ad

1. ad Libitum ad Libitum is defined as కావలసినమట్టుకు, యథేచ్ఛగా.
2. Adage Adage is defined as వాడుకగా అనేమాట, సామిత. there is an * that "doctors differ "వైద్యులు తలా వక మాట అంటారనడము వాడుకగా అనే మాటేగదా.
3. Adagio Adagio is defined as in music విళంబితము.
4. Adam Adam is defined as అదిమపురుషుని నామము. the sons of * * నరులు.
5. Adamant Adamant is defined as వజ్రము, రవ, హీరము.
6. Adamantine Adamantine is defined as అతికఠినమైన. a man of * constitution వజ్రదేహి.
7. Adaptation Adaptation is defined as సరిపరచడము, పొసగించడము, పొందిక, యిమిడిక.
8. Adapted Adapted is defined as తగిన, ఉపయుక్తమైన, యోగ్యమైన. this is * to many purposesయిది బహు పనులకు వుపయుక్తమైనది.
9. Adder Adder is defined as కట్లపాము. Deaf * మంత్రానికి లోబడని కట్లపాము, మాట వినని మూఖు ్డు.
10. Addictedness Addictedness is defined as దురాశ, లోలత్వము.
11. Addition Addition is defined as కూర్చడము, చేర్చడము, వృద్ధి. In Arithmetic గుణకారము. he hadan * to his family yesterday నిన్న వాడికి బిడ్డ పుట్టింది. In * to his formerstatement వాడు మునుపు చెప్పినది కాకుండా.
12. Additional Additional is defined as అధికమైన, ఎక్కువైన. * expenses అధికవ్యయములు. * servantsఅధిక పనివాండ్లు.
13. Additional rules Additional rules is defined as ఉపనిబంధనలు
14. Addle Addle is defined as అవిసిపోయిన, నిస్సారమైన, కలవరమైన. an * egg అవిసిపోయిన గుడ్డు.an * pated or * headed fellow కలవరపు మనిషి, పిచ్చివాడు.
15. Addled Addled is defined as See Addle.
16. Address Address is defined as a petition మనివి, అర్జి. or speech ప్రసంగము, సంభాషణ.direction పై విలాసము. title వక్కణ, బిరుదావళి. skill నిపుణత. Mode ofbehaviour మర్యాద, రసము. a man of good * సరసముగా, లేక, ఘనముగామాట్లాడేవాడు. a man of mean * జబ్బురసముగా మాట్లాడేవాడు. he paid hisaddresses to her తన్ను పెండ్లి చేసుకొమ్మని దాన్ని ఉపసర్పించినాడు.
17. Adept Adept is defined as ప్రవీణుడు, నిపుణుడు, సమర్థుడు, జితపడ్డవాడు. he is an * inarithmetic లెక్కలో పూర్ణుడు.
18. Adequate Adequate is defined as తగిన, యోగ్యమైన, సరియైన.
19. Adequately Adequately is defined as తగినట్టుగా.
20. Adherence Adherence is defined as అంటుకొని వుండడము, అనువర్తనము. or fixedness పట్టు. Bythe * of the skin to the flesh తోలు మాంసమును అంటుకొని వుండడమువల్ల.this shews their * to the law యిందువల్ల ఆ చట్టము మీద వాండ్లకు వుండే పట్టుతెలుస్తుంది. his * to the truth saved him వాడు నిజమును అవలంబించడము వాణ్నికాపాడింది.
21. Adherent Adherent is defined as అనుసరించినవాడు, అవలంబించినవాడు, ఆశ్రితుడు. he and hisadherents వాడున్ను వాడితో చేరిన వాండ్లున్ను.
22. Adhering Adhering is defined as అంట్లుకొన్న, చేరిన, అనుసరించిన, ఆశ్రయించిన.
23. Adhesion Adhesion is defined as అంటుకోవడము, కరుచుకోవడము, బంధన the water destroyedthe * of the gum నీళ్ళచేత ఆ బంక యొక్క బంధన పోయినది.
24. Adhesive Adhesive is defined as అంటుకొనే, కర్చుకొనే బంధనగల. * plaister కర్చుకొని వుండేప్లాస్తిరి. glue is * వజ్రము బంధన గలది, కర్చుకొనేటిది.
