a

1. Arctures Arctures is defined as read`Arcturus
2. a Bivalve shell a Bivalve shell is defined as కాకిచిప్ప, కప్పచిప్ప, ఆలిచిప్ప.
3. a Boarding-house a Boarding-house is defined as పూటకూటి యిల్లు.
4. A Catholic A Catholic is defined as కాతోలిక్ మతస్థుడు.
5. A Catholicon A Catholicon is defined as అన్ని రోగములను పట్టే మందు.
6. a Clench or Clinch a Clench or Clinch is defined as in poetry SleRa vAkyamu.
7. A Kimbo A Kimbo is defined as నడుమున చేతులు పెట్టుకొని she stood with her arms * నడుమున చేతులు పెట్టుకొని నిలిచినది, యిది తిట్టేటప్పుడు వుండే వైఖరి.
8. A Pedal A Pedal is defined as (in a piano) , Piano అనే యింగ్లిషు వీణె యొక్క కాలు, దీన్ని తొక్కితె తంబురయొక్క బిరడాను బిగించినట్లు సర్వభేదము కలుగుతున్నది.
9. A Pick A Pick is defined as or best of all ఉత్తమమైనది, శ్రేష్ఠమైనది. these men where the *of the regiment యీ సిఫాయీలు ఆ పటాళమునకు కండ్లుగా వుండిరి. take your *నీవు కోరినది యెత్తుకో. he carried me a * a pack over the water ఆ నీళ్ళలోనన్ను వీపు మీద యెత్తుకొని పోయినాడు.
10. A Priori A Priori is defined as కారణము చేత కార్యమును వూహించడము, యిది తర్క శబ్దము.
11. A Propos A Propos is defined as సమయానికి, అదునుకు. he came very a propos సమయానికివచ్చినాడు, అదునుకు వచ్చినాడు.
12. A Quickset hedge A Quickset hedge is defined as వెలుగుగా పెరిగే చెట్లు, పచ్చ వెలుగు.
13. A Quid of tobacco A Quid of tobacco is defined as పుక్కిట పెట్టుకొన్న పొగాకు. a quid of betel nut తమ్మ,వక్కాకు తమ్మ. Quid pro quo ప్రతి, చెల్లు, ఫలము.
14. A Regular A Regular is defined as a kind of priest వొక విధమైన పాదిరి.
15. A Resurrectionist or Resurrection man A Resurrectionist or Resurrection man is defined as పాతి పెట్టిన పీనుగులను తవ్వి అమ్మేవాడు. See Ann. Reg. 1776. p. [129.]
16. Arun Arun is defined as పరుగు, పరిగెత్తడము this is above the common * ఇది సామాన్యము కాదు. he took a * పరుగెత్తినాడు. in the common * of affairs వ్యవహారధోరణిగా. in the long * తుదకు, మెట్టుకు. If he goes on in this way, in the long * he must be ruined వాడు యిట్లా ప్రవర్తిస్తే తుదకు చెడుతాడు. they gave him the * of the house ఆ యింట్లో వాడి మనసు వచ్చినట్టు నడవ నిచ్చినారు. ducks,pigeons and pigs had the * of the house ఆ యింటిలో బాతులు పావురాళ్ళు పందులు యథేచ్చగా తిరుగుతూ వుండినవి. It came down by the * లటక్కున వూడిపడ్డది.
17. Arunaway Arunaway is defined as పారిపొయ్యేవాడు, పారిపొయ్యేటిది.
18. Arustle Arustle is defined as a sound of leaves, &c. మర్మరధ్వని, చటచటమనే ధ్వని.
19. AServing-man AServing-man is defined as పనివాడు.
20. Ashrug Ashrug is defined as or a * of the shoulders భుజములను యెగబెట్టుకోవడము.
21. A Sica-rupee A Sica-rupee is defined as సికారూపాయి.
22. A Skulker A Skulker is defined as he who avoids what he must do పనిలో వొళ్లు దాచేవాడు, వొళ్లు వంగని వాడు.
23. A Smatch or Smattering A Smatch or Smattering is defined as వాసన. a * of garlic ఉల్లిగడ్డ కంపు. he has a * of knowledge వాడికి రవంత జ్ఞానము వున్నది.a * of Greek (See Cowper's Progress of Error line 367)రవంత చదువు, కాస్తంత పాండిత్యము.
24. A Split A Split is defined as నెరియ, బీటిక, పగులు. there is a * in the wall ఆ గోడలో వొక బీటిక వున్నది. there was a * in the evidenceఆ సాక్ష్యములో ద్వైవిధ్యము వచ్చి చెడిపోయినది.
25. A Squaw A Squaw is defined as (తిరస్కారమైన మాట) పెండ్లాము,
26. A Taunt A Taunt is defined as a ఎత్తిపొడుపుమాట, ఎగతాళి మాట, తక్కువమాట, నింద, కుత్సితముగాచెప్పిన మాట.
27. A Tax gatherer A Tax gatherer is defined as పన్ను రూకలు తండేవాడు.
28. Atear Atear is defined as ( a rent ) చింపి, చినుగు, ఇది సుశబ్దము కాదు. *s of gum చెట్టులోనుంచి కారిన బంక.
29. Ateazle Ateazle is defined as a comb to teazle wool బొచ్చు చిక్కు తీశే దువ్వెన.
30. Athrust Athrust is defined as పోటు, తాకు, పొడుపు, గెంటు. he made four thrusts with hissword నాలుగు మాట్లు పొడవవచ్చినాడు. at a single thrust the deer killed him ఆ జింక వొకే పోటున చంపినది.
31. ATortoiseshell cat ATortoiseshell cat is defined as తాబేటి పెంకు వర్ణముగల పిల్లి.
32. Atoss Atoss is defined as the act of tossing ఎగరవేయడము, రువ్వడము, పైకి తట్టడము.
33. Atruss Atruss is defined as గోచి, లంగోటి, బుడ్డను బిగించి యీడ్చికట్టే లంగోటి. of straw కట్ట,మోపు, దిండు. a * of sallad కూరకామలకట్ట.
34. Atup Atup is defined as ( a Scotch word ) a ram పొట్టేలు. a * lamb గొర్రె యొక్కపోతుపిల్ల.
35. Awake Awake is defined as a fair సంత. funeral ceremony used in Ireland ఐరులాండు దేశస్థులు చేశే వొక వుత్తరక్రియ. the * ofa ship వాడ పోతూ వుండగా వెనకతట్టు నీళ్ళలో అగుపడే జాడ, దీనిపేరు (ablosu) ఆబులోసు అంటారు. we followed in his wake ఆయననను వెంబడించి పోయినాము. or sitting up all night, vigil జాగరము.
36. Awanton Awanton is defined as a lascivious woman కాముకురాలు, శృంగారవతి.
37. AWeighing machine AWeighing machine is defined as balance తక్కెడ, త్రాసు.
38. Awhaler Awhaler is defined as a ship which goes in search of Whales పెద్ధ చేపల వేటకు పొయ్యే వాడ.
39. A Whiffle A Whiffle is defined as a trifle రవంత.
40. A Whiffler A Whiffler is defined as a herald, an officer who went beforeprocessions to clear the way by blowing a horn ఒక దుత,అనగా వూరేగింపు పొయ్యేవాండ్లకు ముందర బరాబరి చేస్తూ పొయ్యే కొమ్మువాడు.
41. A, B,C A, B,C is defined as ఏ,బీ,సీఅనేఅక్షరములు, he has not learned his A, B, C, వాడికి ఏ, బీ,సీ,రాడు, అనగా అక్షరాలు తెలియవు.
42. Aback Aback is defined as వెనక, ఇది సముద్ర భాష.
43. Abaft Abaft is defined as వెనక, ఇది సముద్ర భాష.
44. Abandoned Abandoned is defined as విడవబడ్డ, త్యజించబడ్డ, వర్జించిన, చెయి విడవబడ్డ. or helplessదిక్కుమాలిన. or vicious దుర్మార్గమైన, దుష్ట. * to grief వ్యసనాక్రాంతుడైన.* to his lusts మోహపరశుడైన. an * woman భ్రష్టురాలు, చెడ్డది, దుష్టురాలు.
45. Abandonment Abandonment is defined as విడవడము, పరిత్యాగము. of mind విభ్రమము, పరవశత.
46. Abased Abased is defined as అణిగిన, భంగపడ్డ.
47. Abasement Abasement is defined as అవమానము, భంగము.
48. Abashed Abashed is defined as భంగపడ్డ, సిగ్గుపడ్డ. he was * వాడికి ముఖము చచ్చినది.
49. Abated Abated is defined as తగ్గిన, మట్టుపడ్డ.
50. Abatement Abatement is defined as తక్కువచేయడము, తక్కువ.
51. Abba Abba is defined as అబ్బా, తండ్రి, ఇది దేవుణ్ని గురించి చేప్పేమాట.
52. Abbacy Abbacy is defined as మఠాధిపత్యము, మఅఠము యొక్క మాన్యము.
53. Abbe Abbe is defined as (pronounced (ab-bay ) ఒక విధమైన పాదిరి.
54. Abbess Abbess is defined as సన్యసించిన స్తీల యొక్క మఠాధిపత్యము గల స్తీ.
55. Abbey Abbey is defined as సన్యాసిమఠము, సన్యసించిన పురుషుల యొక్క గాని స్త్రీల యొక్కగానిమఠము, (విహారము is the word used in Burma in Ceylon,) Abbey-lands,n. s.దేవస్థానము యొక్క మాన్యభూమి గుడినేల.
56. Abbot Abbot is defined as మఠాధిపతి, గురువు.
57. Abbreviated Abbreviated is defined as సంక్షేపము చేయబడ్డ, సంకేతాక్షరముగా వ్రాసిన, అనగా తర్వాత,అని వ్రాయడమునకు. త|| అని వ్రాసినట్టు, వెలగపూడి, భాష్టకార్లు అని వ్రాయడమునకు వె||భాష్యకార్లు, లేక వె|| భా|| అని వ్రాసినట్టు.
58. Abbreviation Abbreviation is defined as సంక్షేపము, సంగ్రహము, సంకేతాక్షరము.
59. Abdication Abdication is defined as త్యజించడము, వర్జించడము, విడిచిపెట్టడము, అనగా తన రాజ్యమునుత్యజించిపోవడము.
60. Abdomen Abdomen is defined as పొత్తికడుపు, క్రీకడుపు, వస్తి.
61. Abdominal Abdominal is defined as పొత్తికడుపు సంబంధమైన.
62. Abdominous Abdominous is defined as పెద్ద పొట్టగల.
63. Abduction Abduction is defined as తీసుకొనిపోవడము.
64. Abetter Abetter is defined as సహాయము చేసేవాడు, అనగా దుర్మార్గమునకు సహాయము చేసేవాడు.
65. Abeyance Abeyance is defined as (a state of suspension, or temporary extinction ) ఊరికేవుండడము, అనుపయోగముగా వుండడము, అనామత్తు. It is in * అది అనామత్తుగావున్నది. the appointment is now in * ఆ వుద్యోగము యిప్పుడు వూరికే వున్నది.the marriage is now in * ఆ పెండ్లి ప్రస్తుతము నిలిచివున్నది.
66. Abhorrence Abhorrence is defined as అసహ్యము, చీదర.
67. Abhorrent Abhorrent is defined as అసహ్యమైన, చీదరగావుండే.
68. Abiding Abiding is defined as స్ఠిరమైన, నిలకడైన, స్ఠిమితముగా వుండే.
69. Abigail Abigail is defined as ఆడపాప, ఆయా, పనికత్తె , ఇది పూర్వ కాలమందు వొక స్త్రీ పేరు.
70. Ability Ability is defined as శక్తి, సామర్థ్యము, పరాక్రమము. a man of * శక్తివంతుడు; మేధావి.
71. Abject Abject is defined as అతిరిక్తుడు, నిరుపేద.
72. Abjectly Abjectly is defined as అతినీచముగా, అతితుచ్ఛముగా.
73. Abjectness Abjectness is defined as నీచత్వము, క్షుద్రత.
74. Abjuration Abjuration is defined as ప్రమాణ పూర్వకముగా విడిచిపెట్టడము, శపథము.
75. Ablative Ablative is defined as The instrumental * వల్ల, తో, చేత. " by, with, " is inSanscrit grammar called తృతియా విభక్తి the third case : and thelocative * "in " is called సప్తమీ విభక్తి, లో, యందు, the seventh case. The* absolute సతిసప్తమి.
76. Able Able is defined as శక్తిగల, సామర్థ్యముగల, an * man సమర్థుడు. one who is * to readచదవగలవాడు. he is not * to read వాడు చదవలేడు. I am not * to do it నేనుదాన్ని చేయలేను. the affix అంత్య ప్రత్యయము. as "pleasurable " సంతోషకరమైన.notable ప్రసిద్ధమైన. readable చదవగూడిన. saleable అమ్మగూడిన.
77. Able-bodied Able-bodied is defined as కాయపుష్టిగల, ధృడగాత్రుడైన. an * man కాయపుష్టిగలవాడు.
78. Ablution Ablution is defined as కడగడము, ప్రక్షాళనము.
79. Ably Ably is defined as ఘనముగా.
80. Aboard Aboard is defined as వాడలో, వాడమీద. he went * వాడమీదికి పోయినాడు.
81. Abode Abode is defined as ఉండిన,నివాసముచేసిన, See To Abide.
82. Abolition Abolition is defined as ఎత్తివేయడము, తోసివేయడము. after the * of this custom ఈమర్యాదను తోసివేసిన తరువాత.
83. Abominable Abominable is defined as అసహ్యమైన, రోతగావుండే, చెడ్డ. * conduct దుర్మార్గము.
84. Abominably Abominably is defined as అసహ్యముగా, రోతగా.
85. Abomination Abomination is defined as detestation, loating అసహ్యము, చీదర, రోత. the objectof destation రోతగా వుండేటిది, అసహ్యముగా వుండేటిది, తలచీదరగా వుండేటిది.wickedness దుష్టత. this is an * ఇది దుష్ట పని, యిది దుర్మార్గము.
86. Aboriginal Aboriginal is defined as అనాదియైన. * waste అనాదిబీడు. * lords or rulersఅనాదిరాజులు.
87. Aborigines Aborigines is defined as plu. The earliest inhabitants of a country ఒక దేశములోఅనాదిగా పశుప్రాయులుగా అడవులలో తిరిగేవాండ్లు, చెంచువాండ్లు మొదలయినవాండ్లు.
88. Abortion Abortion is defined as కడుపు దిగబడడము. * took place గర్భస్రావమైనది. that child is amiserable * ఆ బిడ్డనిండా పీలగావున్నది. or horrible figure, Behind himstands a hideous animal the most horrible * that fancy ever coined.Here it means భీకరమూర్తి, భయంకరమూర్తి.
89. Abortive Abortive is defined as నిష్ఫలమైన, నిరర్థకమైన. an * birth నేలలు తక్కువగా పుట్టిన బిడ్డ.
90. About, or round About, or round is defined as చుట్టూ,చుట్టూరు ,they beat him * the head వాడి తలమీద నాలుగు తట్లా కొట్టినారు. those * him అతని వద్ద వాండ్లు. the suburbs * thecity వూరి బయిటవుండే పేట. she has no jewels * her దాని వొంటి మీదసొమ్ములు లేవు. he came with a sheet * him దుప్పటి చుట్టుకొని వచ్చినాడు. Ihave no money * me నా జేబులో రూకలు లేవు. the town is four miles * ఆపట్టణము చుట్టుకొని వస్తే నాలుగు మయిలుల దూరము వున్నది. all * అంతటా, సర్వత్ర.that road is very far * ఆ దోవ బహు చుట్టు. or concerning గురించి. theyasked him * his head వాడి తలను గురించి విచారించినారు. they came * thatbusiness ఆ పనికిగాను వచ్చిరి. or nearly కొంచెము, యించుమించు, మట్టుకు, వాసి.It is now * 4 o' clock యిప్పుడు దగ్గిర దగ్గెర నాలుగు ఘంటలు. * this timeయింత సేపటికి, యీసేపటికి, యీపాటికి. * half సగము మట్టుకు, సగమువాసి. * twofeet కొంచెము యించుమించు రెండడుగులు. a man * 30 ముప్పై యేండ్ల పాటివాడు. aman * his height వాడి అంత పొడుగాటి మనిషి. or employed upon మీద. youmust have your senses * you నీవు అజాగ్రతగా వుండరాదు. a cow * to calveయీననైవుండే ఆవు. a man * to die చావబొయ్యే మనిషి, అనగా యిప్పుడో యింకాఘడియకో అని వుండేవాడు. when I was * to set out నేను బయలుదేరవలెననివుండగా. * January జనవరి నెల అంతటికి. to bring * a సాధించుట. he broughtthe affair * ఆ పనిని నిర్వహించినాడు. he drove * the town బండి వేసుకొని వూరిచుట్టూ తిరిగినాడు, వూరంతా తిరిగినాడు. Go * your business నీపాటికి నీవుపో,లేచిపో.he looked * నల్దిక్కుల చూచినాడు, వెతికినాడు. what is he about ? వాడు యేమిచేస్తున్నాడు. the flag was blowing * ధ్వజ పటము గాలికి యిటూ అటూ ఆడుతూవుండినది,కొడిగాలికి ఆడుతూ వుండినది. the books were all lying * ఆ పుస్తకములుమూలకు వొకటిగా పడివుండినవి. why should you go * to abuse him ? వాణ్నియెందుకు తిట్టబోతావు. the ship went * వాడ తిరిగినది, మళ్లుకొన్నది.
91. Above Above is defined as మీద, పైన, మించిన, అధికమైన. * two hundred యిన్నూటికిపైన,యిన్నూటికి మించి. his conduct is * suspicion అతని నడతను గురించిఅనుమానము లేదు. this is an undertaking * his strength యిది అతని శక్తికిమించిన యత్నము. the * story యిందాకటి కథ, పైన చెప్పిన కథ. the * storyయిందాకటి కథ, పైన చెప్పిన కథ. the * stated పైన చెప్పిన. while they were *ground వాండ్లు జీవంతులై వుండినప్పుడు. * all ముఖ్యముగా. God is * allఅన్నిటికీ దేవుడు వున్నాడు. he is * receiving rent for his house వాడు తనయింటికి బాడిగే తీసుకోవడము తక్కువగా యెంచుతాడు. he is * his business వాడుతన వుద్యోగమును నీచముగా యెంచుతాడు. he is * the world వాడు కలిగిన వాడైవున్నాడు. In the world * పరమందు.
