
is defined as
పయిడిముడుపు చేసిన, నిశ్చితార్థము చేయబడ్డ.
|
|
211. Betrothment
|
Betrothment
is defined as
పయిడిముడుపు, నిశ్చితార్థము.
|
|
212. Better
|
Better
is defined as
పందెము వేసేవాడు.
|
|
213. Bettermost
|
Bettermost
is defined as
ఉత్తమమైన, ఘనమైన.
|
|
214. Betty
|
Betty
is defined as
తలుపు పెళ్ళగించే ఒక తరహా ఆయుధము.
|
|
215. Between
|
Between
is defined as
నడమ, మధ్య, సందున. Is there any difference * this and thatదీనికిన్ని దానికిన్ని యేదైనా భేదముకద్దా. something has got * నడమ యేదోవకటి వున్నది. * us we have managed it వాడోనేనో మెట్టుకుదాన్ని సాధించినాము.the disagreement * their statements వాడు వీడు చెప్పినదాంట్లో వుండే అసంగతముdid you hear what passed * them వారికి వీరికి జరిగినది విన్నావా? * the twohouses ఆ రెండిండ్ల నడమ. the business * him and me వాడికి నాకు వుండే వ్యవహారము. * you and me he is a drunkard వాడు తాగుబోతు యీమాట మనయిద్దరిలోనే వుండవలసినది. you must settle this between yourselves దాన్ని మీలోమీరు తీర్చుకోవలసింది. he reads Telugu and writes * whiles తెలుగు చదువుతాడు యెడవేళలో వ్రాస్తాడు. * whiles అప్పుడప్పుడు, మధ్యమధ్య.
|
|
216. Betwixt
|
Betwixt
is defined as
నడమ. See Between.
|
|
217. Bevel
|
Bevel
is defined as
ఒకతరహా కొలిచే ఆయుధము.
|
|
218. Beverage
|
Beverage
is defined as
పానము, పానకము, పానయోగ్యమైన, రసద్రవ్యము. their only *is milk వాండ్లు తాగేది పాలే.
|
|
219. Bevy
|
Bevy
is defined as
సమూహము, పక్షిసమూహము, స్త్రీసమాజము.
|
|
220. Bewailing
|
Bewailing
is defined as
యేడ్చు, మొర, రోదనము.
|
|
221. Beware
|
Beware
is defined as
భద్రము, జాగ్రత్త.
|
|
222. Bewidered
|
Bewidered
is defined as
చీకాకుపడ్డ, కలవరపడ్డ, దిగ్భ్రమపడ్డ, గాబరాపడ్డ.
|
|
223. Bewildering
|
Bewildering
is defined as
చీకాకుపరచే, దిగ్భ్రమపరచే.
|
|
224. Bewilderment
|
Bewilderment
is defined as
చీకాకు, చిక్కు, దిగ్భ్రమ. of love మోహనపరవశత్వము.Ellanna, 3. 200.
|
|
225. Bewitched
|
Bewitched
is defined as
శూన్యము పెట్టబడ్డ, మోహించిన, మరులుకొన్న, పిచ్చిపట్టిదీన్ని చేసినావు.
|
|
226. Bewitching
|
Bewitching
is defined as
మనోహరమైన, వలపించే. a * girl మోహింపచేసే స్త్రీ.* looks వలపుచూపులు.
|
|
227. Bewitchingly
|
Bewitchingly
is defined as
మనోహరముగా, వలపించేటట్టుగా.
|
|
228. Bey
|
Bey
is defined as
టర్కీషువాండ్లలో వుండేదొర, సర్దారు.
|
|
229. Beyond
|
Beyond
is defined as
and adv. అవతల, మించి, అతిశయించి. * the riverయేటికి అవతలు. * this యిదిగాక. they went * వాండ్లు మించి పోయినారు.this disease is * cure యీ రోగము కుదురేది అసాధ్యము. he is now * hopeఅతను బ్రతుకుతాడని ఆశ లేదు. lost * all reddress బొత్తిగా చెడిపోయిన. *all bounds అమితముగా. * doubt నిస్సందేహముగా. * what is herein statedయిందులో చెప్పినదిగాక. they went * (or over-reached) him వాణ్ని మోసబుచ్చిరి. to go * or surpass మించుట. or defraud మోసము చేసుట. the sum thatremained * the debt అప్పుపోగా నిలిచినరూకలు. he went * his depthనీళ్ళలో నిలువులోతును మించిపోయినాడు. It is * my power అది నాశక్తికిమించి వున్నది. * all dispute నిర్వివాదముగా. * measure అపారముగా.
|
|
230. Bezel
|
Bezel
is defined as
వుంగరపుదిమ్మె, వొమ్మచ్చు, వుంగరపుగూడు.
|
|
231. Bezoar
|
Bezoar
is defined as
పామురాయి, తేలురాయి, విషహారియనే పేరుగల ఒకరాయి,గోరోచనము.
|