25. Adieu Adieu is defined as దండము, దీవన, సలాము, ఒకరిని ఒకరు యెడబాసేటప్పుడు శెలవు తీసుకొనిపొయ్యేవాడు, శెలవు యిచ్చి పంపించేవాడు యిద్దరున్ను చెప్పేమాట. he bade them *శెలవు పుచ్చుకొన్నాడు, శెలవు యిచ్చి పంపినాడు, పోయి వస్తా నన్నాడు, పోయిరాఅన్నాడు. I bade * to these hopes నేను యీ ఆశను విడిచిపెట్టినాను. he bade * tothe world సన్యసించినాడు. the same as good bye or farewell అనే మాటలకుసమానము. he uttered his last * చచ్చినాడు.
26. Adjacency Adjacency is defined as సమీపత్వము.
27. Adjacent Adjacent is defined as సమీపమైన, దగ్గిరి.
28. Adjective Adjective is defined as విశేషణము.
29. Adjoining Adjoining is defined as చేరికగావుండే. In the * house పొరుగింటిలో, పక్క యింటిలో.
30. Adjournment Adjournment is defined as మరిఒకవేళ జరిగిస్తామని తత్కాలానికి నిలిపిపెట్టడము.
31. Adjudication Adjudication is defined as తీర్పు చేయడము, తీర్పు యివ్వడము, విధించడము.
32. Adjunct Adjunct is defined as సంయోగించివుండేటిది, చేరివుండేటిది.
33. Adjuration Adjuration is defined as ఒట్టుపెట్టడము, అనబెట్టడము, ఒట్టు, ఆన.
34. Adjusted Adjusted is defined as దిద్దిన, సవరించిన, క్రమపరచిన.
35. Adjustment Adjustment is defined as దిద్దుబాటు, సవరింపు.
36. Adjutancy Adjutancy is defined as అజిట ్ వుద్యోగము .
37. Adjutant Adjutant is defined as దండులో అజిటననే వొక దొర. A sort of Crane బెగ్గురు అనే పెద్దకొంగ.
38. Admeasurement Admeasurement is defined as కొలత.
39. Administration Administration is defined as జరిగించడము, చెల్లించడము, విచారణ. * of governmentప్రభుత్వమును జరిగించడము. During his * అతని మంత్రిత్వములో. * of justiceన్యాయ విచారణ. Letter or power of * చచ్చినవాని ఆస్తిని గురించి న్యాయసభవారిద్వారా వచ్చిన అధికార పత్రిక.
40. Administrator Administrator is defined as చచ్చినవారి ఆస్తిని గురించి న్యాయసభలో అధికారముతీసుకొన్నవాడు, విచారణకర్త.
41. Administratorship Administratorship is defined as చచ్చినవారి ఆస్తిని గురించి న్యాయసభలో తీసుకొన్నఅధికారము.
42. Administratrix Administratrix is defined as చచ్చిన వారి ఆస్తిని గురించి న్యాయసభలో అధికారమునుతీసుకొన్న స్త్రీ.
43. Admirable Admirable is defined as అద్భుతమైన, ఘనమైన, ఉత్తమమైన.
44. Admirably Admirably is defined as అద్భుతముగా, దివ్యముగా, ఘనముగా.
45. Admiral Admiral is defined as యుద్ధవాడలకు అధిపతి. * of the Red, * of the White, * of theBlue, Rear * యీనాలుగున్ను ధ్వజపటము యొక్క వర ్ భేదము చేత కలిగినఆధిపత్యము యొక్క భేదములు.
46. Admiralty Admiralty is defined as వాడలో జరిగే కొట్టుతిట్లు మొదలయ్ని వ్యాజ్యములు తీర్చే న్యాయసభ.
47. Admiration Admiration is defined as అద్భుతము, ఆశ్చర్యము.
48. Admirer Admirer is defined as మెచ్చుకొనేవాడు. he is an * of hers దాన్ని మోహించినవాడు.
49. Admiringly Admiringly is defined as ఆశ్చర్యపడి, మోహించి.
50. Admissibility Admissibility is defined as అంగీకారయోగ్యత. he proved the * of these accountsయీ లెక్కల యొక్క అంగీకారతను రుజువు చేసినాడు.