92. Above-board Above-board is defined as బాహాటముగా, బహిరంగముగా.
93. Abp Abp is defined as ContractionofArchbishop
94. Abreast Abreast is defined as వరసగా, సరిగ్గా, జోడుగా. the corps advanced four * ఆపటాలము వరసకు నలుగురేసిగా వచ్చినది. the two palanquins came * ఆ రేండుపాలకీలు సరిగ్గా వచ్చినవి, జోడుగా వచ్చినవి.
95. Abridged Abridged is defined as సంగ్రహమైన, సంక్షేపము చేయబడ్డ, తగ్గించబడ్డ, తగ్గిన.
96. Abridgement Abridgement is defined as సంగ్రహము, సంక్షేపము, తగ్గించడము, తగ్గడము. on accountof this * of his liberty వాడి స్వతంత్రము యిట్లా తగ్గిపోయినందున.
97. Abroach Abroach is defined as తెరిచిన, మొదలుపెట్టిన. to set * తెరుచుట, ఆరంభించుట. afterthey set the liquor * వాండ్లు సారాయి కారేటట్టు చేసిన తరువాత. he set the pipe* ఆ సీసాయికి బెజ్జము చేసి సారాయిని కారనిచ్చినాడు. they set this business * యీపనికి మొదలుపెట్టినారు. It is easy to set blood * but who is to stanch it ?నెత్తురు కారేటట్టు చేయడము సులభమే గాని కారకుండా నిలిపేవాడు యెవడు. who setthis ancient quarrel new * ? (Shakespeare ) పోయిన జగడాన్ని మళ్లీమొదలుపెట్టినది యెవరు.
98. Abroad Abroad is defined as బయట. both in the house and * ఇంట్లోనున్ను బయటనున్ను. hetravelled * పరదేశము తిరిగినాడు. The people were scattered * జనమునాలుగుతట్లా చెదరిపోయినది. he shed * his grace upon them తనదయనువాండ్లమీద ప్రసరింపచేసినాడు. the secret got * ఆ మర్మము బయటబడ్డది.
99. Abrogated Abrogated is defined as కొట్టివేసిన, తోసివేసిన.
100. Abrogation Abrogation is defined as కొట్టివేయడము, తోసివేయడము.
101. Abrupt Abrupt is defined as ఆకస్మికమైన, అకస్మాత్తైన. or craggy ఒడుదుడుకైన. he gave me *answer ధూర్తత్వముగా వుత్తరవు చెప్పినాడు, కట్టెవిరిచినట్టు వుత్తరము చెప్పినాడు.
102. Abruptly Abruptly is defined as ఆకస్మికముగా, ఆకస్మాత్తుగా, దడీలుమని, కట్టెవిరచినట్టుగా.
103. Abruptness Abruptness is defined as ఆకస్మికత.
104. Abrus precatorious Abrus precatorious is defined as గురిగింజ.
105. Abscess Abscess is defined as విద్రధి, అనగా తేలకుండా వుండే లోనిపుండు.
106. Absence Absence is defined as లేకవుండడము, పరోక్షము. In my * నేను లేనప్పుడు, నాపరోక్షములో.he took leave of * for ten days పది దినములకు లేకుండా వుండడమునకు సెలవుతీసుకొన్నాడు. the pains of * విరహవేదన. * of mind పరాకు, పరధ్యానము.
107. Absent Absent is defined as లేని, లేకవుండే. he is very * వాడికి నిండా పరాకు, వాడికి పరధ్యానమునిండా. he is * to-day వాడు నేడు లేడు. he was then * వాడు అప్పుడు లేడు.
108. Absentee Absentee is defined as లేనివాడు, ఉండనివాడు.
109. Absolute Absolute is defined as సంపూర్ణమైన, స్వతంత్రమైన, స్వేచ్ఛ అయిన, నిరంకుశమైన. an *monarchy నిరంకుశ ప్రభుత్వము. this is * injustice యిది సాక్షాత్తు అన్యాయము వట్టిఅన్యాయము. he is * wisdom వాడు జ్ఞానావతారము.
110. Absolutely Absolutely is defined as బొత్తిగా, శుద్దముగా, నిరంకుశముగా, అవశ్యముగా. this is * falseయిది బొత్తిగా అబద్ధము. he ruled * నిరంకుశ ప్రభుత్వము చేసినాడు.
111. Absoluteness Absoluteness is defined as పరిష్కారము, సంపూర్ణత.
112. Absolution Absolution is defined as విమోచనము, విముక్తి, అనగా పాదిరిచేసే పాపవిమోచనము. thepriest granted him * గురువు అతని పాపవిమోచనము చేసినాడు.
113. Absorbed Absorbed is defined as పీల్చబడ్డ, ఇనికిన. he was * in grief దుఃఖములో ముణిగివుండినాడు. he was * in meditation వాడు తదేక ధ్యానముగా వుండెను. these tenofficers are to remain at Madras until they are * in differentregiments ఆయా రిజిమెంట్లలో యెత్తివేసుకొనే వరకున్ను యీ దొరలు పది మందిన్నిచెన్నపట్టణములో వుండవలసివున్నది.
114. Absorbent Absorbent is defined as పీల్చే ఆకర్షించే. the * vessels నరము, తోలు, మొదలైనవి.blotting paper is * యెర్ర కాగితము తడిని యీడ్చు కొంటున్నది.
115. Absorbing Absorbing is defined as పీల్చే, ఈడ్చుకొనే. * grief కృశింపచేసే దుఃఖము.
116. Absorpt Absorpt is defined as పీల్చిన. See Absorbed.
117. Absorption Absorption is defined as పీల్చడము, ఈడ్చుకోవడము. * in the deity దేవునిలో లీనముకావడము, ఐక్యము కావడము.
118. Abstemious Abstemious is defined as abstinent,మితభోజియైన,an * person మితాహారి, మితభోజి.
119. Abstemiously Abstemiously is defined as మితభోజనముగా.
120. Abstemiousness Abstemiousness is defined as మిత భోజిత్వము. he shewed great * వాడు మహామితభోజనము చేసినాడు.
121. Abstergent Abstergent is defined as నిర్మలముచేసే, శుభ్రముచేసే. soap is * సబ్బు నిర్మలముచేసేటిది.
122. Abstinence Abstinence is defined as మితాహారము, లఘుభోజనము, ఫలాహారము, ఉపోష్యము,అభోజనము.
123. Abstinent Abstinent is defined as మితాహారియైన, లఘుభోజనము చేసే.
124. Abstract Abstract is defined as సంక్షేపమైన, పరిష్కారమైన, స్పష్టమైన. an * noun భావార్థక శబ్దము,ధర్మవాచక శబ్దము. * mediation తదేక ధ్యానము. this is an * truth యిది కేవలనిజము, యిది పరిష్కారముగా నిజము.
125. Abstracted Abstracted is defined as సంక్షేపమైన, సంగ్రహమైన. or absent పరాకైన, పరధ్యానమైన.
126. Abstractedly Abstractedly is defined as బొత్తిగా, శుద్ధముగా, పరిష్కారముగా. with absence of mindపరాకుగా, పరధ్యానముగా.
127. Abstraction Abstraction is defined as పరాకు, పరధ్యానము. or disregard of wordly objectsవిషయ పరిత్యాగము, వైరాగ్యము. or theft &c. అపహారము.
128. Abstractly Abstractly is defined as బొత్తిగా, శుద్ధముగా, పరిష్కారముగా.
129. Abstruse Abstruse is defined as చిక్కైన, కఠినమైన, గూఢమైన, మర్మమైన, అమోమయమైన.
130. Abstrusely Abstrusely is defined as చిక్కుగా, కఠినముగా, గూఢముగా, మర్మముగా.
131. Abstruseness Abstruseness is defined as చిక్కు, కాఠిన్యము, గూఢము, మర్మము.
132. Absurd Absurd is defined as అవ్యక్తమైన, అనుచితమైన, అసంగతమైన.
133. Absurdity Absurdity is defined as అవ్యక్తత, మూఢత.
134. Absurdly Absurdly is defined as అవ్యక్తముగా, మూఢత్వముగా.
135. Abundance Abundance is defined as విస్తారము, యథేష్టము.
136. Abundant Abundant is defined as విస్తారమైన, యథేష్టమైన.
137. Abundantly Abundantly is defined as విస్తారముగా, యథేష్టముగా, శానా.
138. abuse abuse is defined as or reviling తిట్టు, తిట్లు, దుర్భాష. or the ill use of any thingదుర్వినియోగము. or bad practice దుర్మార్గము, దురాచారము, అక్రమము.
139. Abusive Abusive is defined as తిట్టే, దూషించే. * language తిట్లు. Abusively, adv. దూషణగా, తిట్టి, దూషించి.
140. Abutment Abutment is defined as ముట్టుగోడ.
141. Abyss Abyss is defined as అగాధము, పాతాళము. the * of misery అఘోరమైన కడగండ్లు.
142. Acacia Acacia is defined as కనివిందచెట్టు.
143. Academical Academical is defined as పాఠశాలా సంబంధమైన. * persons పాఠశాలా సంబంధమైనవాండ్లు.
144. Academician Academician is defined as పాఠశాలా సంబంధమైన వాడు.
145. Academy Academy is defined as పాఠశాల.
146. Acanthus Acanthus is defined as ఒక విధమైన పుష్పచెట్టు.
147. Acatalectic Acatalectic is defined as సంపూర్ణమైన, ఇది ఛంధస్సులో వచ్చే మాట.
148. Accelerated Accelerated is defined as త్వరపెట్టబడ్డ, తీవ్రించబడ్డ.
149. Acceleration Acceleration is defined as త్వర, తీవ్రము.
150. Accent Accent is defined as స్వరము, ఒత్తిపలికే స్వరము, ఒత్తుపలుకుకు సూచకమైన గురుతు, వానికే,అనే శబ్దములో accent మూడో అక్షరము మీద వున్నది, వాల్మీకి అనే శబ్దములో accentరెండో అక్షరము మీద వున్నది. soft *s తిన్నని పలుకులు. humble *s వినయోక్తులు.fierce *s క్రూరవచనములు.
151. Accentuation Accentuation is defined as ఉచ్చారణ క్రమముగా గురుతులు వేయడము.
152. Acceptability Acceptability is defined as మనోహరత్వము, ఉపయుక్తత, ఇష్టత, హితము. this provesthe * of your advice యిందువల్ల మీరు చెప్పిన బుద్ధి అతనికి యిష్టమైనట్టుతెలుస్తున్నది.
153. Acceptable Acceptable is defined as మనోహరమైన, ప్రియమైన, ఉపయుక్తమైన, ఇష్టమైన, హితమైన, అనుకూలమైన. this rain is very * to the crops యీ వాన పైరుకునిండా అనుకూలమైనది. Unacceptable ప్రతికూలమైన.
154. Acceptableness Acceptableness is defined as హితము, ఇష్టము, ఉపయుక్తత.
155. Acceptably Acceptably is defined as హితముగా, ఇష్టముగా.
156. Acceptance Acceptance is defined as అంగీకారము, పరిగ్రహము, సమ్మతి.
157. Acceptation Acceptation is defined as అంగీకారము, అర్థము, తాత్పర్యము.
158. Accepted Accepted is defined as అంగీకరించిన, పుచ్చుకొన్న, పరిగ్రహించిన, ఒప్పుకొన్న, రూఢియైన. the* meaning or sense రూఢ్యర్థము.
159. Access Access is defined as ప్రవేశము. he found * to them వాండ్ల వద్ద అతనికి ప్రవేశము కలిగినది,అనగా వాడికి వాండ్ల దర్శనము చిక్కినది. he is easy of * అతని వద్ద ప్రవేశముకలగడము సులభము, అనగా అతని దర్శనము కావడము సులభము. there was an *of fever last night నిన్న రాత్రి జ్వరము ముమ్మరముగా వుండినది.
160. Accessary Accessary is defined as దుర్మార్గమునకు సహాయపడేవాడు.
161. Accessible Accessible is defined as ప్రవేశించకూడిన, the house is * thro' the garden ఆ యింట్లోకితోటగుండా ప్రవేశించవచ్చును. he is * through flattery స్తోత్రముగుండా వాడువశ్యుడవుతాడు.
162. Accession Accession is defined as ప్రవేశము. after this * ఆయనకు ప్రవేశమైన తరవాత, అనగాఆయన సింహాసన మెక్కిన తరవాత.
163. Accessory Accessory is defined as దుర్మార్గమునకు సహాయపడే.
164. Accidence Accidence is defined as లఘువ్యాకరణము.
165. Accident Accident is defined as అకస్మాత్తుగా సంభవించిన పని. this was an * యిది తనంతటసంభవించినది, యిది ఆకస్మికము. a misfortune అపాయము, ఆపద. he met withan * వాడికి ఒక ఆపద వచ్చినది. by * అకస్మాత్తుగా, అయత్నపూర్వకముగా. inphilosophy సంభవము, విశేషము, అవివక్షితము.
166. Accidental Accidental is defined as అకస్మితమైన, అకస్మాత్తైన. causeless నిష్కారణమైన.
167. Accidentally Accidentally is defined as అకస్మికముగా, అకస్మాత్తుగా. causelessly నిష్కారణముగా.
168. Acclamation Acclamation is defined as జయధ్వని.
169. Acclimated Acclimated is defined as అలవాటుగల.
170. Acclivity Acclivity is defined as ఎక్కుడు, ఎగుడు. a house was built on the * of the hillకొండ యొక్క యెక్కుడులో వొక యిల్లు కట్టి వుండెను.
171. Accommodating Accommodating is defined as తాళిమిగల, ఓర్పుగల. he is of an * temper వాడుతాళిమిగలవాడు. you should be more * నీకు నిండా తాళిమి వుండవలెను.
172. Accommodation Accommodation is defined as వసతి, ఇమిడిక, పొసగుదల, వొదుగుదల, సమాధానము, రాజీ.can you give me * in your house? మీ యింట్లో నాకు స్థలమిస్తావా. there is ahouse with * for twenty people యిరువై మందికి వసతియైన వొక యిల్లు వున్నది.his giving me these books was a great * యీ పుస్తకములను నాకుఅతడివ్వడము నిండా సహాయమైనది. an * boat వసతిగా వుండే పడవ.
173. Accompaniment Accompaniment is defined as శ్రుతి, మేళము.
174. Accompanying Accompanying is defined as వెంబడించే, అనుసరించే, కూడా వుండే.
175. Accomplice Accomplice is defined as సహకారి, దుర్మార్గమునకు సహాయపడ్డవాడు. I will not be an *in this నేను యీ దుర్మార్గమునకు సహకారిగా వుండను.
176. Accomplished Accomplished is defined as నెరవేరిన, పూర్ణమైన, పరిపక్వమైన, సిద్ధించిన. after theperiod was * ఆ కాలము పరిపక్వమైన తరువాత. after the business was * ఆపని నెరవేరిన తరువాత. after his prophecy was * అతను చేప్పిన ప్రకారముసిద్ధించిన తరువాత. * in archery ధనుర్విద్యా పారంగతుడైన. an * scholar సంపూర్ణపండితుడు, ప్రవీణుడు. an * woman వ్యక్తురాలు, నిపుణురాలు. an * dancer ఆటలోబాగా తీరిన వాడు.
177. Accomplisher Accomplisher is defined as నెరవేర్చేవాడు, నిర్వాహకి.
178. Accomplishment Accomplishment is defined as or elegant art విద్య అనావశ్యకమైన విద్య, అనగా ఆట,పాట, చిత్రము, సాము, మొదలైనవి. of a prophecy సిద్ధి, సిద్ధించడము. after the *of his prophecy సిద్ధి, సిద్ధించడము. after the * of his prophecy వాడునడవబోతున్నదన్నది సిద్ధించిన తరువాత, this prevented the * of this business ఆపని నేరవేరడమునకు యిది అభ్యంతరమైనది. a man of great *s మహాప్రవీణుడు.Drawing is a pretty * చిత్రపని వొక స్వల్పవిద్య.
179. Accompt Accompt is defined as లెక్క. See account.
180. Accomptant Accomptant is defined as లెక్కవాడు. See Accountant.
181. Accord Accord is defined as సమ్మతి. he came of his own * తనకు తానే వచ్చినాడు. All withone * అందుకు వొక మనసుగా, ఏక గ్రీవముగా.
182. Accordance Accordance is defined as అనుగుణ్యము. in * to his wish అయన కోరికకు అనుగుణ్యముగా.in * with his mandate ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారము.
183. According to According to is defined as ప్రకారము. * to orders ఆజ్ఞ ప్రకారము. * to him వాడుచెప్పిన ప్రకారము.
184. Accordingly Accordingly is defined as అదే ప్రకారముగా.
185. Accoucheur Accoucheur is defined as మంత్రసానితనము చేసేవాడు.
186. Account Account is defined as of money లెక్క. value ఘనత. a man of * ఘనుడు. people ofno * స్వల్పులు. they made no * of him వాండ్లు వాణ్ని లక్ష్యపెట్టలేదు. Or profitఫలము. this turned to account యిది సఫలమైనది. You will find your * ingoing there నీవు అక్కడికి పోతివా నీకు సఫలమీను. he turned his time to good *సత్కాలక్షేపము చేసినాడు. he turns his land to no * వాడి నేలను వృధాగా వేసిపెట్టుతాడు. Reason నిమిత్తము. on this * యిందు నిమిత్తము. they called him to* for his వాణ్ని యిందుకేమి సమాధానము చెప్పుతావు అని అడిగినారు. Description,explanation వైనము, వృత్తాంతము, చరిత్ర. this is a foolish * యిది పనికిమాలినకధ. I have received accounts from home మా దేశము నుంచి వర్తమానమువచ్చినది. I settled his accounts వాడి లెక్కలను తీర్చినాను, లేక, వాణ్ని చంపినాను.By all accounts he is gone వాడు పోయినాడట. When you blame them, youmust take their ignorance into * వాండ్ల మీద దోషము చెప్పేటప్పుడు వాండ్లఅవజ్ఞతనున్ను నీవు యోచించవలెను. On * of his absence అతను లేనందున. hebought it on his own * దాన్ని తన సొంతానికి కొనుక్కొన్నాడు. on * of the rainవానవల్ల. You must on no * go there నీవు అక్కడికి యెంతమాత్రము పోకూడదు.he is gone to his final * or to his great * చచ్చినాడు.
187. Accountable Accountable is defined as ఉత్తరవాదియైన, జవాబుదారియైన.
188. Accountant Accountant is defined as లెక్కవాడు. of a village కరణము.
189. Account-book Account-book is defined as లెక్కపుస్తకము.
190. Accountred Accountred is defined as ధరించిన, తొడిచిన, ముస్తీబు చేయబడ్డ, సన్నద్ధము చేయబడ్డ. * witha sword ఖడ్గధారియైన, కత్తికట్టుకొన్న. he was then * with two pistols అప్పట్లోవాడు రెండు పిస్తోలులు కట్టుకొని యుండినాడు.
191. Accoutrement Accoutrement is defined as ఆయుధములు, బట్టలు, మొదలైన ముస్తీబు.
192. Accredited Accredited is defined as వకాలత్తు నామాగల అధికారముగల.
193. Accretion Accretion is defined as పెరిగినది, సంభవించినది.
194. Accumulated Accumulated is defined as పోగుచేసిన, ఆర్జించిన, చేరిన, కూడిన. * injustice బహుఅన్యాయము.
195. Accumulation Accumulation is defined as పోగు, రాశి. he left a great * of debts విస్తారముఅప్పుపెట్టి పోయినాడు. * of wealth బహుధనము.
196. Accuracy Accuracy is defined as ఖండితము, పరిష్కారము, శుద్ధత. he wrote this with great *దీన్ని తప్పులు లేకుండా వ్రాసినాడు. a man of great * నిండా ఖండితమైనవాడు.
197. Accurate Accurate is defined as ఖండితమైన, పరిష్కారమైన, శుద్ధమైన. an * translationపరిష్కారమైన భాషాంతరము, సరియైన భాషాంతరము. an * copy శుద్ధప్రతి.
198. Accurately Accurately is defined as ఖండితముగా, సరిగ్గా, పరిష్కారముగా. a copy written *శుద్ధముగా వ్రాసి ప్రతి.
199. Accurateness Accurateness is defined as ఖండితము, పరిష్కారత, శుద్ధత, సుబద్ధత. From the * of thisaccount I saw his talent వాడు దీన్ని వర్నించిన పరిష్కారతవల్ల వాని ప్రజ్ఞ నాకుతెలిసినది.
200. Accursed Accursed is defined as శపించబడ్డ, దౌర్భాగ్యమైన, చెడ్డ, పాపిష్టి.
201. Accusation Accusation is defined as నిందమోపడము, నెపము, అపవాదము. they brought an * oftheft against him దొంగలించినాడని వాడిమీద ఫిర్యాదు తెచ్చినారు.
202. Accused Accused is defined as నిందమోపబడిన. those who are * of doing this యీ పనిచేసినారని అనబడ్డవాండ్లు. the accused ప్రతివాది, నేరము మోపబడ్డవాండ్లు.
203. Accuser Accuser is defined as పిర్యాది, వాది. who is the * in this యీ పని జరిగినట్టుచెప్పేవాడెవడు.
204. Accustomed Accustomed is defined as అభ్యాసపడ్డ, అలవాటుపడ్డ, వాడికపడ్డ, మరిగిన.
205. Ace Ace is defined as పగడ, వంచ. in cards వకచుక్క, దీన్ని ఆసు అంటారు. I was within an* of falling నేను పడడానకు పగడ తప్పింది.
206. Acerbity Acerbity is defined as చెడుపులుసు, క్రౌర్యము.
207. Acescency Acescency is defined as పులిసేగుణము.
208. Acescent Acescent is defined as పులుసుగావుండే.
209. Acetous Acetous is defined as పులిసే.
210. Ache Ache is defined as నొప్పి. heart * మనోవ్యధ. tooth * పండ్లతీపు.ear * చెవిపోటు.
211. Achievement Achievement is defined as కార్యము, సాధించిన కార్యము. or ensigns armorial చిహ్నము.this was a great * మహత్తైన కార్యము. his achievements are two lionsవాడికి బిరుదు రెండు సింహములు.
212. Achilles Achilles is defined as ద్రోణాచార్యులవంటి వక శూరుడు.
213. Achromatic Achromatic is defined as వర్నవిహీనమైన.
214. Acid Acid is defined as పులుసు. * muriatic లవణ ద్రావకము. vitriolic * గంధక ద్రావకము.nitrious * పెట్లుప్పు ద్రావకము.
215. Acidity Acidity is defined as పులుసు.
216. Acidulated Acidulated is defined as పులియబెట్టిన.
217. Acknowledged Acknowledged is defined as వొప్పిన, అంగీకరించిన. or renowned ప్రసిద్ధమైన. It mustbe * that some of them are rich వారిలో కొందరు భాగ్యవంతులుగా వుండేదివాస్తవమే. she is an * beauty అది అందకత్తె యని ప్రసిద్ధురాలైనది.
218. Acknowledgement Acknowledgement is defined as అంగీకారము, వొప్పుకోవడము. or receipt for moneyచెల్లుచీటి. * of a benefit కృతజ్ఞత, ఉపకారస్మృతి. * of a bow ప్రతివందనము. wemake you these acknowledgements for our new dresses మేము కొత్తబట్టలు కట్టుకొన్నాము గనుక తమకు దండము పెట్టుతాము.
219. Acme Acme is defined as శిఖరము, ఊర్ధ్వభాగము, ఉఛ్రాయము. the * of a disease రోగముయొక్క ముమ్మరము. the * of felicity అనందాతిశయము.
220. Acolyte Acolyte is defined as శిష్యుడు.
221. Aconite Aconite is defined as వకతరహా విషమూలిక.
222. Acorn Acorn is defined as కాయ, విత్తు, యిది Oak మొదలైన కొన్ని గొప్ప వృక్షముల యొక్క కాయ,వీటిని పందులు తింటవి.
223. Acoustics Acoustics is defined as ధ్వని విషయక శాస్త్రము.
224. Acquaintance Acquaintance is defined as పరిచయము, యెరుక, నెళువు, యెరిగినవాడు,పరిచయము గలవాడు. he told a mutual * of oursతన్ను నన్ను యెరిగిన వకడితో చెప్పినాడు. this shews his * with grammarయిందువల్ల అతనికి వ్యాకరణమందు పరిచయము కద్దని తెలుస్తుంది. they scraped *with me నన్ను పరిచయము చేసుకొన్నారు. he has many acquaintances అతనికియెరిగినవాండ్లు శానామంది వున్నారు. they are acquaintances of mine వాండ్లునా కెరిగిన వాండ్లు. he has no * with English అతనికి ఇంగ్లీషు పరిచయము లేదు.
225. Acquainted Acquainted is defined as యెరిగిన, పరిచయముగల. I am not * with his name వాడిపేరు నాకు తెలియదు.
226. Acquiescence Acquiescence is defined as సమ్మతి, అంగీకారము. In consequence of his * అతనువొప్పుకొన్నందున.
227. Acquired Acquired is defined as సంపాదించిన, ఆర్జించిన, గ్రహించిన, నేర్చుకొన్న.
228. Acquirement Acquirement is defined as సంపాదించడము. After the * of this forture యీఐశ్వర్యము వచ్చిన తరువాత, ప్రాప్తమైన తరువాత. After the * of this languageయీ విద్యను గ్రహించిన తరువాత. in plural విద్య, పాండిత్యము. a man of greatacquirements మహావిద్వాంసుడు, మహాపండితుడు.
229. Acquisition Acquisition is defined as సంపాద్యము, ఆర్జన. personal * స్వార్జితము.
230. Acquisitiveness Acquisitiveness is defined as విచారించే బుద్ధి. See under Cranology.
231. Acquittal Acquittal is defined as దోషము లేదనడము, నేరము లోదని తీర్పువ్వడము.
232. Acquittance Acquittance is defined as రుణవిమోచనము, చెల్లుచీటి.
233. Acre Acre is defined as నాలుగువేల యెనమన్నూట, నలభైగెజాల చదర భూమి, దీన్ని వొక ఏకరా, లేకవొక కాణి అంటారు.
234. Acrid Acrid is defined as వగరు, కారము, వేండ్రము.
235. Acridity Acridity is defined as వగరు, కారము, వేండ్రము, తీక్ష్ణము, చురుకు. the * of the limepowder burnt his tongue సున్నపు వేండ్రముచేత నాలికెపొక్కింది.
236. Acrimonious Acrimonious is defined as క్రూరమైన, పరుషమైన, కఠోరమైన. * language కర్ణకఠోరమేనమాటలు. * humours in the body శరీరములో వుండే విష నీరు.
237. Acrimoniously Acrimoniously is defined as క్రూరముగా, కఠోరముగా.
238. Acrimony Acrimony is defined as క్రూరత, పరుషత, కఠోరత, తీక్ష్ణత.
239. Across Across is defined as అడ్డముగా. there is a bridge * the river ఆ యేటికి వంతెనకట్టివున్నది. a house * the river యేటికి ఆ తట్టువుండే బంగళా. they went * theriver యేటిని దాటినారు. when I came * him అతడు నాకు యెదురు పడ్డప్పుడు.
240. Acrostic Acrostic is defined as ఒక తరహా చిత్రబంధ కావ్యము, యిందులో ప్రతి చరణము యొక్కమొదటి అక్షరములను కూర్చి చదివితే ఒక మనిషి యొక్కగాని ఒక వస్తువుగాని పేరుఅవుతున్నది.
241. Act Act is defined as క్రియ, పని. religious * కర్మము, వ్రతము. a rash * క్రూర కృత్యము. anoble * ఘనమైన కార్యము. an * in a play అంకము, అనగా నాటకములో ఒక భాగము.an * of parliament or government చట్టము. the * of God or the kingదైవికము రాజికములు. while I was in the * of falling నేను పడుతూ వుండగా. Icaught him in the * వాడు ఆ పని చేస్తూ వుండగా పట్టుకొన్నాను.
242. Acting Acting is defined as బదులుగా పని చేస్తూవుండే. the * judge ఒకరి బదులుగా పనిచూస్తూవుండే న్యాయాధిపతి.
243. Action Action is defined as క్రియ, చలనము, పని, కార్యము, ఆట. the hands of the watch arenot in * ఆ ఘడియారము యొక్క ముండ్లు ఆడలేదు, తిరగలేదు. a good * సత్కర్మము,పుణ్యము. In law వ్యాజ్యము. he brought an * against them వాండ్ల మీదవ్యాజ్యము తెచ్చినాడు. or Battle యుద్ధము. One * took place in the morningand one in the evening తెల్లవారి ఒక యుద్ధము జరిగినది. the * of a medicineమందు యొక్క వ్యాపకము. or gesture అభినయము. he used much * in talkingమాట్లాడడములో అభినయములు నిండా చేసినాడు. Dryden says "To an exactperfection they have brought The action Love : the passion is forgot. "మోహమును గురించిన అభినయమును దివ్యముగా వర్ణించినాడు గాని మోహరసమునువిడిచిపెట్టినాడు.
244. Actionable Actionable is defined as శిక్షవచ్చే, దండన వచ్చే. Opening another man's letter is *ఒకరి జాబును విచ్చితే శిక్ష కలుగును.
245. Active Active is defined as క్రియగల, చలనముగల, చురుకైన, జాగ్రతగల, వుటంకియైన. an * horseచురుకైన, జాగ్రతగల, వుటంకియైన. an * horse చురుకైన గుర్రము. or busy పాటుపడేan * man చురుకుమనిషి, పాటుపడేవాడు. The volcano is not now * ఆఅగ్నిపురము యిప్పుడు మండలేదు. In grammar సకర్మకమైన. an * verb సకర్మకక్రియ. an * disease త్వరలో మనిషిని చంపే రోగము. charity is an * virtue :endurance and temperance are passive virtues ధర్మము ఆచరణ రూపమైనగుణము, సహనమున్ను మితమున్ను అనుభవరూపమైన గుణములు.
246. Actively Actively is defined as చురుకుగా.
247. Activity Activity is defined as చురుకు, జాగ్రత. the * of fever or of a medicine వేగము. Thefire is not in a state of * నిప్పు మండలేదు.
248. Actor Actor is defined as చేసేవాడు. a stage player నటి, ఆడేవాడు, వేషగాడు. We wereactors in this business, and you were only spectators యీ పనిని చేసినవాండ్లు మేము వూరికే చూచిన వాండ్లు మీరు.
249. Actress Actress is defined as ఆటకత్తె , వేషకత్తె.
250. Actual Actual is defined as నిజమైన, వాస్తవ్యమైన, యధార్థమైన, ప్రత్యక్షమైన. or presentతాత్కాలికమైన, ప్రస్తుతమైన. this is * murder యిది సాక్షాత్తు ఖూనిపని. this is *injustice యిది ప్రత్యక్షమైన అన్యాయము. the * holder of the land ప్రస్తుతము .ఆభూమిని అనుభవించేవాడు. the * cautery రక్ష, వాత.
251. Actually Actually is defined as నిజముగా, వాస్తవ్యముగా, యధార్థముగా, ప్రత్యక్షముగా.
252. Actuary Actuary is defined as or Accountant లెక్కలు తీర్పుచేసేవాడు.
253. Actuated Actuated is defined as ప్రేరేపించబడ్డ. In doing this he was * by friendshipస్నేహితమునుబట్టి దీన్ని చేసినాడు. * by terror భయమునుపట్టి. * by love for herదానియందు వ్యామోహముచేత.
254. Acumen Acumen is defined as సూక్ష్మబుద్ధి, కుశాగ్రబుద్ధి.
255. Acute Acute is defined as క్రూరమైన, తీక్ష్ణమైన, చురుకైన. an * lawyer తీక్ష్ణబుద్ధిగలవకీలు. *pain పోటుబుద్ధిగలవకీలు. * pain పోటు, సళుపు. an * disease త్వరలో చంపేరోగము,తక్షణము చంపే రోగము. * intellect తీక్ష్ణబుద్ధి. the * accent ఉదాత్త స్వరము. an *angle అంతర్లంబకాస్రము.
256. Acutely Acutely is defined as కూరుగా, తీక్ష్ణముగా, సూక్ష్మముగా.
257. Acuteness Acuteness is defined as కూరు, తీక్ష్ణత, చురుకు.
258. ad Libitum ad Libitum is defined as కావలసినమట్టుకు, యథేచ్ఛగా.
259. Adage Adage is defined as వాడుకగా అనేమాట, సామిత. there is an * that "doctors differ "వైద్యులు తలా వక మాట అంటారనడము వాడుకగా అనే మాటేగదా.
260. Adagio Adagio is defined as in music విళంబితము.
261. Adam Adam is defined as అదిమపురుషుని నామము. the sons of * * నరులు.
262. Adamant Adamant is defined as వజ్రము, రవ, హీరము.
263. Adamantine Adamantine is defined as అతికఠినమైన. a man of * constitution వజ్రదేహి.
264. Adaptation Adaptation is defined as సరిపరచడము, పొసగించడము, పొందిక, యిమిడిక.
265. Adapted Adapted is defined as తగిన, ఉపయుక్తమైన, యోగ్యమైన. this is * to many purposesయిది బహు పనులకు వుపయుక్తమైనది.
266. Adder Adder is defined as కట్లపాము. Deaf * మంత్రానికి లోబడని కట్లపాము, మాట వినని మూఖు ్డు.
267. Addictedness Addictedness is defined as దురాశ, లోలత్వము.
268. Addition Addition is defined as కూర్చడము, చేర్చడము, వృద్ధి. In Arithmetic గుణకారము. he hadan * to his family yesterday నిన్న వాడికి బిడ్డ పుట్టింది. In * to his formerstatement వాడు మునుపు చెప్పినది కాకుండా.
269. Additional Additional is defined as అధికమైన, ఎక్కువైన. * expenses అధికవ్యయములు. * servantsఅధిక పనివాండ్లు.
270. Additional rules Additional rules is defined as ఉపనిబంధనలు
271. Addle Addle is defined as అవిసిపోయిన, నిస్సారమైన, కలవరమైన. an * egg అవిసిపోయిన గుడ్డు.an * pated or * headed fellow కలవరపు మనిషి, పిచ్చివాడు.
272. Addled Addled is defined as See Addle.
273. Address Address is defined as a petition మనివి, అర్జి. or speech ప్రసంగము, సంభాషణ.direction పై విలాసము. title వక్కణ, బిరుదావళి. skill నిపుణత. Mode ofbehaviour మర్యాద, రసము. a man of good * సరసముగా, లేక, ఘనముగామాట్లాడేవాడు. a man of mean * జబ్బురసముగా మాట్లాడేవాడు. he paid hisaddresses to her తన్ను పెండ్లి చేసుకొమ్మని దాన్ని ఉపసర్పించినాడు.
274. Adept Adept is defined as ప్రవీణుడు, నిపుణుడు, సమర్థుడు, జితపడ్డవాడు. he is an * inarithmetic లెక్కలో పూర్ణుడు.
275. Adequate Adequate is defined as తగిన, యోగ్యమైన, సరియైన.
276. Adequately Adequately is defined as తగినట్టుగా.
277. Adherence Adherence is defined as అంటుకొని వుండడము, అనువర్తనము. or fixedness పట్టు. Bythe * of the skin to the flesh తోలు మాంసమును అంటుకొని వుండడమువల్ల.this shews their * to the law యిందువల్ల ఆ చట్టము మీద వాండ్లకు వుండే పట్టుతెలుస్తుంది. his * to the truth saved him వాడు నిజమును అవలంబించడము వాణ్నికాపాడింది.