51. Admissible Admissible is defined as అంగీకరించ యోగ్యమైన.
52. Admission Admission is defined as ప్రవేశము, చేర్చుకోవడము, లోనికి రానివ్వడము, లోనికి రావడానకుశెలవు. After his * into the school వాడు పల్లెకూటములో ప్రవేశించిన తరువాత.Before the * of the water నీళ్లు లోగా రాకమునుపే, చొరడానకు మునుపే, hecould not gain * లోగా ప్రవేశించడానకు వాడికి అవకాశము చిక్కలేదు శెలవు చిక్కలేదు.the water gained * through the roof యింటి కప్పుగుండా నీళ్ళు దిగినది,వురిసినది. they refused him * వాణ్నిలోనికి రానివ్వమన్నారు, చేర్చుకోమన్నారు. orconfession ఒప్పుకోవడము, అంగీకారము. On his * of these charges వాడు యీతప్పులను వొప్పుకున్నందు మీదట.
53. Admittance Admittance is defined as లోనికి రానివ్వడము, లోనికిరావడానికి శెలవు, ప్రవేశము. I cannotget * to him; or, into his presence అతని వద్ద నాకు ప్రవేశము చిక్కలేదు, అనగా,అతని వద్దకి పోగూడలేదు.
54. Admitted Admitted is defined as చేర్చుకోబడ్డ, రానిచ్చిన, అంగీకరించబడ్డ, వొప్పుకొన్న.* but సరేగాని.
55. Admixture Admixture is defined as మిశ్రమము, కలుపు.
56. Admonition Admonition is defined as బుద్ధిచెప్పడము, బోధన, ఉపదేశము.
57. Admonitory Admonitory is defined as బుద్ధిచెప్పే, బోధించే. an * poem నీతికావ్యము, ఉపదేశ గ్రంథము.
58. Ado Ado is defined as శ్రమ, తొందర, యిబ్బంది. or Bustle అల్లరి, గత్తర. without any more *he paid the money ఆ రూకలను అనాయాసముగా చెల్లించినాడు. I had much * tohelp laughing సంకటపడి నవ్వును అణుచుకొంటిని. he had much * to get foodఅన్నానికి నిండా శ్రమపడ్డాడు.
59. Adolescence Adolescence is defined as యౌవనము, యౌవనావస్థ.
60. Adolescent Adolescent is defined as యౌవనావస్థగా వుండే.
61. Adonis Adonis is defined as అతిసుందరమైనఒకదేవునిపేరు
62. Adopted Adopted is defined as దత్తుచేసుకోబడ్డ, అవలంబించిన. an * son దత్త పుత్రుడు. the method* by these వాండ్లు అవలంబించిన మార్గము.
63. Adoption Adoption is defined as దత్తు, స్వీకారము, అవలంబించడము. from your * of hissentiments వాడి భావము నీకు పట్టుబడ్డది గనక, వాడి బుద్ధే నీకున్ను వచ్చినది గనక.After his * of this plan వాడు యీ యుక్తిని అవలంబించిన తరువాత, యీ మాదిరినిపట్టిన తరువాత.
64. Adoptive father Adoptive father is defined as దత్తు చేసుకొన్న తండ్రి.
65. Adorable Adorable is defined as పూజ్యమైన, పూజనీయమైన, పూజార్హమైన.
66. Adorably Adorably is defined as పూజనీయముగా, పూజార్హముగా.
67. Adoration Adoration is defined as పూజ, అర్చన.
68. Adored Adored is defined as పూజ్యమైన, పూజార్హమైన.
69. Adorer Adorer is defined as పూజచేసేవాడు. an * of the sun సూర్యోపాసకుడు.
70. Adorned Adorned is defined as అలంకరించిన, శృంగారించిన, with many virtues సకలగుణసంపన్నుడైన.
71. Adornment Adornment is defined as అలంకారము, శృంగారము.
72. Adrift Adrift is defined as నీళ్ళమీద కొట్టుకొని పోయే, ఘాలికి కొట్టుకొనిపొయ్యే, విడిచిపెట్టి, దిక్కులేక. Wood that is * నీళ్ళ మీద విడిగా తేలేమాను. that boat is * పడవ ఘాలికికొట్టుకొని పోతుంది. All the cotton is now * యిప్పుడు పత్తి అంతా ఘాలికికొట్టుకపోయినది. he cut the boat * దారమును తెగ్గోసి పడవను యధేచ్ఛగావిడిచిపెట్టినాడు. he cut me * నన్ను నిరాధరముగా విడిచి పెట్టినాడు.