278. Adherent Adherent is defined as అనుసరించినవాడు, అవలంబించినవాడు, ఆశ్రితుడు. he and hisadherents వాడున్ను వాడితో చేరిన వాండ్లున్ను.
279. Adhering Adhering is defined as అంట్లుకొన్న, చేరిన, అనుసరించిన, ఆశ్రయించిన.
280. Adhesion Adhesion is defined as అంటుకోవడము, కరుచుకోవడము, బంధన the water destroyedthe * of the gum నీళ్ళచేత ఆ బంక యొక్క బంధన పోయినది.
281. Adhesive Adhesive is defined as అంటుకొనే, కర్చుకొనే బంధనగల. * plaister కర్చుకొని వుండేప్లాస్తిరి. glue is * వజ్రము బంధన గలది, కర్చుకొనేటిది.
282. Adieu Adieu is defined as దండము, దీవన, సలాము, ఒకరిని ఒకరు యెడబాసేటప్పుడు శెలవు తీసుకొనిపొయ్యేవాడు, శెలవు యిచ్చి పంపించేవాడు యిద్దరున్ను చెప్పేమాట. he bade them *శెలవు పుచ్చుకొన్నాడు, శెలవు యిచ్చి పంపినాడు, పోయి వస్తా నన్నాడు, పోయిరాఅన్నాడు. I bade * to these hopes నేను యీ ఆశను విడిచిపెట్టినాను. he bade * tothe world సన్యసించినాడు. the same as good bye or farewell అనే మాటలకుసమానము. he uttered his last * చచ్చినాడు.
283. Adjacency Adjacency is defined as సమీపత్వము.
284. Adjacent Adjacent is defined as సమీపమైన, దగ్గిరి.
285. Adjective Adjective is defined as విశేషణము.
286. Adjoining Adjoining is defined as చేరికగావుండే. In the * house పొరుగింటిలో, పక్క యింటిలో.
287. Adjournment Adjournment is defined as మరిఒకవేళ జరిగిస్తామని తత్కాలానికి నిలిపిపెట్టడము.
288. Adjudication Adjudication is defined as తీర్పు చేయడము, తీర్పు యివ్వడము, విధించడము.
289. Adjunct Adjunct is defined as సంయోగించివుండేటిది, చేరివుండేటిది.
290. Adjuration Adjuration is defined as ఒట్టుపెట్టడము, అనబెట్టడము, ఒట్టు, ఆన.
291. Adjusted Adjusted is defined as దిద్దిన, సవరించిన, క్రమపరచిన.
292. Adjustment Adjustment is defined as దిద్దుబాటు, సవరింపు.
293. Adjutancy Adjutancy is defined as అజిట ్ వుద్యోగము .
294. Adjutant Adjutant is defined as దండులో అజిటననే వొక దొర. A sort of Crane బెగ్గురు అనే పెద్దకొంగ.
295. Admeasurement Admeasurement is defined as కొలత.
296. Administration Administration is defined as జరిగించడము, చెల్లించడము, విచారణ. * of governmentప్రభుత్వమును జరిగించడము. During his * అతని మంత్రిత్వములో. * of justiceన్యాయ విచారణ. Letter or power of * చచ్చినవాని ఆస్తిని గురించి న్యాయసభవారిద్వారా వచ్చిన అధికార పత్రిక.
297. Administrator Administrator is defined as చచ్చినవారి ఆస్తిని గురించి న్యాయసభలో అధికారముతీసుకొన్నవాడు, విచారణకర్త.
298. Administratorship Administratorship is defined as చచ్చినవారి ఆస్తిని గురించి న్యాయసభలో తీసుకొన్నఅధికారము.
299. Administratrix Administratrix is defined as చచ్చిన వారి ఆస్తిని గురించి న్యాయసభలో అధికారమునుతీసుకొన్న స్త్రీ.
300. Admirable Admirable is defined as అద్భుతమైన, ఘనమైన, ఉత్తమమైన.
301. Admirably Admirably is defined as అద్భుతముగా, దివ్యముగా, ఘనముగా.
302. Admiral Admiral is defined as యుద్ధవాడలకు అధిపతి. * of the Red, * of the White, * of theBlue, Rear * యీనాలుగున్ను ధ్వజపటము యొక్క వర ్ భేదము చేత కలిగినఆధిపత్యము యొక్క భేదములు.
303. Admiralty Admiralty is defined as వాడలో జరిగే కొట్టుతిట్లు మొదలయ్ని వ్యాజ్యములు తీర్చే న్యాయసభ.
304. Admiration Admiration is defined as అద్భుతము, ఆశ్చర్యము.
305. Admirer Admirer is defined as మెచ్చుకొనేవాడు. he is an * of hers దాన్ని మోహించినవాడు.
306. Admiringly Admiringly is defined as ఆశ్చర్యపడి, మోహించి.
307. Admissibility Admissibility is defined as అంగీకారయోగ్యత. he proved the * of these accountsయీ లెక్కల యొక్క అంగీకారతను రుజువు చేసినాడు.
308. Admissible Admissible is defined as అంగీకరించ యోగ్యమైన.
309. Admission Admission is defined as ప్రవేశము, చేర్చుకోవడము, లోనికి రానివ్వడము, లోనికి రావడానకుశెలవు. After his * into the school వాడు పల్లెకూటములో ప్రవేశించిన తరువాత.Before the * of the water నీళ్లు లోగా రాకమునుపే, చొరడానకు మునుపే, hecould not gain * లోగా ప్రవేశించడానకు వాడికి అవకాశము చిక్కలేదు శెలవు చిక్కలేదు.the water gained * through the roof యింటి కప్పుగుండా నీళ్ళు దిగినది,వురిసినది. they refused him * వాణ్నిలోనికి రానివ్వమన్నారు, చేర్చుకోమన్నారు. orconfession ఒప్పుకోవడము, అంగీకారము. On his * of these charges వాడు యీతప్పులను వొప్పుకున్నందు మీదట.
310. Admittance Admittance is defined as లోనికి రానివ్వడము, లోనికిరావడానికి శెలవు, ప్రవేశము. I cannotget * to him; or, into his presence అతని వద్ద నాకు ప్రవేశము చిక్కలేదు, అనగా,అతని వద్దకి పోగూడలేదు.
311. Admitted Admitted is defined as చేర్చుకోబడ్డ, రానిచ్చిన, అంగీకరించబడ్డ, వొప్పుకొన్న.* but సరేగాని.
312. Admixture Admixture is defined as మిశ్రమము, కలుపు.
313. Admonition Admonition is defined as బుద్ధిచెప్పడము, బోధన, ఉపదేశము.
314. Admonitory Admonitory is defined as బుద్ధిచెప్పే, బోధించే. an * poem నీతికావ్యము, ఉపదేశ గ్రంథము.
315. Ado Ado is defined as శ్రమ, తొందర, యిబ్బంది. or Bustle అల్లరి, గత్తర. without any more *he paid the money ఆ రూకలను అనాయాసముగా చెల్లించినాడు. I had much * tohelp laughing సంకటపడి నవ్వును అణుచుకొంటిని. he had much * to get foodఅన్నానికి నిండా శ్రమపడ్డాడు.
316. Adolescence Adolescence is defined as యౌవనము, యౌవనావస్థ.
317. Adolescent Adolescent is defined as యౌవనావస్థగా వుండే.
318. Adonis Adonis is defined as అతిసుందరమైనఒకదేవునిపేరు
319. Adopted Adopted is defined as దత్తుచేసుకోబడ్డ, అవలంబించిన. an * son దత్త పుత్రుడు. the method* by these వాండ్లు అవలంబించిన మార్గము.
320. Adoption Adoption is defined as దత్తు, స్వీకారము, అవలంబించడము. from your * of hissentiments వాడి భావము నీకు పట్టుబడ్డది గనక, వాడి బుద్ధే నీకున్ను వచ్చినది గనక.After his * of this plan వాడు యీ యుక్తిని అవలంబించిన తరువాత, యీ మాదిరినిపట్టిన తరువాత.
321. Adoptive father Adoptive father is defined as దత్తు చేసుకొన్న తండ్రి.
322. Adorable Adorable is defined as పూజ్యమైన, పూజనీయమైన, పూజార్హమైన.
323. Adorably Adorably is defined as పూజనీయముగా, పూజార్హముగా.
324. Adoration Adoration is defined as పూజ, అర్చన.
325. Adored Adored is defined as పూజ్యమైన, పూజార్హమైన.
326. Adorer Adorer is defined as పూజచేసేవాడు. an * of the sun సూర్యోపాసకుడు.
327. Adorned Adorned is defined as అలంకరించిన, శృంగారించిన, with many virtues సకలగుణసంపన్నుడైన.
328. Adornment Adornment is defined as అలంకారము, శృంగారము.
329. Adrift Adrift is defined as నీళ్ళమీద కొట్టుకొని పోయే, ఘాలికి కొట్టుకొనిపొయ్యే, విడిచిపెట్టి, దిక్కులేక. Wood that is * నీళ్ళ మీద విడిగా తేలేమాను. that boat is * పడవ ఘాలికికొట్టుకొని పోతుంది. All the cotton is now * యిప్పుడు పత్తి అంతా ఘాలికికొట్టుకపోయినది. he cut the boat * దారమును తెగ్గోసి పడవను యధేచ్ఛగావిడిచిపెట్టినాడు. he cut me * నన్ను నిరాధరముగా విడిచి పెట్టినాడు.
330. Adroit Adroit is defined as చమత్కారియైన, నేర్పరియైన, నిపుణుడైన.
331. Adroitly Adroitly is defined as చమత్కారముగా, నేర్పుగా, నిపుణతగా.
332. Adroitness Adroitness is defined as చమత్కారము, నేర్పు, నిపుణత.
333. Adry Adry is defined as దప్పికగా, దాహముగా. I am * నాకు దాహముగా ఉన్నది.
334. Adscititious Adscititious is defined as అధికమైన, ఉపరియైన, అన్యత్ర తెచ్చుకొన్న.
335. Adulation Adulation is defined as ఇచ్చకము, ముఖస్తుతి, బుజ్జగింపు.
336. Adulator Adulator is defined as ఇచ్చకాలమారి, ముఖస్తుతి చేసేవాడు, బుజ్జగించేవాడు, ఉబ్బించేవాడు.
337. Adulatory Adulatory is defined as బుజ్జగింపైన, స్తోత్రమైన, ఉబ్బించే.
338. Adult Adult is defined as వయసు వచ్చిన మనిషి, ప్రాయపు మనిషి. Both infants and adultsపసివాండ్లున్ను వయసు వచ్చిన వాండ్లున్ను.
339. Adulteration Adulteration is defined as కలిపిచెరపడము, మట్టము చేయడము. to prevent the * ofthis silver యీ వెండి కలపడమై పోకుండా.
340. Adulterer Adulterer is defined as జారుడు, ఒకని పెండ్లాన్ని పట్టేవాడు.
341. Adulteress Adulteress is defined as వ్యభిచారి, జార స్త్రీ.
342. Adulterine Adulterine is defined as పరపురుషునికి పుట్టిన, జారజుడైన.
343. Adulterous Adulterous is defined as రంకుగల, వ్యభిచారముగల.
344. Adultery Adultery is defined as రంకు, వ్యభిచారము, జారత్వము.
345. Adust Adust is defined as యెండిన, శుష్కించిన.
346. Advance Advance is defined as ముందుకు రావడము, అభివృద్ధి, ముందు రూకలు. in his * వాడివతలికిరావడములో. to prevent his * వాడివతలికి రాకుండా నిలపడానకు. his * in theservice was slow వాడికి వుద్యోగము త్వరగా పొడగలేదు. I observed noadvance in his learning వాడికి విద్యలో అభివృద్ధి కానము. he made a rapid * inthe language ఆ భాష వాడికి త్వరగా వచ్చినది. his rapid * in learningsurprises me వాడి విద్యాభివృద్ధిని గురించి నాకు ఆశ్చర్యమౌతున్నది. she madeadvances to him వాడికి బులుపులు పెట్టింది, ఆశ కొలిపింది. he made advancesto a reconciliation మళ్లీ సమాధానము చేసుకోవలెనని యత్నపడ్డాడు. Money paidin * for cultivation వారకము, తక్కావి.
347. Advanced Advanced is defined as ముందుకు వచ్చిన, ముందుకు సాగిన, ముందరనడచిన, అభివృద్ధియైన,పొడిగిన, చాచిన ముందు రూకలిచ్చిన, చెప్పిన. the boy is well * in grammarవ్యాకరణములో బహుదూరము చదివినాడు. Well * in age నిండా యేండ్లు చెల్లిన. * inrank వుద్యోగములో పొడిగిన. the work is now far * ఇప్పుడా పని బహుదూరముజరిగినది. the statement * by them వాండ్లు చెప్పినమాట. the * force ముందుగాపోయిన దండు. Money * to tenants to pay for seed వారకము, తక్కావి. themoney * for this యిందుకై ముందుగా యిచ్చిన రూకలు.
348. Advancement Advancement is defined as అభివృద్ధి.
349. Advantage Advantage is defined as లాభము, ప్రయోజనము, ఉపయోగము, ఆదాయము, ఫలము. thatwill be no * అందువల్ల ఫలము లేదు. he let the * slip లాభమును విడిచిపెట్టినాడు,పోగొట్టుకొన్నాడు. he was born with the advantages of fortune andstrength ఐశ్వరమున్ను కాయపుష్టిన్ని అనే విశేషములతో కూడా పుట్టినాడు. oropportunity సమయము. they took * of his weakness and robbed him వాడిఆశక్తిని చూచుకొని దోచుకొన్నారు. he took * of my absence నేను లేని సమయముచూచుకొన్నాడు. he took * of me నన్ను మోసపుచ్చినాడు. In selling this houseto me he took * of me by concealing its age ఆ ఇంటిని నాకు అమ్మడములోఅది పాతదని తెలియచేయక మోసపుచ్చినాడు. Do you think that I would take an* of you నిన్ను మోసము చేతుననుకొన్నావా. you should not give them such an* over you నీవు వాండ్లకు అట్లా యెడమివ్వరాదు. you have the * of me నీదిపై చెయిగా వున్నది. I had the * of being taught by him ఆయన దగ్గెర చదివినానన్న అధిక్యము నాకు కద్దు. Being on the hill the enemy has the * over usకొండమీద వుండినందున శత్రువులు మాకు పై చెయిగా వుండిరి. he has some * overme in learning చదువులో అతను నాకు కొంచెము పై చెయిగా వున్నాడు. he appearedto great * in this business యీ పనిలో వాడి తేజస్సు బయటపడ్డది, వాడిప్రభావము బయటపడ్డది. he sold the house to * ఆ యింటిని లాభముగా అమ్మినాడు,కిఫాయిత్తుగా అమ్మినాడు. It appears to great * here యీ తట్టునుంచి చూస్తే అదిబాగా కండ్ల బడుతుంది. he arranged his arguments to much * వాడు బద్దలు కట్టిమాట్లాడినాడు, శృంగారించి మాట్లాడినాడు.
350. Advantaged Advantaged is defined as లాభమును పొందిన, ఫలమును పొందిన.
351. Advantage-ground Advantage-ground is defined as వైపుగావుండే స్థలము.
352. Advantageous Advantageous is defined as ప్రయోజనకరమైన, లాభకరమైన, ఫలకరమైన, ఆదాయమైన,ఉపయోగమైన, అనుకూలమైన. he made a very * marriage వివాహముచేసుకోవడమువల్ల వాడికి నిండా వుపయోగము.
353. Advantageously Advantageously is defined as లాభముగా, ఉపయోగముగా.
354. Advantageousness Advantageousness is defined as లాభము, ఫలము, ఆదాయము.
355. Advent Advent is defined as ఆగమనము, అనగా ఖ్రీస్టు మాస్పండుగకు ముందువచ్చే నాలుగు వారాలు.
356. Adventiously Adventiously is defined as తనకుతానే, తనంతటనే, హటాత్తుగా.
357. Adventitious Adventitious is defined as that which happens సంభవించే, సంఘటించే, తటస్థించే,సంప్రాప్తమయ్యే, ఆగంతుకమైన, అవాంతరమైన. or extrinsic పై, బయటి. heeffected this without * aid పై సహాయము లేకనే దీన్ని నెరవేర్చినాడు. she is anexcellent woman; her beauty is an * circumstance అది మహాఘనురాలు దానిఅందము అవివక్షితము.
358. Adventure Adventure is defined as దైవఘటనము, సంభవించినపని, చరిత్ర, వృత్తాంతము, సాహసము,వింత, అతియము. a man of * సాహసుడు. I had an odd * yesterday నిన్ననాకొక అతిశయము సంభవించినది. this ring has had some curious adventuresయీ వుంగరాన్ని గురించి కొన్ని వింతలు సంభవించినవి. Adventures of RobinsonCrusoe రాబి ్స ్ క్రూసో అనే వాని చరిత్ర. the adventures of Aniruddhaఅనిరుద్ధ చరిత్ర. the adventures of Stella and the Genius తారాశాశంకవిజయము. the adventures of Nala నళోపాఖ్యానము. At all adventures youmust go there tomorrow. యేమి సంభవించినా నీవు అక్కడికి పోవలసినది,యెట్లాగైనా పోవలసినది. in trade దేశాంతరమునకు విక్రయానకై పంపించిన సరుకు.
359. Adventurer Adventurer is defined as సాహసి, తెగించినవాడు, అనగా యిందులో మన అదృష్టము బయటపడదా అని వక పనికి తెగించినవాడు. Many adventurers joined the armyశానామంది తమకున్ను యేదయినా ఒక పని చిక్కదా అని తెగించి ఆ దండులో పోయికలిసినారు.
360. Adventuresome Adventuresome is defined as సాహసమైన.
361. Adventurous Adventurous is defined as తెగువగల, సాహసముగల.
362. Adventurously Adventurously is defined as తెగించి, సాహసముగా.
363. AEshetic AEshetic is defined as forసావయమైనread,సావయవమైన
364. Affirmation Affirmation is defined as confirmation, declaration నిశ్చయముగాచెప్పడము. ratification, an establishing of what had been before done or decreed రూఢిచేయడము. solemn *, or form of words which is used instead of an oath ప్రమాణమునకు ప్రతిగా స్థిరముగా చెప్పేక్రమము.
365. Afflicted Afflicted is defined as బాధపడే. * with fever జ్వరముతో బాధపడే. he was * blindnessవాడికి నేత్రోపద్రవము కనిపించింది, గుడ్డివాడైనాడు.
366. Afflicting Afflicting is defined as దుఃఖకరమైన, బాధించే.
367. Affliction Affliction is defined as కష్టము, ఆపద, క్లేశము, బాధ, వ్యాకులము, వ్యసనము.
368. Afflictive Afflictive is defined as దుఃఖకరమైన, వ్యసనకరమైన.
369. Affluence Affluence is defined as సంపత్తు, భాగ్యము, పదవి.
370. Affluent Affluent is defined as భాగ్యవంతుడైన, ఐశ్వర్యవంతుడైన. he is in * circumstances వాడుభాగ్యవంతుడై వున్నాడు.
371. Affluently Affluently is defined as ఐశ్వర్యముగా, భాగ్యముగా.
372. Afflux Afflux is defined as సంపద, ప్రవహించడము.
373. Affray Affray is defined as జగడము, గత్తర, కలహము.
374. Affrayed Affrayed is defined as భయపడ్డ, దిగులుపడ్డ. Affray, n. s. జగడము, గత్తర, కలహము.
375. Affright Affright is defined as వెరపు, జడుపు, దిగులు, భయము.
376. Affrighted Affrighted is defined as జడిసిన, బేదిరిన.
377. Affront Affront is defined as అమర్యాద, అవమానము, తిరస్కారము.
378. Affronted Affronted is defined as ఆయాసము పొందిన, రేగిన, ఆగ్రహపడ్డ. he was * at thisయిందుకు ఆయాసపడ్డాడు. he thought himself * by them వాండ్లు తన్ను అమర్యాదచేసినట్టు అనుకొన్నాడు.
379. Affronting Affronting is defined as అవమానమైన, తిరస్కారమైన, అమర్యాదైన.
380. Affused Affused is defined as పైన పోసిన, కమ్మిన.
381. Affusion Affusion is defined as పైన పోయడము, కమ్మడము.
382. Afield Afield is defined as పొలములో బయట.
383. Afloat Afloat is defined as తేలుతూ. the ship is * ఆ వాడ తేలుతుంది. all the land is afloat ఆ నేలంతా ఏక వెల్లువగా వున్నది. that transaction is still * ఆ వ్యవహారముయింకా పరిష్కారము కాలేదు. many rumours are * about this యిందున గురించిఅనేక వదంతులు పుట్టివున్నవి.
384. Afoot Afoot is defined as నడుస్తూ. he came * పాదచారిగా వచ్చినాడు. the army was * allnight ఆ దండు రాత్రి అంతా నడిచినది. he set the business * ఆ పనిని ఆరంభముచేయించినాడు, ఆ పనికి మొదలుపెట్టించినాడు.
385. Afore Afore is defined as ముందర.
386. Aforesaid, or Aforementioned Aforesaid, or Aforementioned is defined as ముందర చెప్పిన.
387. Aforetime Aforetime is defined as పూర్వకాలమందు, పూర్వమందు.
388. Afraid Afraid is defined as బెదిరిన, భయపడ్డ. I was * జడిస్తిని, వెరిస్తిని. this made them *యిందుకు జడిస్తిరి. I am * he is hurt వాడికి గాయము తగిలినదేమో. I am * he isgone వాడు పోయినాడేమో. I am * he will die వాడు చచ్చునేమో. I am * it is notenough అది చాలదేమో. I am * you thought so తమరు అట్లా తలచినారేమో. I am* I cannot come to-day నేడు నేను రాలేనని తోస్తుంది.
389. Afresh Afresh is defined as తిరిగీ, మళ్లీ, పునః.
390. Africa Africa is defined as ఆఫ్రికా దేశము.
391. Afront Afront is defined as యెదురుగా, యెదుట.
392. Aft Aft is defined as వెనక, యిది సముద్రభాష. fore and * ముందూ వెనకా.
393. After After is defined as తర్వాతి, వెనకటి, రెండో, ఉత్తర. an * thought వెనకటి తలంపు.
394. Afterages Afterages is defined as వెనకటి కాలము, ఉత్తరకాలము, పశ్చాత్కాలము.
395. Afterall Afterall is defined as మెట్టుకు, తుదకు, కడకు.
396. Afterbirth Afterbirth is defined as మావి.
397. Aftercrop Aftercrop is defined as రెండో భోగము, రెండో పంట.
398. Afterdinner Afterdinner is defined as భోజనాత్పరము.
399. Afterlap Afterlap is defined as తర్వాత సంభవించిన అపాయము.
400. Afterlife Afterlife is defined as వెనకటి కాలము, వెనకటి వయస్సు. You will be sorry for this in *యిందున గురించి అవతల యేడవబోతావు.
401. Aftermath Aftermath is defined as కసువుయొక్క రెండో కోత.
402. Aftermost Aftermost is defined as వెనకటి.
403. Afternoon Afternoon is defined as మధ్యాహ్నోత్పరము, noon మధ్యాహ్నము. Forenoonమధ్యాహ్నత్పూర్వము, యిది శబ్దతః అయ్యే అర్థము, ప్రయోగములో యిందుకువ్యత్యాసముగా అర్థమౌతున్నది. యేలాగంటే, Breakfast కు తర్వాత. Dinnerపర్యంతము. Morning or Forenoon అంటారు, యిది వ్యవహార యోగ్యమైన కాలము. Icalled on him this morning నేటి దినము ఆయన దర్శనానకు పోయినాను. Dinnerకు మునుపు యెన్ని ఘంటలైనా సరి. morning అంటారు. Dinner కు తర్వాత, Eveningఅంటారు. Afternoon అనగా Dinner కు తర్వాత, అస్తమాన పర్యంతరం, యెవరికైతే రాత్రిళ్ళు భోజనము చేసే మర్యాద కలదో వారికి. Afternoon అనే వ్యవహారములేదు.
404. Afterpains Afterpains is defined as మావినొప్పి.
405. Afterpart Afterpart is defined as వెనకటి భాగము, ఉత్తర భాగము.
406. Aftertaste Aftertaste is defined as వెనకటిరుచి.
407. Afterthought Afterthought is defined as వెనకపుట్టిన యోచన, తర్వాత పుట్టిన తలంపు.
408. Aftertimes Aftertimes is defined as వెనకటి కాలము.
409. Afterwards Afterwards is defined as తర్వాత, పిమ్మట, వెనుక, తదనంతరము.
410. Aga Aga is defined as తురక సేనాధిపతి.
411. Again Again is defined as మళ్ళీ, తిరిగి, పునః. I did not abuse him అతన్ని నేను బదులుకుతిట్టలేదు. It is half as big * అది వకటికి వకటిన్నరంత పెద్దదిగా వున్నది. thishouse is as large * as the other యీ యిల్లు ఆ యింటికి రెండింతలు పెద్దదిగా వున్నది.over * మళ్లీ ఒకసారి. * and * మాటి మాటికి, పదేపదే, మళ్లీ మళ్లీ.
412. Against Against is defined as మీద, పైన, యెదురుగా, విరుద్ధముగా, ప్రతికూలముగా. he swam *the stream ప్రవాహానికి యెదురు యీదినాడు. a charm * posion విషము దిగేమంత్రము. he set himself * us మాకు శత్రువుగా యేర్పడ్డాడు. Have this ready *tomorrow యిది రేపటికి సిద్ధముగా వుండవలెను. you must be ready * myarrival నేను వచ్చి చేరేటప్పటికి నీవు సిద్ధముగా వుండవలెను. they leaned theirlances * the wall వాండ్లు యీటేలను గోడకు ఆనించినారు. he harbours ill will *me వాడు ఆంతర్యములో నా మీద విరోధము పెట్టుకొన్నాడు. ants provide food *rainy season చీమలు వాన కాలమునకై మేతను జాగ్రతచేసి పెట్టుకొంటవి. he made acomplaint * me నామీద ఫిర్యాదు చేసినాడు. a sin * god దేవుని విషయమైన చేసినపాపము. he spoke * me నాకు ప్రతికూలముగా మాట్లాడినాడు, విరోధముగామాట్లాడినాడు. * the law న్యాయవిరోధముగా, చట్టవిరోధముగా. he laid this by *they returned వాండ్లు మళ్లీ వత్తురని దీన్ని దాచిపెట్టినాడు, లేక,పెట్టిపెట్టినాడు. this was quite * the hair or * the grain యిది అత్యంత విరుద్ధముగా వుండెను, అత్యసహ్యముగా వుండెను. the house over * mine మా యింటికియెదురుగా వుండే యిల్లు.
413. Agallochum Agallochum is defined as అగరుగంధపు చెక్క.
414. Agape Agape is defined as నోరుతెరుచుకొని.
415. Agaric Agaric is defined as the mushroom కుక్కగొడుగు. Ainslie, I. 5.
416. Agast Agast is defined as వకతరహా రాయి, దీన్ని శిఖా వుంగరాలు మొదలైన వాటికి వేస్తారు.
417. Agate Agate is defined as add, A+ says యిస్మ. The Kannadi says వైడూర్యము. so says Perceval.
418. Age Age is defined as వయస్సు, ప్రాయము, యీడు, ఆయుస్సు, యుగము. at an early *బాల్యమందు. he was cut off in the flower of his * మంచి వయస్సులో వాణ్నితుంచుకొని పోయినది. as you advance in * నీకు వయస్సు రాగారాగా. he is faradvanced in * వాడికి నిండా యేండ్లు చెల్లింది. In the present * యీ కాలములో. Inthe former * పూర్వకాలములో. old * వృద్దాప్యము. he is under * వాడికి వయస్సురాలేదు, వ్యవహార యోగ్యమైన కాలము రాలేదు. he is of * వాడికి వయస్సు వచ్చింది,వ్యవహారదశ వచ్చింది. It is an * since I saw you నిన్ను చూచి బహు దినాలుఅయినది. I consider a day as an * during your absence నాకు నీవు లేనిదినముఒక యుగముగా వున్నది. I have been waiting here this age బహు సేపటినుంచికాచుకొని వున్నాను or బహుదినములుగా కాచుకొని వున్నాను. they held that landfrom * to * వాండ్లు ఆ నేలను తరతరాలుగా అనుభవించిరి. the golden *కృతయుగము. the silver * త్రేతాయుగము. the brazen * ద్వాపరయుగము.the iron * కలియుగము.
419. Aged Aged is defined as వయసు చెల్లిన, ముసలి. * ten పదియేండ్లుగల. an * man ముసలివాడు.an aged woman ముసలిది. an * tree ముదురుచెట్టు. the * వృద్ధులు.
420. Agency Agency is defined as మంత్రాంగము, మంత్రిత్వము, కర్తృత్వము, గుమాస్తాగిరి. this waseffected thro, the * of his friends వాని స్నేహితుల వ్యాపకత్వముచేత యీపనితలకట్టినది. this is ascribed to his * యిది ఆతని ప్రాజాపత్యమువల్ల కలిగిన దనిఅంటారు. this is ascribed to preternatural * యిది ఒక ఉత్సాతమువల్ల కలిగినదని అంటారు. a mercantile * వర్తకులు, వ్యాపారము.
421. Agent Agent is defined as కర్త, కారకుడు, గుమాస్తా, వకీలు, వ్యవహారము చూచేవాడు, మంత్రి. hewas the chief * in this business యీ పనిలో వీడు ముఖ్యుడు, ప్రముఖుడు. afree * స్వతంత్రుడు. he was a willing * in their hands వాండ్లు వాణ్ని యెట్లాఆడిస్తే అట్లా ఆడుతూ వుండినాడు. I was an unwilling * in their hands నాకుఇష్టము లేదు గాని వాండ్లు యేట్లా ఆడిస్తే అట్లా ఆడవలసి వచ్చింది. a mercantile *అడతిదారుడు. a chemical * సాధకము, సాధనము. * in grammar (Nominative) కర్త.
422. Aggrandizement Aggrandizement is defined as గొప్పతనము, అభివృద్ధి.
423. Aggravated Aggravated is defined as అధికమైన, అతిశయించిన. this is * injustice యిది మరీఅన్యాయము, అతి అన్యాయము.
424. Aggravation Aggravation is defined as అధికము చేయడము, బలము చేయడము. this excuse is an *of your crime యీ సాకు నీ తప్పును మరీ అధికము చేస్తుంది.
425. Aggregate Aggregate is defined as మొత్తమైన.
426. Aggression Aggression is defined as విరోధ మారంభము చేయడము, ముందుగా దుర్మాగ ్ ము చేయడము,ముందుగా చేయిమించడము.
427. Aggressor Aggressor is defined as మొదట చెయిమించినవాడు, మొదట నోరుమించినవాడు,కలహమారంభము చేసినవాడు.
428. Aggrieved Aggrieved is defined as దుఃఖపడ్డ, అన్యాయము పొందిన.
429. Aghast Aghast is defined as ఆశ్చర్యపడి, వెరగుపడి. at these words he stood * యీ మాటలువిని మానై నిలిచిపోయినాడు.
430. Agile Agile is defined as లాఘవముగల, చులకనైన, చురుకుగల. stags are very * లేండ్లు బహులాఘవము గలవి.
431. Agility Agility is defined as లాఘవము. with * లాఘవముగా, చివుక్కున, చంగున.
432. Agio Agio is defined as వట్టము.
433. Agitated Agitated is defined as కదిలించిన, కలియబెట్టిన, కలవరపడ్డ.
434. Agitatedly Agitatedly is defined as కలవరముగా, తొందరగా.
435. Agitation Agitation is defined as కదలడము, అల్లాటము, తొందర, కలవరము, అల్లోలకల్లోలము. Inconsequence of the * of this subject యీ సంగతిని కలియబెట్టినందువల్ల.
436. Agitator Agitator is defined as కదిలించేవాడు, కలియబెట్టేవాడు, ఎచ్చరించేవాడు.
437. Ago Ago is defined as కిందట, మునుపు, ముందర. Two or three days * రెండు మూడుదినాలకిందట, రెండు మూడు దినాలకు ముందర. long * బహు దినాల కిందట, శానాసేపుకుముందర.
438. Agog Agog is defined as ఆతురముగా, అభిలాషగా. these words set him * to go there యీమాటల చేత వాడికి అక్కడికి పోవలెనని ఆతురము పుట్టినది. what makes you so *to abuse people మనుష్యులను తిట్టడానకు నీకింత పదటమేమి.
439. Agoing Agoing is defined as పోతూ, చేస్తూ. he set the watch * ఆ గడియారమును తిరిగేలాగుచేసినాడు.
440. Agony Agony is defined as వేదన, యాతన, సంకటనము, బాధ. the moral * మరణవేదన.
441. Agrarian Agrarian is defined as పొలమును గురించిన, క్షేత్రవిషయమైన.
442. Agreeable Agreeable is defined as అనుగుణ్యమైన, తగిన, మనోజ్ఞమైన, యింపైన. this conduct was* to orders యిట్లా చేసినది, ఆజ్ఞకు అనుగుణ్యముగా వుండినది. If you are * wewill go ( this is base English for " if you are willing " ) నీవు మెచ్చితేమేము పోతాము. They were not * మెచ్చలేదు.
443. Agreeableness Agreeableness is defined as ఇంపు, మనోజ్ఞత, పొంకము. from the * of this situationయీ స్థలము యొక్క రమ్యతవల్ల.
444. Agreeably Agreeably is defined as అనుగుణ్యముగా, రమ్యముగా. * to your orders తమ ఆజ్ఞప్రకారము. we were surprized at his return అతడు తిరిగి వచ్చినాడు యిందుకుఆశ్చర్యపడి సంతోషించినాము.
445. Agreed Agreed is defined as ఇమిడిన, సరిపడిన, పొసగిన, గిట్టిన.
446. Agreement Agreement is defined as ఒడంబడిక, సమాధానము, పొందిక, ఇమిడిక. they came to an *సమాధాన పడ్డారు.
447. Agricultural Agricultural is defined as వ్యవసాయ సంబంధమైన, సేద్య సంబంధమైన.
448. Agriculture Agriculture is defined as కృషి, వ్యవసాయము, సేద్యము.
449. Agriculturist Agriculturist is defined as కృషిచేసేవాడు, వ్యవసాయము చేసేవాడు, సేద్యము చేసేవాడు.
450. Aground Aground is defined as దరితట్టి, యెటూ తోచక. the ship ran * ఆవాడ గట్టు తట్టినది. I amquite * regarding this యిందున గురించి యెటూ తోచక వున్నాను.
451. Ague Ague is defined as చలిజ్వరము.
452. Aguish Aguish is defined as చలిజ్వరముగల. I feel * today నాకు నేడు చలిజ్వరము తగిలినది.this is an * place యిది చలిజ్వర భూమి.
453. Agument Agument is defined as ( the temporal * ) వృద్ధి.
454. Ah Ah is defined as అకటా, అయ్యో, అబ్బా.
455. Aha Aha is defined as అహహా, ఓహో.
456. Ahead Ahead is defined as ముందు మించి, ముందర. to send * ముందుగా సాగనంపుట. theywere * వాండ్లు ముందుగా సాగివుండిరి. that ship was * of us మా వాడలకు ఆవాడలకు ఆ వాడ ముందు మించిపోయి వుండినది.
457. Aid Aid is defined as సహాయము, ఉపకారము, ఆదరణ. medical * వైద్యము, చికిత్స .
458. Aid-de-camp Aid-de-camp is defined as యేడీ కేంపు, అనగా Governor, Commander-in-Chief వీర్ల యొక్క హస్తకుడు, యీ వుద్యోగములో తమ స్నేహితులు లేక, బంధువులుయొక్క కొమాళ్ళను పెట్టుకొంటారు, నిజానుచరుడనవచ్చును.