73. Adroit Adroit is defined as చమత్కారియైన, నేర్పరియైన, నిపుణుడైన.
74. Adroitly Adroitly is defined as చమత్కారముగా, నేర్పుగా, నిపుణతగా.
75. Adroitness Adroitness is defined as చమత్కారము, నేర్పు, నిపుణత.
76. Adry Adry is defined as దప్పికగా, దాహముగా. I am * నాకు దాహముగా ఉన్నది.
77. Adscititious Adscititious is defined as అధికమైన, ఉపరియైన, అన్యత్ర తెచ్చుకొన్న.
78. Adulation Adulation is defined as ఇచ్చకము, ముఖస్తుతి, బుజ్జగింపు.
79. Adulator Adulator is defined as ఇచ్చకాలమారి, ముఖస్తుతి చేసేవాడు, బుజ్జగించేవాడు, ఉబ్బించేవాడు.
80. Adulatory Adulatory is defined as బుజ్జగింపైన, స్తోత్రమైన, ఉబ్బించే.
81. Adult Adult is defined as వయసు వచ్చిన మనిషి, ప్రాయపు మనిషి. Both infants and adultsపసివాండ్లున్ను వయసు వచ్చిన వాండ్లున్ను.
82. Adulteration Adulteration is defined as కలిపిచెరపడము, మట్టము చేయడము. to prevent the * ofthis silver యీ వెండి కలపడమై పోకుండా.
83. Adulterer Adulterer is defined as జారుడు, ఒకని పెండ్లాన్ని పట్టేవాడు.
84. Adulteress Adulteress is defined as వ్యభిచారి, జార స్త్రీ.
85. Adulterine Adulterine is defined as పరపురుషునికి పుట్టిన, జారజుడైన.
86. Adulterous Adulterous is defined as రంకుగల, వ్యభిచారముగల.
87. Adultery Adultery is defined as రంకు, వ్యభిచారము, జారత్వము.
88. Adust Adust is defined as యెండిన, శుష్కించిన.
89. Advance Advance is defined as ముందుకు రావడము, అభివృద్ధి, ముందు రూకలు. in his * వాడివతలికిరావడములో. to prevent his * వాడివతలికి రాకుండా నిలపడానకు. his * in theservice was slow వాడికి వుద్యోగము త్వరగా పొడగలేదు. I observed noadvance in his learning వాడికి విద్యలో అభివృద్ధి కానము. he made a rapid * inthe language ఆ భాష వాడికి త్వరగా వచ్చినది. his rapid * in learningsurprises me వాడి విద్యాభివృద్ధిని గురించి నాకు ఆశ్చర్యమౌతున్నది. she madeadvances to him వాడికి బులుపులు పెట్టింది, ఆశ కొలిపింది. he made advancesto a reconciliation మళ్లీ సమాధానము చేసుకోవలెనని యత్నపడ్డాడు. Money paidin * for cultivation వారకము, తక్కావి.
90. Advanced Advanced is defined as ముందుకు వచ్చిన, ముందుకు సాగిన, ముందరనడచిన, అభివృద్ధియైన,పొడిగిన, చాచిన ముందు రూకలిచ్చిన, చెప్పిన. the boy is well * in grammarవ్యాకరణములో బహుదూరము చదివినాడు. Well * in age నిండా యేండ్లు చెల్లిన. * inrank వుద్యోగములో పొడిగిన. the work is now far * ఇప్పుడా పని బహుదూరముజరిగినది. the statement * by them వాండ్లు చెప్పినమాట. the * force ముందుగాపోయిన దండు. Money * to tenants to pay for seed వారకము, తక్కావి. themoney * for this యిందుకై ముందుగా యిచ్చిన రూకలు.