459. Aigrette Aigrette is defined as తురాయి. made of feather పక్షి రెక్కలతో చేసిన తురాయి. setwith precious stones కలికి తురాయి.
460. Ailing Ailing is defined as రోగము, నలి, నలుకువ.
461. Ailment Ailment is defined as రోగము, నలుకువ, వ్యాధి.
462. Aim Aim is defined as లక్ష్యము, గురి, సూటి. or view యత్నము, ఉద్దేశ్యము. what is your *in writing this letter to him యీ జాబును అతనికి వ్రాయడములో నీ యత్నములోనీ యత్నమేని. he took * at the bird ఆ పక్షిమీద గురిపెట్టినాడు.
463. Aimless Aimless is defined as లక్ష్యము లేని, ఉద్దేశ్యము లేని.
464. Air Air is defined as గాలి, వాయువు, ఆకాశము. he walked upon his hands with his legsin the * కాళ్ళు పైకి యెత్తుకొని, చేతులతో నడచినాడు. or mien ముఖజాడ, పోలిక. heshews great airs or he gives himselves airs అహింకరిస్తాడు, పోకిళ్ళుపోతాడు. as light as * అతిలాఘవమైన. when the story got * యీ కథ బయటపడ్డప్పుడు. in music రాగము.
465. Aired Aired is defined as ఆరబెట్టిన, గాలికి ఆరబెట్టిన, యెండ బెట్టిన. damp paper * at the fireశెగన కాచిన తడి కాకితము.
466. Airily Airily is defined as ఉల్లాసముగా.
467. Airiness Airiness is defined as గాలికి తెరపగా వుండడము. or gaity ఉల్లాసము. on account ofthe * of this room యీ యిల్లు గాలికి తెరపై నందున.
468. Airing Airing is defined as గాలికి ఆరబెట్టడము, గాలి సోకనివ్వడము. or jaunt గాలిసవారి.ఒలాతడము. he gave the books an * ఆ పుస్తకములను గాలికి ఆరబెట్టినాడు.
469. Airpump Airpump is defined as వాయుయంత్రము.
470. Airt Airt is defined as (Scotch:apointofthecompass)దిక్కు, all the airtsthe wind can blow అష్టదిక్కులు.
471. Airy Airy is defined as గాలికి తెరపగా వుండే. an * house గాలికి తెరపగా వుండే యిల్లు. thin orlight తేలికైన, సన్నని. an * diet స్వల్పాహారము. * notions నిరాధారమైన తలంపు, ఒట్టి తలంపు.
472. Aisle Aisle is defined as పక్కసాల్పు,అనగా మాదాగుడి మూడు సాల్పులుగా వుంటుంది, నడిమిసాల్పుnavel అనబడుతున్నది, పక్కసాల్పు aisle అనబడుతున్నది.
473. Ait Ait is defined as తిప్ప, లంక.
474. Ajar Ajar is defined as ఓరవాకిలిగా. the door was * ఆ తలుపు ఓరవాకిలిగా వుండినది.
475. Akin Akin is defined as సంబంధమైన, తుల్యమైన, సమానమైన. they are * to us వారు మాకురక్తసంబంధులు. this is * to theft యిది దొంగతనానికి సమానమైనది. Telugu is *to Canarese తెలుగు కన్నడానకు నిండా చేరిక.
476. Alabaster Alabaster is defined as అతిశుభ్రమైన సున్నపు తెల్లరాయి, దీనితో ప్రతిమలు చేస్తారు. her *hand దాని తెల్లని చెయ్యి.
477. Alack Alack is defined as అయ్యో, అకటా.
478. Alackaday Alackaday is defined as అయ్యో, అకటా.
479. Alacrity Alacrity is defined as ఉల్లాసము, సంతోషము.
480. Alamode Alamode is defined as సరసముగా.
481. Alangium hexapetalum Alangium hexapetalum is defined as ఊడుగుచెట్టు, అంకోలము, నికోచకము.
482. Alarm Alarm is defined as భయము, దిగులు, గాబరా, అపాయమును తెలియచేయడము. I entertainno * for him అతణ్ని గురించి నాకు భయము లేదు. or tumult అల్లరి, గత్తర. On hisgiving the * of fire నిప్పు అంటుకొన్నదని వాడు అరిచేటప్పటికి. he gave the * ofthe enemy's approach యిదుగో శత్రువులు వచ్చినారని అరచినాడు. I gave himthe * వాడికి యెచ్చరిక చేసినాను. he sounded an * సన్నద్ధులు కమ్మని భాంకావూదినాడు.
483. Alarmed Alarmed is defined as భయపడ్డ. they were * by the watchman తలారివాడు వాండ్లకుయెచ్చరిక చేసినాడు.
484. Alarming Alarming is defined as భయంకరమైన, భయజనకమైన.
485. Alarmingly Alarmingly is defined as భయంకరముగా, భయజనకముగా.
486. Alarum Alarum is defined as ఎచ్చరిక చేసే తుత్తారా, ఎచ్చరిక చేసే గడియారము.
487. Alas Alas is defined as అయ్యో, అకటా, పాపము.
488. Alb Alb is defined as పాదిరి తొడుక్కొనే వక తరహా తెల్ల వుడుపు.
489. Albacore Albacore is defined as లోన సముద్రములో వుండే ఒక తరహా చేప.
490. Albatross Albatross is defined as సముద్రమందు సంచరించే ఒక తరహా బ్రహ్మాండమైన పక్షి.
491. Albeit Albeit is defined as అయినప్పటికిన్ని.
492. Albino Albino is defined as పట్టుపాప.
493. Albion Albion is defined as ఇంగ్లండుదేశము, యిది కావ్యమందు వచ్చే శబ్దము.
494. Albugo Albugo is defined as కనుగుడ్డుమీద పడే పువ్వు.
495. Album Album is defined as ఒక తరహా పుస్తకము.
496. Alcaid Alcaid is defined as కాజీ, తురక న్యాయాధిపతి.
497. Alcaide Alcaide is defined as కాజీ, తురక న్యాయాధిపతి.
498. Alcalde Alcalde is defined as కాజీ, తురక న్యాయాధిపతి.
499. Alchymical Alchymical is defined as రసవాద సంబంధమైన.
500. Alchymist Alchymist is defined as రసవాదము, బంగారు చేసే విద్య.
501. Alcohol Alcohol is defined as (Spirit),మద్యసారము,మద్యములోనిసారాంశము
502. Alcoran Alcoran is defined as కురాను, తురకవేదము.
503. Alcove Alcove is defined as శృంగార మంటపము.
504. Aldebaran Aldebaran is defined as (Tauri)రోహిణిistheconstellationoffivestars,calledయోగతార
505. Alder Alder is defined as వృక్షవిశేషము.
506. Alderman Alderman is defined as పెద్దశెట్టి, వీండ్లకు సీమలో ఒక తరహా magistrate అధికారము కద్దు.
507. Ale Ale is defined as ఒకతరహా బీరుసారాయి.
508. Alehouse Alehouse is defined as కల్లంగడి.
509. Alembic Alembic is defined as బట్టి.
510. Alert Alert is defined as జాగరూకతగల, చురుకుగల. I wish you would be more * నీవుపరాకుగా వుండ రాదు. he was not on the * వాడు అజాగ్రతగా వుండినాడు, వాడుయేమరి వుండినాడు.
511. Alertly Alertly is defined as అజాగ్రతగా, చురుకుగా.
512. Alertness Alertness is defined as జాగ్రత,చురుకు
513. Aleternately Aleternately is defined as add, He read Tamil and Telugu * అరవముతెలుగు వొకటి మార్చి వొకటి చదివినాడు.
514. Alewife Alewife is defined as కల్లు అమ్మేటిది.
515. Alexander Alexander is defined as అలెగ్జాండ రనే రాజు.
516. Alexandrine Alexandrine is defined as ఛందస్సులో నిండా నిడివిగా వుండే ఒక తరహా చరణము.
517. Algebra Algebra is defined as బీజగణితము.
518. Algebraical letters Algebraical letters is defined as బీజగణితాక్షరములు.
519. Algebraist Algebraist is defined as బీజగణితజ్ఞుడు.
520. Alias Alias is defined as అధవా, కాకుంటే. his name is Ramaya * Rangaya వాడికి రామయ్యఅనిన్ని, లేక, రంగయ అనిన్ని పేర్లు గలవు.
521. Alibi Alibi is defined as మరివకచోట వుండడము, స్థలాంతరమందు వుండడము. he proved an *ఆపని జరిగినప్పుడు తాను స్థలాంతరమందు వున్నట్టు రుజువు చేసినాడు.
522. Alien Alien is defined as పరుడు, అన్యుడు.
523. Alienable Alienable is defined as పరాధీనము చేయతగ్గ, దానాదివినిమయములకు అర్హమైన. theselands are not * యీ నేలకు దానాదివినిమయములకు యోగ్యమైనవి కావు.
524. Alienated Alienated is defined as తిప్పబడ్డ, పరాధీనమైన. the money was * ఆ రూకలుపరాధీనమైనవి. his affections were * వాడి మనస్సు విరిగింది, వాడి దయ తప్పింది.
525. Alienation Alienation is defined as పరాధీనము, మనస్సు విరగడము. * of mind చిత్తభ్రమ, బుద్ధివైకల్యము. on account of the * of the money ఆ రూకలు పరాధీనమైనందున.
526. Alight Alight is defined as రగులుతూ, మండుతూ. the fire is still * ఆ నిప్పు యింకా రగులుతూవుంది. the candles are * దీపాలు మండుతూ వున్నవి.
527. Alike Alike is defined as సరిగ్గా మండుతూ వున్నవి.
528. Aliment Aliment is defined as ఆహారము.
529. Alimental Alimental is defined as ఆహారమును గురించిన.
530. Alimentary Alimentary is defined as ఖాద్యసంబంధీయమైన. any * matter ఆహారము. the * canal,meaning, the bowels, n. s. పేగులు, ఆంత్రములు, కడుపు.
531. Alimirah Alimirah is defined as అల్మారా. See Press or Cabinet the word is Portugueze ).
532. Alimony Alimony is defined as మొగుణ్ని విడిచి నిర్దోషురాలుగా వుండే భార్యకు పెట్టిన జీవనాంశము.
533. Aliquot part Aliquot part is defined as మిగలక సరిపాలు పొయ్యే అంశము, అనగా .1 కి 16 4-4-16 సరిపాలుపొయ్యే అంశము.
534. Alive Alive is defined as జీవముతో వుండే. he caught it * దాన్ని ప్రాణముతో పట్టుకొన్నాడు.would any man * have believed it దీన్ని ఒక ప్రాణి నమ్మునా. the cloth isall * with fleas ఆ గుడ్డ పేనులతో నిండి వున్నది. I am perfectly * to what youintend నీవు చేసే యత్నానికి నేను సిద్ధముగా వున్నాను. he is not * to the folly ofhis conduct వాడు చేసిన పిచ్చితనము వాడికి బాగా తెలియలేదు. he is not * to hisown interests తన మేలును గురించి తాను జాగ్రత లేకుండా వున్నాడు. All the townis * about this feast యీ వుత్సవాన్ని గురించి వూరంతా దడవిడలుగా వున్నది,వుత్సాహముగా వున్నది.
535. Alkalescent Alkalescent is defined as క్షారసంబంధమైన.
536. Alkali Alkali is defined as కారము, క్షారము, సౌవర్చ లవణము.
537. Alkaline Alkaline is defined as క్షారసంబంధమైన.
538. All All is defined as అంతా, అన్ని, యావత్తు, సర్వమై, సమస్తమైన. * and sundry పిన్నాపెద్దా.By * means అన్ని విధాల. with * his wit వాడింత తెలిసినవాడైయుండిన్ని. heis lord of * ఆయనే సర్వేశ్వరుడు. * night రాత్రి అంతా. * yesterday నిన్నటిదినమంతా. One and all అందరున్ను. after * మెట్టుకు, తుదకు. at * యెంతమాత్రము. * I pray for is this నేను వేడుకొనేదంతా యిదే. this is * I know నాకుతెలిసినది యింతే, యింతకు మించి నేను యెరగను. I am wet * over నేను శుద్ధముగాతడిసినాను, బొత్తిగా తడిసినాను. * through the country దేశములోనంతా. he was *in * in all to her ఆమెకు కొడుకే ప్రపంచము అతిముఖ్యము. * at once I sawhim coming యింతలో అతడు రావడము చూస్తిని. he was crawling on * foursదోగాడుతూ వుండినాడు. to gamble at * fours ఒకతరహా జూదమాడుట. they losttheir * వారి యావత్తు సొత్తున్ను పోయినది. he left his * to us వాడి యావత్తుసొత్తున్ను మాకిచ్చినాడు. In * there were two hundred men వుండినదంతాయిన్నూరుమంది * hail ! శుభము శుభము.
539. Allayed Allayed is defined as ఉపశమించిన, మట్టుపడ్డ, అణిగిన.
540. Allegation Allegation is defined as రూఢముగా చెప్పిన మాట, స్థిరముగా చెప్పిన మాట. or excuseసాకు, బహానా, పరిహారము.
541. Alleged Alleged is defined as చెప్పిన, అన్న. the letter he is * to have sent అతడుపంపినానన్న జాబు. he is * to have consented అతను వొప్పినాడట.
542. Allegiance Allegiance is defined as ఆజ్ఞాధారకత్వము. I charged him on his * to follow me నీవునాతో కూడా రాకుంటే నీకు రాజు మీద ఆన వున్న దన్నాను. She broke her * to herhusband మొగుడి ఆజ్ఞను తోసివేసింది.
543. Allegorical Allegorical is defined as రూపకముగా వుండే.
544. Allegorically Allegorically is defined as రూపకముగా వుండే.
545. Allegory Allegory is defined as రూపకాలంకారము.
546. Allegro Allegro is defined as ఒకతరహా దరువు, దృతవాద్యము.
547. Allelujah Allelujah is defined as కొన్ని కీర్తనలలో ప్రయోగించే పదము, మంగళము, జయజయదేవఅన్నట్టు.
548. Alleviation Alleviation is defined as ఉపశమనము, ఉపశాంతి.
549. Alley Alley is defined as సందు. A blind * ముట్టుసందు. * at marbles పెద్ద గోలిగుండు.
550. Alliance Alliance is defined as సంబంధము, చుట్టరికము. * by marriage వియ్యము. * with aforeign king విహితము, వొద్దిక.
551. Allied Allied is defined as సంబంధము చేసిన, కలుసుకొన్న, కూడుకొన్న. the * kings ఒకటిగాకూడుకొన్న రాజులు ఒకరి కొకరు సహాయముగా వుండే రాజులు. See To Ally.
552. Allies Allies is defined as విహితులు, అనుకూలులు, సహాయులు.
553. Alligation Alligation is defined as గణితశాస్త్రములో వక సూత్రనామము.
554. Alligator Alligator is defined as మొసలి, మకరి.
555. Alliteration Alliteration is defined as ప్రతి శబ్దమునకు మొదట వచ్చిన అక్షరమే రావడము. as Bewareof the Bear of Bradwardine.
556. Allknowing Allknowing is defined as సర్వము యెరిగిన, సమస్తము తెలిసిన
557. Alllusive Alllusive is defined as సూచకమైన.
558. Allodium Allodium is defined as స్వతంత్రము, మిరాశి.
559. Alloted Alloted is defined as విధించిన, నిర్ణయించిన, నిశ్చయించిన.
560. Allotment Allotment is defined as s నిర్ణయము, విధి, భాగము, విభాగము.
561. Allowable Allowable is defined as ఒప్పుకోతగిన, అంగీకరించ తగిన, న్యాయమైన. his joy at thiswas very * యిందున గురించి వాడు సంతోషపడవలసినది సహజమే న్యాయమే.
562. Allowably Allowably is defined as సహజముగా, తగినట్టుగా.
563. Allowance Allowance is defined as admission అంగీకారము. or deduction తోసియివ్వడము. youmust make allowances for his youth పసివాడని మన్నించ వలసినది. In thisbargain he made me an * of ten rupees యీ బేరములో నాకు పది రూపాయలుతోసి యిచ్చినాడు. pension భరణము, బత్తెము, వర్తన, గ్రాసము. the beggarsreceived their * బిచ్చగాండ్లు తమ వర్తనను తీసుకొన్నారు. these men are on full *the others are on short * వీండ్లకు నిండు బత్తెము దొరుకుతున్నది కడమవాండ్లకుఅర్ధగ్రాసము దొరుకుతున్నది. the government give him even horse *గవర ్మంటువారు అతనికి గుర్రపు శెలవులు సహితము యిప్పిస్తున్నారు.
564. Alloy Alloy is defined as వెండి బంగారు వీటిలో కలిపే రాగి, సీసము మొదలైనవి. happinesswithout * నిష్కల్మషమైన సుఖము.
565. Alloyed Alloyed is defined as కలపడమైనడ, మట్టమైన, వన్నెతక్కువైన. * gold మట్టబంగారు. *silver కందువేండి. unalloyed gold అపరంజి. unalloyed silver చొక్కమైనవెండి.
566. Allsouls Allsouls is defined as ఒక పండుగ.
567. Allspice Allspice is defined as మిరియము వంటి వక తరహా సంభార ద్రవ్యము.
568. Allurement Allurement is defined as తీపి, సరసత, ఆకర్షకము, ఆశకొలిపేటిది, వ్యామోహజనకమైనది. shehad many allurements దానియందు అనేక సరసతలు వుండినవి. she used manyallurements to him in vain వాడి దగ్గెర దాని తసుకులు పనికి రాలేదు.
569. Alluring Alluring is defined as ఆకర్షకమైన, మనోహరమైన, మనోజ్ఞమైన, మరులుకొలిపే,మోహజనకమైన.
570. Alluringly Alluringly is defined as ఆకర్షకరముగా, మనోహరముగా, మోహజనకముగా.
571. Allusion Allusion is defined as గురించినది, సూచన, జాడ. In our conversation he made no *to the marriage మా సంభాషణలో ఆ పెండ్లి యొక్క సూచనను వాడు యెత్తలేదు.
572. Allusively Allusively is defined as సూచనగా.
573. Alluvial Alluvial is defined as ప్రవాహమువల్ల కలిగిన. * soil వొండు.
574. Alluvium Alluvium is defined as వొండు.
575. Ally Ally is defined as సహాయుడు, సంబంధుడు they were allied వాండ్లు కలుసుకొని వుండిరి.the allies కలుసుకొని వుండేవాండ్లు.
576. Almanack Almanack is defined as పంచాంగము.
577. Almighty Almighty is defined as సర్వశక్తుడైన. the * or God * or * God సర్వశక్తుడు, దేవుడు.
578. Almond Almond is defined as బాదాము, బాదాముపప్పు * tree బాదామిచెట్టు. a cake made withalmonds బాదాముపప్పు వేసి చేసిన ఫలహారము.
579. Almonds Almonds is defined as of the throat గవదకాయలు, యివి జలుబుచేస్తే వుబ్బుతవి.
580. Almoner Almoner is defined as రాజధర్మమును విచారించే వుద్యోగస్థుడు.
581. Almost Almost is defined as కొంచెము, తక్కువ, దరీదగ్గెతర, దరీదాపుగా. * one month కొంచె ముతక్కువ ఒక నెల. he is * dead కొన ప్రాణముతో వున్నాడు, మృతప్రాయుడై వున్నాడు. *half అరవాసి. It is * finished ముగియవచ్చినది. a fruit which is * ripeదోరపండు. he is an * Christian వాణ్ని ఖ్రీష్టియ ్వాడనవచ్చును.
582. Alms Alms is defined as భిక్షము, ధర్మము, తిరిపెము. he subsisted on * ముష్టి యెత్తుకొనిజీవించినాడు. * box వుండి, * deed ధర్మము.
583. Almshouse Almshouse is defined as సత్రము, ధర్మశాల, గంజిదొడ్డి.
584. Almug Almug is defined as టేకుచెట్టువంటి ఒక వృక్ష విశేషము.
585. Aloe Aloe is defined as the plant కలబంద. the hedge * plant బ్రహ్మరాకాసిచెట్టు,చాగనారచెట్టు.
586. Aloes Aloes is defined as the drug మూసాంబరము. a precious wood అగరుచెక్క.(గంధరసము SNT).
587. Aloft Aloft is defined as పైన, పైగా, పొడుగున. from * పైననుంచి.
588. Alone Alone is defined as ఒంటిగా, ఏకాంతముగా. leave it * అది వుండేటట్టు వుండనీ, దానిజోలికి పోక. let me * నా జోలికి రావద్దు, నన్నంటవద్దు. or only మాత్రమే. we * didthis మేము మాత్రమే చేస్తిమి. I know this * యిది మాత్రమే నాకు తెలుసునుయింతకు మించి నేనే యెరగను.
589. Along Along is defined as వెంట, వెంబడిగా. he went * the shore తీరము వెంబడిగా పోయినాడు.come * రా, నడువు, కూడారా. go * పో, నడువు. * with him అతనితో కూడా పోతిని,వెంటపోతిని. all * I knew this would happen యిది యిట్లాజరుగపోతుందని నాకుమొదటినుంచి తెలుసును. * side పక్కన, వాడపక్కన, యిది వాడ భాష.
590. Aloof Aloof is defined as దూరాన, తొలిగి, వొదిగి. they stood * తొలిగివుండిరి, దూరముగావుండిరి.
591. Aloud Aloud is defined as బిగ్గర, ఘట్టిగా.
592. Alpha Alpha is defined as గ్రీక్కుభాషలో అకారము. Omega దీర్ఘఓత్వము, యిది గ్రీక్కుజీవాక్షరములలో కొన అక్షరము.
593. Alphabet Alphabet is defined as వర్ణమాల, అక్షరసమామ్నాయము. An * of logic తర్కసంగ్రహము.తర్కముయొక్క ప్రారంభము. An * of electricity సంఘర్షణ జాగ్నిశాస్త్ర సంగ్రహముఆరంభము, శాస్త్ర ప్రారంభము. He scarcely knows the * of lawధర్మశాస్త్రసంగ్రహము సహితం వాడికి తెలియదు, ధర్మశాస్త్రము యెట్టిదో వాడికి తెలియదు.
594. Alphabetical Alphabetical is defined as అక్షరక్రమమైన.
595. Alphabetically Alphabetically is defined as అక్షరక్రమముగా.
596. Alpine Alpine is defined as కొండలమీది. * country కొండలమీది దేశము. in the * regions ofIndia పర్వత ప్రదేశమునందు.
597. Alps Alps is defined as మహత్తైన పర్వతము. the * of India హిమవత్పర్వతము.
598. Already Already is defined as అప్పుడే, మునుపే, పూర్వమే. In the year * mentioned పైనచెప్పిన సంవత్సరములో. I have * told you నీతో మునుపే చేప్పియున్నాను.
599. Also Also is defined as కూడా, సహితము, మరిన్నీ, యిదిగాక. this * యిదిన్ని. I * నేనున్ను. hecame here * యిక్కడికిన్ని వచ్చినాడు, వాడున్ను వచ్చినాడు.
600. Altar Altar is defined as బలిపీఠము, హోమగుండము.
601. Alteration Alteration is defined as మారడము, వ్యత్యాసము, భేదము, వికారము, దిద్దుబాటు, సవరింపు.what * shall I make నేనేమి దిద్దేది.
602. Alterative Alterative is defined as భేదిమందు.
603. Altercation Altercation is defined as వాగ్వాడము, వివాడము, ఘర్షణ, జగడము.
604. Altered Altered is defined as మారుపడ్డ, వ్యత్యాసపడ్డ, వికారమైన. the house is now quite *దినము విడిచి దినము. these were * streaks of black and red ఒక పట్టెనలుపుఒక పట్టెయెరుపుగా వుండినవి.
605. Alternately Alternately is defined as ఒకటి విడిచి ఒకటిగా, ఒకటి మార్చి ఒకటిగా.
606. Alternation Alternation is defined as ఒకటి విడిచి వొకటి. on account of the * of the crops ofsambha and karoo సంభాకు తరవాత కారు, కారుకు తరవాత సంభా యిట్లా క్రమముగాపండడము వల్ల.
607. Alternative Alternative is defined as గత్యంతరము, వేరేగతి. I have no * నాకు వేరే విధి లేదు. heoffered me an * యిది వద్దంటే వేరే దారి చూస్తానన్నాడు. each * is painful యెటుచేసినా ఉపద్రవమే.
608. Although Although is defined as అయినప్పటికిన్ని. * he went వాడు పోయినప్పటికిన్ని. althoughhe did not go పోకపోయినప్పటికిన్ని.
609. Altitude Altitude is defined as ఔన్నత్యము, ఉచ్ఛత్వము.
610. Altogether Altogether is defined as బొత్తిగా,శుద్ధముగా,యెంత మాత్రము, మెట్టుకు. * this will doమెట్టుకు యిది సరిపడును. * it is ten rupees అంతా యేకానికి పదిరూపాలు. this is *wrong యిది అన్నివిధాల తప్పు.
611. Alum Alum is defined as పటికారము.
612. Alvine Alvine is defined as కడుపు సంబంధమైన. * excretion పురీషము.
613. Always Always is defined as యేవేళ, యెప్పటికిన్ని, యెల్లప్పుడు, నిరంతరము. he * laughs atthis యిందున గురించి యేవేళా నవ్వుతాడు.
614. Am Am is defined as వున్నాను, I * to gothere tomorrow రేపు నేను అక్కడికి పోవలేనని వున్నాను.
615. Amagram Amagram is defined as ఒక శబ్దములో వుండే అక్షరములను వెనక ముందుగా వుండడముచేతపుట్టే మరి ఒక శబ్దము అనగా. our big hen అనే శబ్దములో వుండే అక్షరములను వెనకముందుగా పెట్టితే. Neighbour అనే మాట పుట్టుతుంది.
616. Amain Amain is defined as బలముకొద్ది, బలముగా, వడిగా. he roared * బలముకొద్ది అరిచినాడు.the water rushed * నీళ్ళు వడిగా చొరబడ్డది.
617. Amalgam Amalgam is defined as ( a compound of two or more metals, of which one isalways mercury ) రసమిశ్రితమైన లోహము.
618. Amalgamation Amalgamation is defined as మిశ్రమము చేయడము, లోహములను రసముతో మిశ్రమముచేయడము. from the * of these two battalions యా రెండు పటాళములు ఒకటిగాకలసిపోవడము వల్ల.
619. Amanuensis Amanuensis is defined as ఒకడు చెప్పుతూ వచ్చేదాన్ని విని వ్రాసుకుంటూ వచ్చేవాడు. Beingunwell I employ my wife as an * in writing this letter నాకు అశక్తముగావున్నందున యీ జాబును నేను చెప్పుతూ వస్తిని నాభార్య వ్రాస్తూ వచ్చినది.
620. Amaranth Amaranth is defined as వాడని పుష్పము, చెంగలువ.
621. Amaranthine Amaranthine is defined as వాడని.
622. Amassed Amassed is defined as కూడబెట్టిన.
623. Amateur Amateur is defined as అభిలాషి " ఆసక్తిగలవాడు, బులుపుగలవాడు, అనగా జీవనము నిమిత్తముకాకుండా వేడుకార్థమైన చిత్రము సంగీతము మొదలైన వాటిని ఆసక్తిగా చేసేవాడు. he isan * painter వేడుకార్థముగా చిత్రము వ్రాసేవాడు.
624. Amatory Amatory is defined as మోహసంబంధమైన, శృంగారమైన. an * poem శృంగార కావ్యము.
625. Amazed Amazed is defined as ఆశ్చర్యపడి.
626. Amazedly Amazedly is defined as ఆశ్చర్యము, అద్భుతము.
627. Amazement Amazement is defined as add, 1 Pet. III. 6. శంక A+.
628. Amazing Amazing is defined as ఆశ్చర్యమైన, అద్భుతమైన.
629. Amazingly Amazingly is defined as ఆశ్చర్యముగా, అద్భుతముగా.
630. Amazon Amazon is defined as యుద్ధము చేసే శూరత్వము గల స్త్రీ.
631. Ambassadress Ambassadress is defined as రాయబారి యొక్క భార్య, దూతిక.
632. Ambassodor Ambassodor is defined as రాయబారి, స్థానాపతి.
633. Amber Amber is defined as ఒకతరహా పసుపు వర్నముగల రాయి. * coloured పసుపువర్నముగల.
634. Ambergris Ambergris is defined as అంబరు అనే పరిమళ ద్రవ్యము.
635. Ambidextrous Ambidextrous is defined as చమత్కారమైన.
636. Ambient Ambient is defined as చుట్టుకొన్న, నాలుగుతట్లా వ్యాప్తమైన.
637. Ambiguity Ambiguity is defined as అర్థసందిగ్దత, సందేహము.
638. Ambiguous Ambiguous is defined as సందిగ్ధమైన, ద్వ్యర్ధిగావుండే. his language is * వాడి మాటరేంటాపడును, వాడిమాట పిండికీ పడును, పిడుగుకూ పడును, యిటూ కాదు అటూ కాదు.
639. Ambiguously Ambiguously is defined as సందిగ్ధముగా, ద్వ్యర్థిగా.
640. Ambiguousness Ambiguousness is defined as సందిగ్ధత, ద్వ్యర్థి. without స్పష్టముగా, తేటగా.
641. Ambition Ambition is defined as ఆశ, అత్యాశ, అదనాశ, గొప్పతనము కావలెననే ఆశ, అహమహమిక.
642. Ambitious Ambitious is defined as ఆశగల, అత్యాశ గల, అదనాశగల, గొప్పతనము కావలెననే ఆశగల. heis * of this employment యీ వుద్యోగము కావలెనని ఆశపడుతాడు. an * manగొప్పపడవలెననే ఆశగలవాడు, అదనాశగలవాడు.
643. Ambitiously Ambitiously is defined as ఆశగా, అత్యాశగా, గొప్పతనము కావలె ననే ఆశగా.
644. Ambitiousness Ambitiousness is defined as ఆశ, అత్యాశ, గొప్పతనము కావలెననే ఆశ.
645. Ambrosia Ambrosia is defined as అమృతము, దేవతల యొక్క ఆహారము.
646. Ambrosial Ambrosial is defined as అమృతమయమైన, దివ్యపరిమళముగల.
647. Ambulatory Ambulatory is defined as నడిచే, ఒలాతే.
648. Ambuscade Ambuscade is defined as మాటు, పొంచు వేసుకొని వుండే స్థలము. the cat lies inambush for the mouse యెలుకకై పిల్లి పొంచు వేసుకొని వున్నది, వొడువేసుకొనివున్నది. Ameer, n. s. అధికారి, యిది తురక శబ్దము.
649. Amelioration Amelioration is defined as గుణము, ఉపశాంతి.
650. Amen Amen is defined as తథాస్తు, యిట్లా అవుగాక, ప్రార్థన, ముగియగానే ఆమే ్ అని అంటారు.
651. Amenable Amenable is defined as ఉత్తరవాదియైన, లోబడ్డ, అధికారమునకు లోబడ్డ. they are not * tohis authority వాండ్లు అతని అధికారానికి లోబడ్డ వాండ్లు కారు.
652. Amendment Amendment is defined as దిద్దిబాటు, గుణము, ఆరోగ్యము, సన్మార్గము. he made fouramendments in that paper ఆ దస్తావేజులో నాలుగుచోట్ల దిద్దినాడు. I see no * inhis health వాడికి వొళ్ళు యేమిన్ని గుణము కానము. his instruction producedsome * among them వాడి శిక్ష చేత వాండ్లు కొంచెము సన్మార్గమునకు వచ్చిరి.
653. Amends Amends is defined as చెల్లు యీడు, బదులు సంభవించిన నష్టమునకు పరిహారముగా చేసినఉపకారము. an apology makes * for a fault తప్పుకు అపరాధక్షాపణపరిహారమౌతున్నది. I will make you * for the loss you suffered నీవుపడ్డనష్టానికి నీకు యీడు చేస్తాను.
654. Amenity Amenity is defined as సరసత, సద్భావము, రమణియ్యత. * of disposition సద్భావము.
655. Amercement Amercement is defined as శిక్ష, దండన, అపరాధము.
656. America America is defined as అమిరికా అనే ఖండము, దేశము.
657. American American is defined as అమిరికా దేశస్థుడు.
658. Amethyst Amethyst is defined as ఒకతరహా రత్నము the oriental * ఒకతరహా కురువిందరాయి. theOccidental or common * ఒకతరహా స్ఫటికము. Oriental Topaz, emerald, andamethyst are only varieties of Sapphire, ( Penny Cyclop. )
659. Amiability Amiability is defined as మంచితనము, సరసత.
660. Amiable Amiable is defined as సరసమైన, మనోహరమైన. She has an * disposition దాని మనసుమంచిది. he is an * person అతడు మంచివాడు, సరసుడు.
661. Amiableness Amiableness is defined as మంచితనము, సరసత.
662. Amiably Amiably is defined as మంచితనముగా, సరసముగా.
663. Amicable Amicable is defined as విహితమైన, అనుకూలమైన, సమాధానమైన . an * agreementరాజీనామా.
664. Amicably Amicably is defined as విహితముగా, అనుకూలముగా, సమాధానముగా.
665. Amid, Amidat Amid, Amidat is defined as మధ్య, నడమ. amidst the trees చెట్లనడమ. amidst thisconfusion యింత గందరగూళములో.
666. Amiss Amiss is defined as తప్పుగా. he took this * యిందుకు అసహ్యపడ్డాడు. I took hiswords * వాడి మాటలకు తప్పు అర్థము చేసినాను. Is anything * with you ? నీకుయేమి తొందరగా వున్నది.It is not * అది తప్పుకాదు. It will not be * to tell himఅతనితో చెప్పితే యేమి, అనగా అతనితో చెప్పితే దోషము లేదు.
667. Amity Amity is defined as స్నేహము, విహితము.
668. Ammonia Ammonia is defined as మూత్రలవణము
669. Ammoniac Ammoniac is defined as ఒకతరహా బంక, ఒకతరహా వుప్పు, దీన్ని నవాచారము అంటారు.
670. Ammoniacal Ammoniacal is defined as అమోనియా సంబంధమైన.
671. Ammunition Ammunition is defined as ముందుగుండు మొదలైన యుద్ధసామాను. or food ఆహారము.
672. Amnesty Amnesty is defined as అపరాధమును క్షమించడము, మన్నింపు.
673. Among, Amongst Among, Amongst is defined as లో, మధ్య, నడుమ. he divided the money * thenయీ రూకలను వాండ్లకు పంచిపెట్టినాడు. one * a hundred నూటికొకడు.
674. Amorous Amorous is defined as కాముకమైన, మోహము గల. the dove is very * పావురాయికికామమధికము.
675. Amorously Amorously is defined as కామముగా, మోహముగా.
676. Amorousness Amorousness is defined as కామము, మోహము.
677. Amount Amount is defined as మొత్తము, వెరశి, తేలినది.
678. Amour Amour is defined as సొగసుతనము. he carried on an * with her దానితో సొగసుతనాలుచేసినాడు.
679. Amphibious Amphibious is defined as మిట్టను నీళ్లను జీవించే, * creatures కప్ప, పాము, తాబేలు,మొసలి మొదలైనవి, భూమి మీదనున్ను నీళ్ళలో నున్ను వుభయత్ర వసించేటివి.