91. Advancement Advancement is defined as అభివృద్ధి.
92. Advantage Advantage is defined as లాభము, ప్రయోజనము, ఉపయోగము, ఆదాయము, ఫలము. thatwill be no * అందువల్ల ఫలము లేదు. he let the * slip లాభమును విడిచిపెట్టినాడు,పోగొట్టుకొన్నాడు. he was born with the advantages of fortune andstrength ఐశ్వరమున్ను కాయపుష్టిన్ని అనే విశేషములతో కూడా పుట్టినాడు. oropportunity సమయము. they took * of his weakness and robbed him వాడిఆశక్తిని చూచుకొని దోచుకొన్నారు. he took * of my absence నేను లేని సమయముచూచుకొన్నాడు. he took * of me నన్ను మోసపుచ్చినాడు. In selling this houseto me he took * of me by concealing its age ఆ ఇంటిని నాకు అమ్మడములోఅది పాతదని తెలియచేయక మోసపుచ్చినాడు. Do you think that I would take an* of you నిన్ను మోసము చేతుననుకొన్నావా. you should not give them such an* over you నీవు వాండ్లకు అట్లా యెడమివ్వరాదు. you have the * of me నీదిపై చెయిగా వున్నది. I had the * of being taught by him ఆయన దగ్గెర చదివినానన్న అధిక్యము నాకు కద్దు. Being on the hill the enemy has the * over usకొండమీద వుండినందున శత్రువులు మాకు పై చెయిగా వుండిరి. he has some * overme in learning చదువులో అతను నాకు కొంచెము పై చెయిగా వున్నాడు. he appearedto great * in this business యీ పనిలో వాడి తేజస్సు బయటపడ్డది, వాడిప్రభావము బయటపడ్డది. he sold the house to * ఆ యింటిని లాభముగా అమ్మినాడు,కిఫాయిత్తుగా అమ్మినాడు. It appears to great * here యీ తట్టునుంచి చూస్తే అదిబాగా కండ్ల బడుతుంది. he arranged his arguments to much * వాడు బద్దలు కట్టిమాట్లాడినాడు, శృంగారించి మాట్లాడినాడు.
93. Advantaged Advantaged is defined as లాభమును పొందిన, ఫలమును పొందిన.
94. Advantage-ground Advantage-ground is defined as వైపుగావుండే స్థలము.
95. Advantageous Advantageous is defined as ప్రయోజనకరమైన, లాభకరమైన, ఫలకరమైన, ఆదాయమైన,ఉపయోగమైన, అనుకూలమైన. he made a very * marriage వివాహముచేసుకోవడమువల్ల వాడికి నిండా వుపయోగము.
96. Advantageously Advantageously is defined as లాభముగా, ఉపయోగముగా.
97. Advantageousness Advantageousness is defined as లాభము, ఫలము, ఆదాయము.
98. Advent Advent is defined as ఆగమనము, అనగా ఖ్రీస్టు మాస్పండుగకు ముందువచ్చే నాలుగు వారాలు.
99. Adventiously Adventiously is defined as తనకుతానే, తనంతటనే, హటాత్తుగా.
100. Adventitious Adventitious is defined as that which happens సంభవించే, సంఘటించే, తటస్థించే,సంప్రాప్తమయ్యే, ఆగంతుకమైన, అవాంతరమైన. or extrinsic పై, బయటి. heeffected this without * aid పై సహాయము లేకనే దీన్ని నెరవేర్చినాడు. she is anexcellent woman; her beauty is an * circumstance అది మహాఘనురాలు దానిఅందము అవివక్షితము.
101. Adventure Adventure is defined as దైవఘటనము, సంభవించినపని, చరిత్ర, వృత్తాంతము, సాహసము,వింత, అతియము. a man of * సాహసుడు. I had an odd * yesterday నిన్ననాకొక అతిశయము సంభవించినది. this ring has had some curious adventuresయీ వుంగరాన్ని గురించి కొన్ని వింతలు సంభవించినవి. Adventures of RobinsonCrusoe రాబి ్స ్ క్రూసో అనే వాని చరిత్ర. the adventures of Aniruddhaఅనిరుద్ధ చరిత్ర. the adventures of Stella and the Genius తారాశాశంకవిజయము. the adventures of Nala నళోపాఖ్యానము. At all adventures youmust go there tomorrow. యేమి సంభవించినా నీవు అక్కడికి పోవలసినది,యెట్లాగైనా పోవలసినది. in trade దేశాంతరమునకు విక్రయానకై పంపించిన సరుకు.
102. Adventurer Adventurer is defined as సాహసి, తెగించినవాడు, అనగా యిందులో మన అదృష్టము బయటపడదా అని వక పనికి తెగించినవాడు. Many adventurers joined the armyశానామంది తమకున్ను యేదయినా ఒక పని చిక్కదా అని తెగించి ఆ దండులో పోయికలిసినారు.
103. Adventuresome Adventuresome is defined as సాహసమైన.
104. Adventurous Adventurous is defined as తెగువగల, సాహసముగల.
105. Adventurously Adventurously is defined as తెగించి, సాహసముగా.

Counter Image
( ? + A B C D E F G H I J K L M N O P Q R S T U V
W X Y Z