680. Amphisbaena Amphisbaena is defined as మొండిపురుగు.
681. Amphitheatre Amphitheatre is defined as నల్డిక్కులు అగుపడే వున్నత స్థానము. for fencing &c. సాముచేసే బయలు, రంగము.
682. Ample Ample is defined as విస్తారమైన, విశాలమైన.
683. Amplification Amplification is defined as పెంచి చెప్పడము, ఉత్పేక్ష, కొంచెమును గొప్పగా పరీక్షించడము.
684. Amplified Amplified is defined as విస్తరించిన, పెంచి చెప్పిన.
685. Amplitude Amplitude is defined as విస్తారము, విశాలము.
686. Amply Amply is defined as విస్తారముగా, నిండా, చాలా.
687. Amputation Amputation is defined as అంగఛేదనము.
688. Amulet Amulet is defined as తాయిత్తు, రక్ష.
689. Amusement Amusement is defined as వినోదము, వేడుక, ఉల్లాసము, అట్లాట, ప్రొద్దుబోక.
690. Amusive Amusive is defined as వినోదకరమైన, ఉల్లాసకరమైన, ప్రొద్దుబోకగా వుండే.
691. An An is defined as ఒక, * old man ఒకముసలివాడు. పాత యింగ్లీషులో, * you pleaseఅంటే, if you please అని అర్థము.
692. An Obstructive An Obstructive is defined as A stubborn useless wretch వట్టజడుడు,మూర్ఖుడు, శుంఠుడు.
693. Ana Ana is defined as (sixteenth part, of a rupee &c. ) అణ.
694. Anachronism Anachronism is defined as కాలవ్యత్యాసముగా చెప్పడము, ఒకకాలమందు నడిచిన దాన్ని మరిఒక కాలములో నడిచినట్టు కాలవ్యత్యాసముగా చెప్పడముగా చెప్పడము అనగా ద్వాపరయుగమందు వుండిన అర్జునుడు కలియుగమందు వుండిన టీపుసుల్తానుతో మాట్లాడినాడన్నట్టుకాల అసంగతనముగా చెప్పడము.
695. Anakim Anakim is defined as giants రాక్షసులలో ఒక కులము.
696. Analogical Analogical is defined as సంబంధమైన, సమానమైన, తుల్యమైన.
697. Analogically Analogically is defined as సంబంధమైన, సమానముగా, తుల్యముగా.
698. Analogous Analogous is defined as సంబంధమైన, సమానమైన, తుల్యమైన.
699. Analogy Analogy is defined as సంబంధము, సాదృశ్యము.
700. Analysis Analysis is defined as విభజన, పరిశీలన, విమర్శ. of a sentence పదచ్చేదము.
701. Analytical Analytical is defined as విభజించే, పరిశీలన చేసే.
702. Analytically Analytically is defined as విభజనగా, విడివిడిగా.
703. Ananas Ananas is defined as (pineapple) అనాసపండు.
704. Anarchy Anarchy is defined as అరాజకము, అనాయకము.
705. Anathema Anathema is defined as శాపము.
706. Anathematized Anathematized is defined as శపించబడ్డ, శాపగ్రస్తమైన.
707. Anatomical Anatomical is defined as అంగఛేద సంబంధమైన.
708. Anatomist Anatomist is defined as అంగఛేదము చేసి విమర్శించే వైద్యుడు.
709. Anatomy Anatomy is defined as అంగఛేదము చేసి ఆయా అంగవిన్యాసములను విమర్శించే విద్య.
710. Ancestor Ancestor is defined as కూటస్థుడు, పూర్వికుడు.
711. Ancestors Ancestors is defined as పెద్దలు, పూర్వీకులు, కూటస్థులు.
712. Ancestral Ancestral is defined as పూర్వికుల సంబంధమైన. he inherited the * estates వాడిపెద్దలాస్తి వాడికి వచ్చినది.
713. Ancestry Ancestry is defined as పెద్దలు, పూర్వీకులు, కూటస్థులు.
714. Anchor Anchor is defined as లంగరు. the beam of an * యీసకర్ర. he weighed * లంగరుయెత్తినాడు తీసినాడు. he cast * లంగరు వేసినాడు. the ship was at * ఆ వాడకులంగరువేశి ఉండినది. a sheet * పెద్ద లంగరు. metaphorically జీవాధారము.ప్రాణధారము. he is the sheet * of our hopes మాకు అతడే జీవాధారము. This isthe * of my hopes యిదే నా ప్రాణాధారము, పట్టు కొమ్మ.
715. Anchored Anchored is defined as లంగరువేసిన, లంగరుచేసిన.
716. Anchoret, Anchorite Anchoret, Anchorite is defined as వనవాసి, వానప్రస్థుడు, సన్యాసి.
717. Anchourage Anchourage is defined as వాడలు లంగరుచేసే ప్రదేశము, లంగరు వేయడానికై యిచ్చే వర్తన రూకలు.
718. Ancient Ancient is defined as పురాతనమైన, ప్రాచీనమైన, ముసిలి. * history పూర్వకాలపు కథ.
719. Anciently Anciently is defined as పూర్వకాలమందు.
720. And And is defined as మరిన్ని, న్ని, న్ను. he * I went there వాడున్ను నేనున్ను పోతిమి,వాడు నేను పోతిమి. more * more మరిమరీ. here * there అక్కడక్కడ. day *night రాత్రీపగలు. now * then అప్పుడప్పుడు. It fell down * broke పడిపగిలినది.he came * sat down వచ్చి కూర్చుండినాడు. Tell me * I will do it నాతోచెప్పినట్టైతే చేస్తాను. God is a spirit * they that worship him must worshiphim in spirit * in truth దేవుడు ఆత్మే అయినందున అతణ్ని పూజించే వాండ్లు ఆత్మలోసత్యముగా పూజించవలెను. * yet అయినా, అయినప్పటికిన్ని.
721. Andiron Andiron is defined as ఇంగ్లిషు యిరవపొయ్యికి ముందర నాటివుండే యినప కమ్ములు.
722. Androgynal Androgynal is defined as పురుషలింగము స్త్రీలింగమున్ను గలది. The idol లింగము,శివలింగము.
723. Andropogin, muriaticum Andropogin, muriaticum is defined as The roots called వట్టి వేళ్ళు.
724. Andropogon Andropogon is defined as కామంచికసువు.
725. Anecdote Anecdote is defined as పొడికధ, వృత్తాంతము, చరిత్ర.
726. Anemone Anemone is defined as ఒకతరహా పుష్పము.
727. Anent Anent is defined as గురించి.
728. Aneurism Aneurism is defined as నరమువుబ్బి నెత్తురు కట్టుకొనే కణితి మొదలైన రోగము.
729. Anew Anew is defined as కొత్తగా, తిరిగీ, మళ్లీ, పునః.
730. Angel Angel is defined as దేవదూత. a lovely woman or child అతిసుందరవతి, అందముగావుండే బిడ్డ. or coin అయిదు రూపాయల బంగారు నాణెము.
731. Angelle, Angellical Angelle, Angellical is defined as దివ్య or దివ్యమైన.
732. Anger Anger is defined as కోపము.
733. Angered Angered is defined as కోపించిన, రేచబడ్డ.
734. Angle Angle is defined as కోణము, మూల. having eight angles అష్టకోణములుగల.
735. Angler Angler is defined as గాలము వేసి చేపలు పట్టేవాడు.
736. Anglice Anglice is defined as ఇంగ్లిషు భాషలో. a curnam * a clerk కరణమనే మాటకు యింగ్లిషులోa clerk అని అంటారు.
737. Anglicism Anglicism is defined as ఇంగ్లిషు భాషియ్యము, ఇంగ్లిషు జాతియ్యము.
738. Anglicized Anglicized is defined as ఇంగ్లిషుభాష మర్యాదగా చేసిన.
739. Anglo-Indians Anglo-Indians is defined as పరంగివాండ్లు, చటకారివాండ్లు.
740. Anglo-Saxons Anglo-Saxons is defined as వేయేండ్లకిందట ఇంగ్లిషుదేశములో వుండిన ఒక కులస్థులు.
741. Angrily Angrily is defined as కోపముగా.
742. Angry Angry is defined as కోపముగల, కోపముగావుండే. an * person కోపిష్టి. he was *కోపముగా వుండినాడు. an * ulcer మంటలుగా వుండే పుండు.
743. Anguish Anguish is defined as వేదన, ఆరాటము, పరితాపము. he was then in * వాడప్పుడు నిండాఆరాటపడుతూ వుండెను.
744. Angular Angular is defined as కోణములుగల, మూలలు గల.
745. Angularly Angularly is defined as కోణముగా, మూలగా.
746. Anights Anights is defined as రాత్రిళ్లు, రాత్రికాలములో.
747. Animadversion Animadversion is defined as ఆక్షేపణ, చీవాట్లు. they made no animadversions on hisletter అతని జాబుమీద యేమిన్ని ఆక్షేపణలు చేయలేదు. they made someanimadversions on his conduct వాడు చేసిన పనికి కొన్ని చీవాట్లు పెట్టినారు,దొబ్బులు పెట్టినారు.
748. Animal Animal is defined as జంతువు, ప్రాణి. by way of contempt పశువు, గొడ్డు.
749. Animalcules Animalcules is defined as కండ్లకు అగుపడని సన్నపురుగులు.
750. Animate Animate is defined as చేతనమైన, సజీవియైన, ప్రాణియైన. all things whether * orinanimate చేతనాచేతనములైన అన్ని వస్తువులు.
751. Animated Animated is defined as ప్రాణముగల, సజీవియైన, ప్రాత్సాహముగల, చురుకుగల, సరసమైన.that image looks as if it was * ఆ విగ్రహము సజీవిగా వున్నట్టు అగుపడుతున్నది.the child's face is * with joy ఆ బిడ్డ ముఖము సంతోషము చేత వికాసముగావున్నది. an * picture తద్రూపముగా వుండే పటము. or urged ప్రేరేపించబడ్డ. hewrote it in an * style సరసముగా వ్రాసినాడు, దివ్యముగా వ్రాసినాడు. there wasan * discussion మహత్తైన వివాదము జరిగినది.
752. Animating Animating is defined as ఉత్సాహకరమైన. * intelligence ఉత్సాహకరమైన సమాచారము. *prospects సంతోషకరమైన ఆశలు.
753. Animation Animation is defined as జీవము కలగచేయడము, ధైర్యము, ఉత్సాహము. suspended *మూర్చ. he spoke with great * మహావుత్సాహముగా మాట్లాడినాడు.
754. Animosity Animosity is defined as చలము, వైరము, పగ, ద్వేషము.
755. Anise Anise is defined as సొంపు.
756. Anker Anker is defined as పది గాలములు పట్టే పీపాయి.
757. Ankle Ankle is defined as చీలమండ. * rings అందెలు, మువ్వలు, గజ్జగొలుసు మొదలైనవి.
758. Anklet Anklet is defined as పాదభూషణము.
759. Anna Anna is defined as (name of the fraction one sixteenth) అణా. The Telugu nameis వీసము.
760. Annalist Annalist is defined as ఆయా సంవత్సరమందు నడిచిన చరిత్రను క్రమముగా వ్రాసేవాడు.
761. Annals Annals is defined as ఆ యా సంవత్సరమందు నడిచిన దాన్ని క్రమముగా వ్రాసిన చరిత్ర.
762. Annexed Annexed is defined as కూర్చిన, చేర్చిన, జంటించిన. in the * account యిందుతో కూడాచేర్చిన లెక్కలో.
763. Annihilated Annihilated is defined as నాశనమైపోయిన, పాడైపోయిన, నిర్మూలమైపోయిన, హతమైన.
764. Annihilation Annihilation is defined as నాశము, నిర్మూలము, పాడు, ధ్వంసము. but the true word isనిర్వాణము. q. v.
765. Anniversary Anniversary is defined as యాటా వచ్చే, ప్రతి సంవత్సరము వచ్చే.
766. Anno Domini Anno Domini is defined as ఖ్రీష్టుపుట్టిన సంవత్సరము. 1842 A. D. ఖ్రీష్టు పుట్టిన 1842 సం||
767. Annotation Annotation is defined as టీకా, వ్యాఖ్యానము.
768. Annotator Annotator is defined as వ్యాఖ్యాత, వ్యాఖ్యానకారుడు.
769. Annoyance Annoyance is defined as బాధ వేధ, ఉపద్రవము తొందర. he felt much * at theirknowing this యిది వాండ్లకు తెలిసినదని వాడు నిండా విచారపడ్డాడు.
770. Annoyed Annoyed is defined as చీదరపడ్డ, అసహ్యపడ్డ, తొందరపడ్డ, సంకటపడ్డ, హింసపడ్డ. I was * athim వాడిమీద నాకు అసహ్యము వచ్చినది.
771. Annoying Annoying is defined as యాటా వచ్చే, ప్రతి సంవత్సరమున్ను వచ్చే. the plantain is an *plant అరటిచెట్టు ఒక సంవత్సరములో పుట్టి పెరిగి నశించేటిది. he paid them an *visit సంవత్సరానికి ఒక మాటు వారి దర్శనానికి పోతూ వచ్చినాడు. an * feast యాటావచ్చే పండుగ, ఉత్సవము.
772. Annually Annually is defined as యాటా, ప్రతి సంవత్సరమున్ను.
773. Annuitant Annuitant is defined as వర్థాశనము తీసుకొనేవాడు.
774. Annuity Annuity is defined as వర్షాశనము.
775. Annular Annular is defined as వలయాకారముగా వుండే, గుండ్రముగా వుండే, యిది గ్రహణమునుగురించిన మాట. na * exlipse వలయగ్రహణము.
776. Annulled Annulled is defined as రద్దుచేయబడ్డ, కొట్టివేయబడ్డ, తోసివేయబడ్డ.
777. Annulling Annulling is defined as రద్దుచేయడము.
778. Annunciation Annunciation is defined as తెలియచేయడము, ప్రకటన.
779. Anodyne Anodyne is defined as ఉపశాంతి, ఉపశాంతియైన ఔషధము.
780. Anointing Anointing is defined as చరమడము, అంటడము, అభ్యంజనము, అభిషేకము.
781. Anomaious Anomaious is defined as వ్యతిరిక్తమైన, వ్యత్యయమైన, విపరీతమైన.
782. Anomaly Anomaly is defined as వ్యతిరిక్తము, వ్యత్యయము, విపరీతము.
783. Anon Anon is defined as తక్షణము, మరీ. I will come * యిదుగో వస్తిని.
784. Anonymous Anonymous is defined as పేరులేని అనామధేయమైన, వూరుపేరులేని.
785. Anonymously Anonymously is defined as పేరు లేకుండా, వూరుపేరు లేకుండా.
786. Another Another is defined as మరివొకడు, వేరే ఒకడు, మరి ఒకటి, యింకొకటి, వేరే ఒకటి. one with *సరాసరి, సగటున, సగటుమీద. * yet మరీ ఒకడు, మరీ ఒకడు, మరీ ఒకటి. they beatone * ఒకరిని ఒకరు కొట్టుకొన్నారు. one after * ఒకడొకడుగా, ఒకటొకటిగా. onegoes and * comes ఒకడుపోతే మరి వకడు వస్తాడు. I told him one thing and did* నేను ఒకటి చెప్పితే వాడు ఒకటి చేసినాడు.
787. Answer Answer is defined as ఉత్తరవు, జవాబు, ప్రత్యుత్తరము. Question and * ప్రశ్నోత్తరములు. in* ప్రత్యుత్తరముగా.
788. Answerable Answerable is defined as ఉత్తరవాదియైన, జవాబు చెప్పవలసిన. I will be * for itఅందుకు నేను ఉత్తరవాదిని. he laid out the money without any * advantage ఆరూకలను శెలవు చేసినాడు గాని దానికి తగిన ఫలము లేదు.
789. Answering Answering is defined as సరియైన, యీడైన, సమానమైన. In the year Vilambi * to1838 దో సంవత్సరమునకు సరియైన విళంబి సంవత్సరములో.
790. Ant Ant is defined as చీమ. black * నల్లచీమ. large black * గండుచీమ, కొండచీమ. red *యెర్ర చీమ. the fire * or tree * కొరివి చీమ. white ants చేదుళ్ళు. wingedwhite ants వుసుళ్ళు. the great white * చెదుళ్ళగూడు. the large destructivewhite * గొర్రెచెద, లేడిచెద. a white * hill పుట్ట. the red earth in a white *hill పుట్ట కూడు. a winged sort of * రెక్కచీమ. * lion చీమపులి. the spider *కట్టెచీమ.
791. Antagonism Antagonism is defined as వైరము, శత్రుత్వము.
792. Antagonist Antagonist is defined as వైరి, విరోధి, యెదిరి, శత్రువు. the * forces యెదిరిబలము.
793. Antagonistic Antagonistic is defined as యెదిరించిన, యెదటి. * power యెదటిబలము.
794. Antarctic Antarctic is defined as దక్షిణదిక్కు సంబంధమైన. the * pole దక్షిణధృవము.
795. Ante Ante is defined as పూర్వ,అగ్ర,యిదిలాటి్భాషలోఅవ్యయము
796. Antecedent Antecedent is defined as సర్వనామశబ్దము చేత పరామర్శించబడ్డ శబ్దము, అనగా, hebrought the books upon which I found my own mark యిందులోసర్వనామమైన. which అనే పదమునకు books అనేపదము antecedent అవుతున్నది.* to 1800 అన 1800 రో సంవత్సరమునకు పూర్వము * to his arrival వాడు చేరకమునుపు.
797. Antecedently Antecedently is defined as పూర్వము, ముందుగా.
798. Antechamber Antechamber is defined as ముందరిగది, మొదటిగది.
799. Antediluvan Antediluvan is defined as అనాదియైన, జలప్రళయమునకు పూర్వమైన. the antediluviansకృతయుగస్థులు. See on కలియుగము. an W. on Vish. p. Lxv.
800. Antelope Antelope is defined as జింక. the female goat * లేడి. the male * ఇర్రి. * eyedహరిణాక్షియైన.
801. Antemeridian Antemeridian is defined as మధ్యాహ్నత్పూర్వమైన.
802. Antennae Antennae is defined as పురుగుయొక్క కొమ్ములు, లేక, మీసాలు.
803. Antepenultimate Antepenultimate is defined as శబ్దాంతమందువుండే రెండు అక్షరములకు యివతలి అక్షరము,యేలాగంటే, dictionary అనే శబ్దములో A అనే అక్షరము.
804. Anterior Anterior is defined as ముందరి, పూర్వపు.